Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-3704f2bb-e66f-4a0a-adfc-c6b2aa5c77f3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-3704f2bb-e66f-4a0a-adfc-c6b2aa5c77f3-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ రంగంలో ఆంధ్రులు అందాల నటుడు, సోగ్గాడు అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి శోభన్ బాబు. కుటుంబ కథా చిత్రాలతో మహిళా ప్రేక్షకుల మనస్సు దోచుకున్నారు. అయితే శోభన్ బాబు సెట్ లో నవ్వుతూ, నవ్విస్తుంటారని ఆయనతో పని చేసిన వ్యక్తులు చెబుతుంటారు. అయితే ఓ హీరోయిన్ విషయంలో తీవ్ర అసహనానికి గురై.. ఆమెను అవమానించారట. సినీ రంగ ప్రపంచంలో ఒకప్పడి అగ్ర నటుల్లో ఒకరు శోభన్ బాబు. ఉమ్మడి ఆంధ్రపదేశ్ సమయంలో 'ఆంధ్రుల అందాల నటుడు శోభన్ బాబు'సినిమా రిలీజ్ అవుతుందంటూ ప్రచారం చేసేవారు. రింగుల జుట్టుతో మహిళాభిమానుల మనస్సSocialstars lifestyle {#}Nagma;sobhan babu;surabhi;Soggadu;Major Chandrakanth;Hindi;Heroine;Hero;Cinemaనగ్మా ను దారుణంగా అవమానించిన సీనియర్ స్టార్ హీరో....!!నగ్మా ను దారుణంగా అవమానించిన సీనియర్ స్టార్ హీరో....!!Socialstars lifestyle {#}Nagma;sobhan babu;surabhi;Soggadu;Major Chandrakanth;Hindi;Heroine;Hero;CinemaThu, 20 Apr 2023 07:24:54 GMTతెలుగు సినీ రంగంలో ఆంధ్రులు అందాల నటుడు, సోగ్గాడు అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి శోభన్ బాబు. కుటుంబ కథా చిత్రాలతో మహిళా ప్రేక్షకుల మనస్సు దోచుకున్నారు.

అయితే శోభన్ బాబు సెట్ లో నవ్వుతూ, నవ్విస్తుంటారని ఆయనతో పని చేసిన వ్యక్తులు చెబుతుంటారు. అయితే ఓ హీరోయిన్ విషయంలో తీవ్ర అసహనానికి గురై.. ఆమెను అవమానించారట. సినీ రంగ ప్రపంచంలో ఒకప్పడి అగ్ర నటుల్లో ఒకరు శోభన్ బాబు. ఉమ్మడి ఆంధ్రపదేశ్ సమయంలో 'ఆంధ్రుల అందాల నటుడు శోభన్ బాబు'సినిమా రిలీజ్ అవుతుందంటూ ప్రచారం చేసేవారు.

రింగుల జుట్టుతో మహిళాభిమానుల మనస్సులను 'చోర్' చేశాడాయన. ఇద్దరు భార్యలుండే కుటుంబ కథా చిత్రాల హీరో అనగానే శోభన్ బాబే గుర్తుకు వచ్చేవారు అప్పటి దర్శక నిర్మాతలకు. నట భూషణుడు, సోగ్గాడు వంటివి ఆయనకు అభిమానులు ఇచ్చిన బిరుదులు. షూటింగ్ సమయాల్లో నవ్వుతూ, నవ్విస్తూ ఉండే ఆయనకు.. కోపం అరుదుగా వచ్చేదట. ఇక వస్తే.. ఇట్టే తగ్గేది కాదట. ఓ హీరోయిన్ విషయంలో కూడా ఆయన సీరియస్ అయ్యి.. ఆమెపై విరుచుకు పడ్డారట.

 

ఇంతకు శోభన్ బాబు కోపానికి కారణమైన ఆ హీరోయిన్ ఎవరంటే ప్రముఖ నటి (Nagma) నగ్మా. హిందీ సినిమా నుండి తెలుగులోకి వచ్చి పెద్దింటి అల్లుడు, కిల్లర్, ఘరానా మొగుడు, మేజర్ చంద్రకాంత్ వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ సమయంలో శోభన్ బాబుతో కలిసి అడవి దొర అనే సినిమాలో నటించింది. అందులో మరో హీరోయిన్‌గా సురభి నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ సాంగ్ చిత్రీకరణ కోసం చైనా సరిహద్దుకు సమీపంలో చిత్ర యూనిట్ వెళ్లింది.

 

అయితే అందరూ వచ్చారు కానీ నగ్మా మాత్రం రాలేదట. అయితే ఆమె కోసం శోభన్ బాబు చాలా సేపు వెయిట్ చేశారట. గంటన్నర ఆలస్యంగా షూటింగ్ స్పాట్‌కు రావడమే కాకుండా.. తలతిక్క సమాధానాలు చెప్పడంతో శోభన్ బాబుకు ఒక్కసారిగా చిర్రెత్తుకు వచ్చిందట. నగ్మాను శోభన్ బాబు పిలిచి.. నీ ఆస్తి మొత్తం ఎంత ఉంటుంది అని అడిగారట. దానికి నగ్మా సమాధానం ఇవ్వగా.. 'నా బాత్రూం విలువ చేయదు నీ ఆస్తి టైమ్ సెన్స్ ఉండాలి' అంటూ సీరియస్ అయ్యారట. శోభన్ బాబు ఇచ్చిన వార్నింగ్ తో నగ్మా నోట మాట రాలేదట. ఆ తర్వాత శోభన్ బాబు బ్యాగ్రౌండ్ తెలిసి నగ్మా నోరెళ్లబెట్టిందట. దాంతో తన తప్పు తెలుసుకొని పశ్చత్తాపపడిందట. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే శోభన్ బాబు ఆదా చేయడం మొదలు పెట్టారు. భూమిపై ఎన్నో పెట్టుబుడులు పెట్టారు. వ్యక్తిగా శోభన్ బాబు చాలా నిరాడంబరుడు. ఎంతో డబ్బు సంపాదించినా ఎన్నడూ ఆడంబర జీవితం గడపలేదు.



RRR Telugu Movie Review Rating

ఉత్తరాంధ్ర : జగన్ వ్యూహం ఇదేనా ?

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చాలు.. ఇక ఆఫీసుకు రండి?

ఇకనైనా పవన్‌.. ఆ లోపం సరిచేయాలి?

కొడాలి నానికి షాక్‌ ఇవ్వాలని బాబు డిసైడ్‌ ?

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>