MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyanf49c145e-9778-49aa-89eb-3d1ba0ea1569-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyanf49c145e-9778-49aa-89eb-3d1ba0ea1569-415x250-IndiaHerald.jpgరామ్ గోపాల్ వర్మ శిష్యుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు జెడి చక్రవర్తి హీరోగా దర్శకుడుగా అనేకప్రయోగాలు చేసినప్పటికీ ఆప్రయోగాలలో పూర్తిగా సక్సస్ సాధించలేకపోయాడు. ప్రస్తుతం ఇంచుమించు సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే గతంలో ఒక సినిమా విషయంలో అతడు చేసిన ప్రమోగం ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకు స్పూర్తిగా మారే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో మాటలు వినిపిస్తున్నాయి.పవన్ సాయి ధరమ్ తేజ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘వినోదయ సితం’ తెలుగు రీమేక్ షూటింగ్ ఇంచుమించు పూర్తి అయింది త్వరలో పవన్ సాయి ధpavankalyan{#}Ram Gopal Varma;sai dharam tej;Telugu;trivikram srinivas;Athadu;chakravarthy;Mass;Industry;producer;Producer;kalyan;Heroine;Cinema;Newsపవన్ సినిమాకు జెడి చక్రవర్తి స్పూర్తి !పవన్ సినిమాకు జెడి చక్రవర్తి స్పూర్తి !pavankalyan{#}Ram Gopal Varma;sai dharam tej;Telugu;trivikram srinivas;Athadu;chakravarthy;Mass;Industry;producer;Producer;kalyan;Heroine;Cinema;NewsWed, 19 Apr 2023 10:00:00 GMTరామ్ గోపాల్ వర్మ శిష్యుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు జెడి చక్రవర్తి హీరోగా దర్శకుడుగా అనేకప్రయోగాలు చేసినప్పటికీ ఆప్రయోగాలలో పూర్తిగా సక్సస్ సాధించలేకపోయాడు. ప్రస్తుతం ఇంచుమించు సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే గతంలో ఒక సినిమా విషయంలో అతడు చేసిన ప్రమోగం ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకు స్పూర్తిగా మారే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో మాటలు వినిపిస్తున్నాయి.


పవన్ సాయి ధరమ్ తేజ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘వినోదయ సితం’ తెలుగు రీమేక్ షూటింగ్ ఇంచుమించు పూర్తి అయింది త్వరలో పవన్ సాయి ధరమ్ తేజ్ శ్రీలీల పై ఒక మాస్ సాంగ్ ని తీయబోతున్నారు. ఈపాట చిత్రీకరణతో ఈమూవీ షూటింగ్ ఇంచుమించు పూర్తి అవుతుంది అంటున్నారు. జూలైలో విడుదలకాబోతున్న ఈమూవీ టైటిల్ కు సంబంధించి అనేక టైటిల్స్ బయటకు లీక్ అయ్యాయి.


పవన్ సాయి ధరమ్ తేజ్ లను కలుపుతూ ఒక టైటిల్ ఉంటే బాగుంటుందని భావించి ఈమూవీ నిర్మాతలు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చర్చలు జరుపుతున్నట్లు టాక్. ఇప్పటికే ఈమూవీకి సంబంధించి కొన్ని టైటిల్స్ బయటకు లీక్ అయ్యాయి. ‘దేవర’ ‘దేవుడు’ అన్న టైటిల్స్ పరిశీలనలో ఉన్నప్పటికీ ఆటైటిల్స్ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం అధికారికంగా ప్రకటింపబడలేదు. ఇలాంటి పరిస్థితులలో ఈసినిమాకు సంబంధించిన ఒక నిర్మాత ఒకమీడియాకు సంబంధించిన ప్రతినిధితో మాట్లాడుతూ తమ మూవీకి టైటిల్ లేకుండా విడుదల చేసి ఆతరువాత ప్రేక్షకులను ఈమూవీ టైటిల్ ఏది పెడితే బాగుంటుందో చెప్పమని దైరెక్ట గా పవన్ అభిమానులకు తెలియచేయమని అడుగుతున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.


అయితే ఇలాంటి ప్రయోగం ఒక సాహసం. సుమారు రెండు దశాబ్దాల క్రితం ఇలాంటి ఆలోచనలు జేడీ చక్రవర్తికి రావడంతో అప్పట్లో అతడు ఒకప్పటి క్రేజీ హీరోయిన్ మీనాతో కలిసి అతడు నటించిన మూవీని టైటిల్ లేకుండా విడుదల చేసి ఆతరువాత ఆమూవీకి ‘పాపే నా ప్రాణం’ అన్న టైటిల్ ఫిక్స్ చేసారు. ఇప్పుడు అలాంటి ప్రయోగం పవన్ సాయి ధరమ్ మూవీ విషయంలో ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది అన్నఆలోచనలు ఈమూవీ నిర్మాతలకు వచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా ఈమూవీని టైటిల్ లేకుండా విడుదలచేసి ఆతరువాత ఈసినిమా చూసిన ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం టైటిల్ పెడతారట అన్న వార్తలు వినిపిస్తున్నాయి..





RRR Telugu Movie Review Rating

డిసెంబర్ వరకు ప్రస్తుత సినిమాల పనులను ముగించనున్న ప్రభాస్..!

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?

నేడో, రేపో.. ఆ దేశంపై చైనా యుద్ధం?

నితీశ్‌ చాణక్యం రాహుల్‌ను ప్రధాని చేస్తుందా?

బాబులో భారీగా మార్పు తెచ్చిన జగన్ లెక్కలు?

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>