Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-8eac4467-d309-4939-9309-6a680358e344-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-8eac4467-d309-4939-9309-6a680358e344-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంయుక్త మీనన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంయుక్త ఆ తర్వాత వరుసగా తెలుగులో నటిస్తూ వస్తుంది. మొదటి చిత్రం భీమ్లా నాయక్ సక్సెస్ అవ్వడంతో ఆ తర్వాత చేసిన బింబిసారా మరియు సార్ చిత్రాలు కూడా సంయుక్త కి మంచి విజయాలను తెచ్చిపెట్టాయి. మూడు వరుస విజయాలు సొంతం చేసుకోవడంతో ఈ ముద్దుగుమ్మను లక్కీ బ్యూటీ అంటూ పిలవడం మొదలు పెట్టారు. ఈ ముద్దుగుమ్మ రేపు సాయి ధరమ్ తేజ్ తో కలిసి విరూపాక్ష చిత్రంతో ప్రేSocialstars lifestyle {#}Nayak;kalyan;media;kalyan ram;BEAUTY;Amarnath K Menon;Tollywood;Chitram;sai dharam tej;Telugu;Heroine;News;Cinemaసంయుక్త మీనన్ చేసే ప్రయత్నాలు సక్సెస్ అయ్యేనా...!!సంయుక్త మీనన్ చేసే ప్రయత్నాలు సక్సెస్ అయ్యేనా...!!Socialstars lifestyle {#}Nayak;kalyan;media;kalyan ram;BEAUTY;Amarnath K Menon;Tollywood;Chitram;sai dharam tej;Telugu;Heroine;News;CinemaThu, 20 Apr 2023 11:44:17 GMTఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంయుక్త మీనన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంయుక్త ఆ తర్వాత వరుసగా తెలుగులో నటిస్తూ వస్తుంది.

మొదటి చిత్రం భీమ్లా నాయక్ సక్సెస్ అవ్వడంతో ఆ తర్వాత చేసిన బింబిసారా మరియు సార్ చిత్రాలు కూడా సంయుక్త కి మంచి విజయాలను తెచ్చిపెట్టాయి. మూడు వరుస విజయాలు సొంతం చేసుకోవడంతో ఈ ముద్దుగుమ్మను లక్కీ బ్యూటీ అంటూ పిలవడం మొదలు పెట్టారు. ఈ ముద్దుగుమ్మ రేపు సాయి ధరమ్ తేజ్ తో కలిసి విరూపాక్ష చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమాలో సంయుక్త పాత్ర చాలా విభిన్నంగా ఉండడంతో పాటు ఆకట్టుకునే విధంగా ఉంటుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఇక విరూపాక్ష చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా పలు మీడియా సంస్థలకు సంయుక్త మీనన్ ఇంటర్వ్యూలు ఇచ్చింది.

అందులో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరోల దృష్టిలో పడే విధంగా వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా టాలీవుడ్ ఫిలిం మేకర్స్ ని ఆకర్షించే విధంగా కూడా సంయుక్త మీనన్ కామెంట్స్ చేసింది. ఇతర భాషల నుండి ఆఫర్స్ వస్తున్నప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేయాలని ఉద్దేశంతో వాటిని కాదంటున్నట్లుగా పేర్కొంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి భారీగా రెమ్యూనరేషన్ దక్కుతుంది. అందుకే సంయుక్త తెలివిగా ఇక్కడే వరుసగా సినిమాలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా ఆమె సన్నిహితుల ద్వారా సమాచారం అందుతుంది. మరి ఈ ముద్దుగుమ్మకు తెలుగులో స్టార్ హీరోలకు జోడిగా నటించే అవకాశాలు లభించేనా.. అలాగే స్టార్ ఫిలిం మేకర్స్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాల్లో నటించే అవకాశం దక్కేనా అనేది చూడాలి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న డెవిల్ అనే సినిమాలో నటిస్తోంది. ఆ తర్వాత మరికొన్ని సినిమాలు చేసేందుకు ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.



RRR Telugu Movie Review Rating

మరో టాలీవుడ్ స్టార్ హీరో మూవీలో అవకాశం దక్కించుకున్న జాన్వి కపూర్..!

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చాలు.. ఇక ఆఫీసుకు రండి?

ఇకనైనా పవన్‌.. ఆ లోపం సరిచేయాలి?

కొడాలి నానికి షాక్‌ ఇవ్వాలని బాబు డిసైడ్‌ ?

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>