Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl57c9a2e4-237e-4a1d-9fd5-08abc698785b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl57c9a2e4-237e-4a1d-9fd5-08abc698785b-415x250-IndiaHerald.jpgఇటీవలే భాగ్యనగరం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ , ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ హోరా హోరీగా జరగగా.. చివరికి ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. సొంత గడ్డపైనే అటు హైదరాబాద్ జట్టును మట్టి కరిపించింది అని చెప్పాలి. అయితే ముంబై ఇండియన్స్ అయితే విజయం సాధించింది కానీ అటు రోహిత్ శర్మ చేసిన పని కాస్త అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది అని చెప్పాలి. సాధారణంగా జట్టుకు కెప్టెన్ గా ఉన్న వ్యక్తి రివ్యూ తీసుకోవడం విషయంలో ఎంతో కచ్చితత్వంతో ఉంటాడు. సాధారణIpl{#}Ishan Kishan;Cameroon;ishaan actor;Hyderabad;Rohit Sharma;Mumbaiరోహిత్.. మరి ఇంత గుడ్డిగా నమ్మితే ఎలా?రోహిత్.. మరి ఇంత గుడ్డిగా నమ్మితే ఎలా?Ipl{#}Ishan Kishan;Cameroon;ishaan actor;Hyderabad;Rohit Sharma;MumbaiWed, 19 Apr 2023 11:30:00 GMTఇటీవలే భాగ్యనగరం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ , ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ హోరా హోరీగా జరగగా.. చివరికి ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. సొంత గడ్డపైనే అటు హైదరాబాద్ జట్టును మట్టి కరిపించింది అని చెప్పాలి. అయితే ముంబై ఇండియన్స్ అయితే విజయం సాధించింది కానీ అటు రోహిత్ శర్మ చేసిన పని కాస్త అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది అని చెప్పాలి. సాధారణంగా జట్టుకు కెప్టెన్ గా ఉన్న వ్యక్తి రివ్యూ తీసుకోవడం విషయంలో ఎంతో కచ్చితత్వంతో  ఉంటాడు.



 సాధారణంగా రివ్యూ విషయంలో జట్టులో ఉన్న ఆటగాళ్లు ఏదో ఒకటి చెప్పి ప్రభావితం చేయడం చేస్తూ ఉంటారు. కానీ కెప్టెన్ అందరి మాటలను వినకుండా తనకంటూ ఒక అభిప్రాయాన్ని పెట్టుకొని ఇక అదే అభిప్రాయం ప్రకారం రివ్యూ తీసుకోవాల్సి ఉంటుంది.  కానీ రోహిత్ శర్మ మాత్రం ఇటీవల కాలంలో రివ్యూ తీసుకోవడం విషయంలో సహచర ఆటగాళ్లను గుడ్డిగా నమ్ముతున్నాడు అన్నది తెలుస్తుంది. ఎక్కడ సొంత నిర్ణయాలు తీసుకోవడం లేదు రోహిత్ శర్మ. దీంతోరోహిత్ శర్మ తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



 ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ సమయంలో కూడా రోహిత్ ఇలాంటిదే చేశాడు. ఏకంగా ఇషాన్ కిషన్ చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మిన రోహిత్ శర్మ.. చేతులు కాల్చుకున్నాడు అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే.. సన్రైజర్స్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో కామెరూన్ గ్రీన్ వేసిన మూడో బంతి లెగ్ సైడ్ వెళ్ళింది. క్లియర్ గా వైడ్ అని తెలిసినప్పటికీ ఇషాన్ కిషన్ అవుట్ అంటూ అప్పీల్ చేశాడు. ఫీల్డ్ ఎంపైర్ వైడ్ గా సిగ్నల్ ఇచ్చినప్పటికీ తనకు బ్యాట్ కి తగిలినట్లుగా సౌండ్ వినిపించిందని కచ్చితంగా అవుట్ అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పాడు ఇషాన్. రోహిత్ కి కూడా వైడ్ అని తెలిసినప్పటికీ ఇషాన్ కిషన్ను గుడ్డిగా నమ్మి రివ్యూ కి వెళ్ళాడు. రివ్యూకి వెళ్తే అల్ట్రా సౌండ్ లో బ్యాడ్ బంతికి తగలలేదు అన్నది అర్థమైంది. దీంతో ముంబై ఇండియన్స్ కి ఒక రివ్యూ పోయింది. ఇది చూశాక గుడ్డిగా నమ్మడమేనా నీకంటూ సొంత నిర్ణయం లేదా అని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
">



RRR Telugu Movie Review Rating

పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్న ప్రభాస్...!!

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?

నేడో, రేపో.. ఆ దేశంపై చైనా యుద్ధం?

నితీశ్‌ చాణక్యం రాహుల్‌ను ప్రధాని చేస్తుందా?

బాబులో భారీగా మార్పు తెచ్చిన జగన్ లెక్కలు?

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>