EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/komatireddy8bf421d8-a5f3-4a1f-a343-94d5b944621c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/komatireddy8bf421d8-a5f3-4a1f-a343-94d5b944621c-415x250-IndiaHerald.jpgకోమటిరెడ్డి వెంకట రెడ్డి రెండు పడవల మీద కాళ్ళేసి అలాగే సాగుతున్నట్లు తెలుస్తుంది. మొన్ననే నరేంద్ర మోడీని కలిసి అడిగితే అభివృద్ధి కోసం అని చెప్పారు. అంతకుముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి కూడా అదే చెప్పారు‌. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక పక్కన భారతీయ జనతా పార్టీ వైపు వెళ్తూనే కాంగ్రెస్ పడవలో కూడా కాలు పెడుతున్నట్లుగా తెలుస్తుంది. మొన్న పార్టీ నన్ను అవమానించిందని తీవ్ర వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి, మంచిర్యాలలో జరిగిన కార్యక్రమానికి అటెండ్ అవ్వడం విచిత్రం. మల్లికార్జున కార్గే వచ్KOMATIREDDY{#}Narendra;Uttar Pradesh;Bharatiya Janata Party;Congress;Reddy;Partyకోమటిరెడ్డి.. ఏదీ తేల్చుకోలేకపోతున్నారా?కోమటిరెడ్డి.. ఏదీ తేల్చుకోలేకపోతున్నారా?KOMATIREDDY{#}Narendra;Uttar Pradesh;Bharatiya Janata Party;Congress;Reddy;PartyTue, 18 Apr 2023 11:00:00 GMTకోమటిరెడ్డి వెంకట రెడ్డి రెండు పడవల మీద కాళ్ళేసి అలాగే సాగుతున్నట్లు తెలుస్తుంది. మొన్ననే నరేంద్ర మోడీని కలిసి అడిగితే అభివృద్ధి కోసం అని చెప్పారు. అంతకుముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి కూడా అదే చెప్పారు‌. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక పక్కన భారతీయ జనతా పార్టీ వైపు వెళ్తూనే కాంగ్రెస్ పడవలో కూడా కాలు పెడుతున్నట్లుగా తెలుస్తుంది.


మొన్న పార్టీ నన్ను అవమానించిందని తీవ్ర వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి, మంచిర్యాలలో జరిగిన కార్యక్రమానికి అటెండ్ అవ్వడం విచిత్రం. మల్లికార్జున కార్గే వచ్చినటువంటి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన పార్టీ అని, ఆ పార్టీని ఎవరూ ఏమీ చేయలేరంటూ ఉపన్యాసాలు కూడా ఇచ్చారు. అంటే ఆయన డైలమాలో ఉన్నట్టున్నారని జాతీయ పార్టీలో తప్పితే, ప్రాంతీయ పార్టీల్లో ఆయన చేరలేరని, ఏ టీ.ఆర్.ఎస్ లాంటి పార్టీలో చేరితే కనుక నలుగురితో నారాయణ అన్నట్టు ఉండాలి.


జాతీయ పార్టీలో అయితే కొంత స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని ఆయన అభిప్రాయమని కొందరి అభిప్రాయం. భారతీయ జనతా పార్టీలో చేరదామంటే నల్గొండలో కుదరని పరిస్థితి. ఇప్పుడిప్పుడే అక్కడ బిజెపి పికప్ అవ్వాలి, అది కూడా మళ్ళీ వీళ్ళ వల్లే కావాలి. మొన్న మునుగోడులో ఆయన సోదరుడు అంత డబ్బు ఖర్చుపెట్టినా ఓడిపోవడంతో ఈయన అడుగు ముందుకు వేయలేకపోతున్నారని, అలాగని కాంగ్రెస్ లోనే ఉంటే రేపు కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేకపోతే భారతీయ జనతా పార్టీ వెర్సెస్ టిఆర్ఎస్ అయిపోతే కాంగ్రెస్ పరిస్థితి ఇక్కడ ఆంధ్రాలో  లేదా ఉత్తర ప్రదేశ్ లో ఉన్నట్టు అయిపోతుంది అని ఆయన భావిస్తున్నారని అనుకుంటున్నారు.


అప్పుడు ఎటూ కదలలేని పరిస్థితి అయిపోతుంది కాబట్టి, అందుకని ముందు జాగ్రత్తగా అటు భారతీయ జనతా పార్టీలో కొనసాగుతూనే కాంగ్రెస్ లో కూడా కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. సొంత పార్టీ వాళ్లకి ఏకు మేకై కూర్చుని అవతల పార్టీ వాళ్లకు మాత్రం ఆశాభావం  కలిగిస్తూ ముందుకు వెళుతున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.



RRR Telugu Movie Review Rating

"కిసీ కా భాయ్ కిసీ కా జాన్" మూవీ బుకింగ్స్ ఓపెన్..!

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?

చైనా వల్ల ప్రపంచానికి మరో మాయరోగం?

జగన్ స్టిక్కర్లు.. ఓహో.. అసలు ప్లాన్ ఇదా?

వివాదాల్లో విశాఖలోని ఆ స్టూడియో?

లోకేశ్‌ ఆ మాట అన్నాడా.. ఏది నిజం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>