HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthde608734-2708-4eae-9702-cf492022e9ae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthde608734-2708-4eae-9702-cf492022e9ae-415x250-IndiaHerald.jpgబయట ఎండలు ఓ రేంజిలో ఉన్నాయి.వృద్ధులు, చిన్నపిల్లలకు అయితే వడదెబ్బ ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీరి శరీరం అనేది తీవ్ర ఉష్ణోగ్రతలకు త్వరగా సర్దుకుపోలేదు. ఇక గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం, డయాబెటిస్ వంటి తదితర వ్యాధులతో బాధపడుతున్న రోగులకు కూడా వడదెబ్బ తగిలే అవకాశం చాలా ఎక్కువగా వుంది. ఇంకా ఆల్కహాల్ సేవించేవారు, బిగుతైన వస్త్రాలు ధరించేవారు అలాగే వేడిని అధికంగా గ్రహించే దుస్తులు వేసుకునేవారు కూడా ఎండలో తిరిగితే వడదెబ్బ ప్రభావం చాలా రెట్టింపు అవుతుంది.వడదెబ్బ లక్షణాలనేవి మన శరీరంలో చాలా health{#}Air;Doctor;Sugar;Heartవడదెబ్బ: ఎవరికీ వస్తుంది? వస్తే చికిత్స ఏంటి?వడదెబ్బ: ఎవరికీ వస్తుంది? వస్తే చికిత్స ఏంటి?health{#}Air;Doctor;Sugar;HeartTue, 18 Apr 2023 14:19:49 GMTబయట ఎండలు ఓ రేంజిలో ఉన్నాయి.వృద్ధులు, చిన్నపిల్లలకు అయితే వడదెబ్బ ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీరి శరీరం అనేది తీవ్ర ఉష్ణోగ్రతలకు త్వరగా సర్దుకుపోలేదు. ఇక గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం, డయాబెటిస్ వంటి తదితర వ్యాధులతో బాధపడుతున్న రోగులకు కూడా వడదెబ్బ తగిలే అవకాశం చాలా ఎక్కువగా వుంది. ఇంకా ఆల్కహాల్ సేవించేవారు, బిగుతైన వస్త్రాలు ధరించేవారు అలాగే వేడిని అధికంగా గ్రహించే దుస్తులు వేసుకునేవారు కూడా ఎండలో తిరిగితే వడదెబ్బ ప్రభావం చాలా రెట్టింపు అవుతుంది.వడదెబ్బ లక్షణాలనేవి మన శరీరంలో చాలా వేగంగా కనిపిస్తాయి.వాటిని గుర్తించి వెంటనే డాక్టర్ దగ్గరకి వెళ్లాలి.ఈ ఎండదెబ్బ తగిలినప్పుడు బాడీ టెంపరేచర్, హార్ట్ బీట్, బ్రీతింగ్ రేట్ అనేవి బాగా విపరీతంగా పెరుగుతాయి.తలనొప్పి, వికారం, వాంతులు, తల తిరుగుడు, మూర్ఛలు ఇంకా అపస్మారక స్థితి వంటి లక్షణాలు కూడా ఎక్కువగా తలెత్తుతాయి.ఇక అత్యంత వేడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే సమయాల్లో ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాలి.


వదులుగా ఉండే లైట్ కలర్ డ్రెస్సులు మాత్రమే ఎక్కువగా ధరించాలి. ఈ సీజన్లో నీరు లేదా స్పోర్ట్స్ డ్రింక్స్ ఎక్కువగా తాగాలి. ఆల్కహాల్, కెఫిన్‌కు ఖచ్చితంగా వీలైనంత దూరంగా ఉండాలి. బయటకు వెళ్లాల్సి వస్తే నీడ ఉన్న ప్రదేశాల్లోనే ఎక్కువగా కూర్చోవాలి. మీకు చల్లగా ఉండటానికి ఫ్యాన్లు లేదా ఏసీలు ఖచ్చితంగా వినియోగించాలి.ఎవరైనా ఎండదెబ్బకు గురై కింద కనుక పడిపోతే వెంటనే వైద్య సహాయం కోసం కాల్ చేయాలి. తరువాత వారిని చల్లగా ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లాలి. వారికి గాలి విసురుతూ చల్లని నీటిని వారి చర్మంపై పోయాలి. వడదెబ్బకు గురైన వారు అపస్మారక స్థితిలోకి వెళ్లకుండా ఉండాలంటే వారికి మంచినీరు లేదా స్పోర్ట్స్ డ్రింక్స్ ని తాగించాలి. వారి బ్రీతింగ్, హార్ట్ రేట్ సాధారణ స్థితి వచ్చేంత దాకా జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పటికీ వారి పరిస్థితి మెరుగుపడకపోతే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. అక్కడ వైద్యులు శరీరాన్ని రీహైడ్రేట్ చేయడానికి ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్ ని ఇస్తారు. ఇంకా మూర్ఛలను నియంత్రించడానికి లేదా ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడానికి మందులని అందిస్తారు. ఐస్ బాత్స్‌ లేదా కూలింగ్ బ్లాంకెట్లు ఇచ్చి కూడా వారికి చికిత్స చేస్తారు.



RRR Telugu Movie Review Rating

"రుద్రుడు" మూవీ సాటిలైట్ ... డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థలు..?

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?

చైనా వల్ల ప్రపంచానికి మరో మాయరోగం?

జగన్ స్టిక్కర్లు.. ఓహో.. అసలు ప్లాన్ ఇదా?

వివాదాల్లో విశాఖలోని ఆ స్టూడియో?

లోకేశ్‌ ఆ మాట అన్నాడా.. ఏది నిజం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>