LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpgసొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది.సొరకాయతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. సొరకాయ మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది.మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే కూరగాయల్లో ఈ సొరకాయ కూడా ఒకటి.సొరకాయతో మనం ఎక్కువగా కూర, పప్పు, పులుసు ఇంకా అలాగే పచ్చడి వంటి వంటకాలని తయారు చేస్తూ ఉంటాం. ఇంకా ఇవే కాకుండా సొరకాయతో మనం మజ్జిగ చారును కూడా తయారు చేసుకోవచ్చు. సొరకాయ మజ్జిగ చారు తినడానికి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడానికి కూడా అంత ఎక్కువగా సమయం కూడా పట్టదు. అలాగే దీన్ని తయారు చేయడం కూడాhealth{#}Onion;Ginger;Turmeric;Chilli;oil;salt;Dried Red Chillies;Gas Stove;Coriander.;Hing;Buttermilk;Curry leaves;Manamమజ్జిగ చారును ఇలా చేసుకుంటే బాడీ కూల్ అవుతుంది?మజ్జిగ చారును ఇలా చేసుకుంటే బాడీ కూల్ అవుతుంది?health{#}Onion;Ginger;Turmeric;Chilli;oil;salt;Dried Red Chillies;Gas Stove;Coriander.;Hing;Buttermilk;Curry leaves;ManamTue, 18 Apr 2023 15:37:01 GMTసొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది.సొరకాయతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. సొరకాయ మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది.మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే కూరగాయల్లో ఈ సొరకాయ కూడా ఒకటి.సొరకాయతో మనం ఎక్కువగా కూర, పప్పు, పులుసు ఇంకా అలాగే పచ్చడి వంటి వంటకాలని తయారు చేస్తూ ఉంటాం. ఇంకా ఇవే కాకుండా సొరకాయతో మనం మజ్జిగ చారును కూడా తయారు చేసుకోవచ్చు. సొరకాయ మజ్జిగ చారు తినడానికి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడానికి కూడా అంత ఎక్కువగా సమయం కూడా పట్టదు. అలాగే దీన్ని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఇక రుచిగా, కమ్మగా ఆరోగ్యానికి మేలు చేసేలా సొరకాయతో మజ్జిగ చారును ఎలా తయారు చేసుకోవాలి వంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.సొరకాయ 


మజ్జిగ చారు తయారీ విధానం విషయానికి వస్తే..సొరకాయ ముక్కలు ఒక కప్పు, ఉప్పు పావు టీ స్పూన్, నీళ్లు పావు గ్లాస్, నూనె  ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు ఒక టేబుల్ స్పూన్, ఇంగువ పావు టీ స్పూన్, ఎండుమిర్చి  2, కరివేపాకు ఒక రెమ్మ, అల్లం తరుగు ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి 2, పసుపు పావు టీ స్పూన్, చిలికిన పెరుగు 200 గ్రా. ఇంకా తరిగిన కొత్తిమీర  కొద్దిగా తీసుకోవాలి .ముందుగా కళాయిలో సొరకాయ ముక్కలు, ఉప్పు ఇంకా నీళ్లు పోసి కలపాలి. వీటిపై మూతను ఉంచి ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. ఆ నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, ఇంగువ ఇంకా కరివేపాకు వేసి వేయించాలి. ఇక తాళింపు వేగిన తరువాత సొరకాయ ముక్కలు, పసుపు వేసి కలపాలి. సొరకాయలో ఉండే నీరంతా పోయి ముక్కలు ఉడికిన తరువాత స్టవ్ ని ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత పెరుగు ఇంకా ఉప్పు తగినన్ని నీళ్లు పోసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా రుచిగా ఉండే సొరకాయ మజ్జిగ చారు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుంది. ఎండా కాలంలో ఇలా సొరకాయతో మజ్జిగ చారును తయారు చేసుకుని తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది.



RRR Telugu Movie Review Rating

"రుద్రుడు" మూవీ సాటిలైట్ ... డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థలు..?

చివరి ఏడాదిలోకి జగన్‌.. అద్భుతాలు చేస్తాడా?

ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి భరోసా ఇచ్చిన రష్యా?

చైనాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ అధినేత?

చైనా వల్ల ప్రపంచానికి మరో మాయరోగం?

జగన్ స్టిక్కర్లు.. ఓహో.. అసలు ప్లాన్ ఇదా?

వివాదాల్లో విశాఖలోని ఆ స్టూడియో?

లోకేశ్‌ ఆ మాట అన్నాడా.. ఏది నిజం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>