LifeStylepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/indiaf9d7ad01-4779-4cec-afb3-ed21aa7ecb21-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/indiaf9d7ad01-4779-4cec-afb3-ed21aa7ecb21-415x250-IndiaHerald.jpg? భారత్ పై నిరంతరం ఏడుస్తూ వున్న కంట్రీ ఏది అనగానే అందరికీ డ్రాగన్ కంట్రీ చైనా గుర్తుకు వస్తుంది. అయితే ఓ విషయంలో భారత్ చైనాను వెనక్కు నెట్టి వేసింది. అదేనండి జనాభా విషయంలో. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించడం కొసమెరుపు. చైనా జనాభా ప్రస్తుతం 142.57 కోట్లు కాగా, భారత దేశ జనాభా 142.86 కోట్లు అని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి తాజాగా వెల్లడించింది. UNFPA తన నివేదికను 'ది స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2023', '8 బిలియన్ లైవ్స్, ఇన్ఫినిట్ పాసిబిలిటీస్: ది కేస్ ఫర్ రైటIndia{#}Population;war;Indiaఆ విషయంలో చైనాను అధిగమించిన భారత్.. ఇది ప్రస్తుత మన దేశ పరిస్థితి?ఆ విషయంలో చైనాను అధిగమించిన భారత్.. ఇది ప్రస్తుత మన దేశ పరిస్థితి?India{#}Population;war;IndiaThu, 20 Apr 2023 15:00:00 GMT

భారత్ పై నిరంతరం ఏడుస్తూ వున్న కంట్రీ ఏది అనగానే అందరికీ డ్రాగన్ కంట్రీ చైనా గుర్తుకు వస్తుంది. అయితే ఓ విషయంలో భారత్ చైనాను వెనక్కు నెట్టి వేసింది. అదేనండి జనాభా విషయంలో. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించడం కొసమెరుపు. చైనా జనాభా ప్రస్తుతం 142.57 కోట్లు కాగా, భారత దేశ జనాభా 142.86 కోట్లు అని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి తాజాగా వెల్లడించింది. UNFPA తన నివేదికను 'ది స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2023', '8 బిలియన్ లైవ్స్, ఇన్ఫినిట్ పాసిబిలిటీస్: ది కేస్ ఫర్ రైట్స్ అండ్ ఛాయిస్' శీర్షికతో నివేదిక విడుదల చేయగా ఇపుడు ఈ విషయం అన్ని మీడియాలలో చక్కెర్లు కొడుతోంది.

ఈ నివేదిక ప్రకారం చూసుకుంటే, ఇరు దేశాల మధ్య దాదాపు 29 లక్షల జనాభా తేడా మాత్రమే ఉంది. 2022లోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరిస్తుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. కాగా అది నేటితో నెరవేరింది. ఇక ప్రపంచంలోనే అత్యధిక యువత జనాభా కూడా భారత్‌లోనే ఉండడం గమనార్హం. UNFPA నివేదిక ప్రకారం.. భారతదేశ జనాభాలో 0-14 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు 25% మంది ఉంటే, 10-19 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు 18% మంది, 10-24 సంవత్సరాల వయస్సు గలవారు 26% మంది, 15-64 సంవత్సరాల వయస్సు గల వారు 68% మంది, 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు 7% మంది ఉన్నట్టు సమాచారం.

అయితే.. సగటు ఆయుర్దాయం పరంగా భారతదేశం కంటే చైనా మెరుగ్గా ఉన్నట్టు మాత్రం తెలుస్తోంది. ఇక్కడ ఆడవారికి 82 ఏండ్ల కాగా.. పురుషుల ఆయుర్దాయం 76 సంవత్సరాలు. భారతదేశ ఆయుర్దాయం విషయానికి వస్తే.. ఆడవారి ఆయుర్దాయం 74 ఏండ్ల కాగా.. మగవారి ఆయుర్దాయం 71 ఏండ్లుగా ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి జనాభా డేటా రికార్డులో 1950 నుండి భారతదేశ జనాభా చైనా కంటే ఎక్కువగా నమోదు కావడం ఇదే మొదటిసారి, వాస్తవానికి 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఐక్యరాజ్యసమితి స్థాపించబడింది మరియు 1950 ఐక్యరాజ్యసమితి జనాభా డేటా సేకరించి జారీ చేయడం ప్రారంభించారు.



RRR Telugu Movie Review Rating

అదిరిపోయే డిఫరెంట్ లుక్ ఉన్న డ్రెస్లో అందాలను ఆరబోస్తున్న మృణాల్ ఠాకూర్..!

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చాలు.. ఇక ఆఫీసుకు రండి?

ఇకనైనా పవన్‌.. ఆ లోపం సరిచేయాలి?

కొడాలి నానికి షాక్‌ ఇవ్వాలని బాబు డిసైడ్‌ ?

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>