MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas2f2ee02a-3dd3-4ef2-90f8-9000c5ed10f3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas2f2ee02a-3dd3-4ef2-90f8-9000c5ed10f3-415x250-IndiaHerald.jpgఇక రాధేశ్యామ్ సినిమా తర్వాత వరుసగా భారీ బడ్జెట్ సినిమాలని అనౌన్స్ చేసి బాగా బిజీగా అయ్యారు డార్లింగ్ ప్రభాస్.కానీ ఇప్పటి దాకా అసలు మరో రిలీజ్ కాలేదు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు కావడంతో ఆ ప్రాజెక్ట్స్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులో డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తోన్న ఆదిపురుష్ సినిమా కూడా ఒకటి. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా.. సీతగా కృతి సనన్.. ఇంకా రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. చాలా అంచనాలు నెలPRABHAS{#}ajay atul;Saif Ali Khan;June;Darling;Prabhas;India;Director;News;Cinemaఆదిపురుష్: ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్?ఆదిపురుష్: ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్?PRABHAS{#}ajay atul;Saif Ali Khan;June;Darling;Prabhas;India;Director;News;CinemaWed, 19 Apr 2023 13:40:00 GMTఇక రాధేశ్యామ్ సినిమా తర్వాత వరుసగా భారీ బడ్జెట్ సినిమాలని అనౌన్స్ చేసి బాగా బిజీగా అయ్యారు డార్లింగ్ ప్రభాస్.కానీ ఇప్పటి దాకా అసలు మరో రిలీజ్ కాలేదు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు కావడంతో ఆ ప్రాజెక్ట్స్ పై భారీ అంచనాలు  నెలకొన్నాయి. అందులో డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తోన్న ఆదిపురుష్ సినిమా కూడా ఒకటి. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా.. సీతగా కృతి సనన్.. ఇంకా రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. చాలా అంచనాలు నెలకొన్న ఈ సినిమా టీజర్ అభిమానులను నిరాశకు గురిచేసిన సంగతి తెలిసిందే. వీఎఫ్ఎక్స్.. ప్రభాస్, సైఫ్ లుక్స్ పై చాలా విమర్శలు వచ్చాయి. దీంతో జనవరికి విడుదల కావాల్సిన మూవీ జూన్ దాకా వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా మరో అరుదైన గౌరవం దక్కించుకుంది.జూన్ 13 వ తేదీన జరిగే.. అంటే విడుదలకు మూడు రోజుల ముందు ట్రిబెకా వేడుకలలో ఈ సినిమాని ప్రీమియర్ చేయనున్నారు. ఈ విషయాన్ని ట్రిబెకా అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా తెలిసింది. 


అలాగే ఈ సినిమా రన్ టైమ్ పై కూడా క్లారిటీ వచ్చేసింది. ఇక ఆ వెబ్ సైట్ ప్రకారం.. ఆదిపురుష్ రన్ టైమ్ 174 నిమిషాలు. అంటే.. 2 గంటల 54 నిమిషాలు ఉంటుంది. గతంలో కూడా ఈ రన్ టైమ్ పై చాలా వార్తలు వినిపించాయి. ముందు ఈ మూవీ 3 గంటల 16 నిమిషాల రన్ టైమ్ ఫిక్స్ చేశారని టాక్ వినిపించింది. లాస్ట్ కి 2 గంటల 54 నిమిషాలు ఫిక్స్ చేశారు. అయితే ఈ రన్ టైమ్ కాస్త ఎక్కువనే చెప్పాలి. ప్రారంభం మొదట్లోనే ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న చిత్రయూనిట్.. ప్రేక్షకులను అంత సమయం ఎంటర్టైన్ చేయగలదా అనే సందేహాలు బాగా వ్యక్తమవుతున్నారు.బాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఓంరౌత్ ఇంకా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు అజయ్ అతుల్ సంగీతం అందిస్తున్నారు. ముందుగా సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన ఈ మూవీ మేకర్స్.. ఆ తర్వాత జూన్ 16 వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మరీ చూడాలి ఆదిపురుష్ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఏ విధంగా మెప్పిస్తుందో.



RRR Telugu Movie Review Rating

రాబోయే 4 నెలల్లో విడుదలకు రెడీగా ఉన్న క్రేజీ మూవీలు ఇవే..!

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?

నేడో, రేపో.. ఆ దేశంపై చైనా యుద్ధం?

నితీశ్‌ చాణక్యం రాహుల్‌ను ప్రధాని చేస్తుందా?

బాబులో భారీగా మార్పు తెచ్చిన జగన్ లెక్కలు?

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>