HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health116eb6b5-f94c-43bb-8138-057c6b088068-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health116eb6b5-f94c-43bb-8138-057c6b088068-415x250-IndiaHerald.jpgతాటి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండు గుజ్జులో చాలా రకాల పోషకాలు ఉంటాయి. దీనిని తినడం వల్ల మనం చాలా రకాల అనారోగ్య సమస్యలను ఈజీగా దూరం చేసుకోవచ్చు. దీనిలో ఐరన్, క్యాల్షియం, పొటాషియం, జింక్, విటమిన్ ఎ, విటమిన్ బి ఇంకా విటమిన్ సి వంటి చాలా రకాల పోషకాలు ఉంటాయి. ఇంకా అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్స్ కూడా తాటి పండులో చాలా పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఈ తాటి పండు తినడానికి చాలా మధురంగా ఉంటుంది.ఈ తాటి పండును కొన్ని ప్రాంతాల్లో చీకుడు తాటి కాయ అని కూడా అంటారు.ఈ పండుని పోషకాల గని కూడా పిలుస్HEALTH{#}Carbohydrates;Calcium;Sugar;Shakti;Vitamin C;Vitamin;Manamతాటి పండుతో కోటి ఆరోగ్య ప్రయోజనాలు?తాటి పండుతో కోటి ఆరోగ్య ప్రయోజనాలు?HEALTH{#}Carbohydrates;Calcium;Sugar;Shakti;Vitamin C;Vitamin;ManamSun, 16 Apr 2023 18:00:00 GMTతాటి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండు గుజ్జులో చాలా రకాల పోషకాలు ఉంటాయి. దీనిని తినడం వల్ల మనం చాలా రకాల అనారోగ్య సమస్యలను ఈజీగా దూరం చేసుకోవచ్చు. దీనిలో ఐరన్, క్యాల్షియం, పొటాషియం, జింక్, విటమిన్ ఎ, విటమిన్ బి ఇంకా విటమిన్ సి వంటి చాలా రకాల పోషకాలు ఉంటాయి. ఇంకా అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్స్ కూడా తాటి పండులో చాలా పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఈ తాటి పండు తినడానికి చాలా మధురంగా ఉంటుంది.ఈ తాటి పండును కొన్ని ప్రాంతాల్లో చీకుడు తాటి కాయ అని కూడా అంటారు.ఈ పండుని పోషకాల గని కూడా పిలుస్తారు. తాటి పండు పిల్లల ఎదుగుదలలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. తాటి పండు నుండి గుజ్జును తీస్తున్న కొద్ది అది వస్తూ ఉంటుంది.కొంతమంది ఈ తాటి పండును నేరుగా నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ ఉంటారు. కొంతమంది స్పూన్ తో లేదా దానిని తురుము కొని తాటి గుజ్జును తీసుకుని తింటూ ఉంటారు. అలాగే ఈ గుజ్జుతో తాటి తాండ్రను కూడా తయారు చేస్తూ ఉంటారు. తాటి తాండ్రను సంవత్సరమంతా స్టోర్ చేసుకుని తింటూ ఉంటారు. తాటి తాండ్రను తినడం వల్ల షుగర్ వ్యాధి ఖచ్చితంగా నియంత్రణలో ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారు దీనిని తినడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు  చెబుతున్నారు.


ఇక మన పూర్వకాలంలో అయితే బెల్లానికి బదులుగా తాటి పండు గుజ్జునే చాలా ఎక్కువగా ఉపయోగించే వారు. అప్పట్లో దీనితో కుడుములు కూడా వండుకుని తినే వారు. తాటి పండును తినడం వల్ల శరీరానికి కావల్సిన శక్తి, బలం అందుతుంది. నేటి కాలంలో కొందరు ఈ గుజ్జుతో స్వీట్ లను, కేక్ లను కూడా తయారు చేసుకొని తింటున్నారు. ఇంకా అంతేకాకుండా తాటి పండును తినడం వల్ల శరీరంలో రోగ నిరోదక శక్తి కూడా పెరుగుతుంది. ఇంకా తరచూ ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. అంతేకాకుండా దీనిలో ఉండే క్యాల్షియం ఎముకలను ధృడంగా ఇంకా బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ పండును ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి కూడా బాగా మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య ఈజీగా తగ్గు ముఖం పడుతుంది. అలాగే ఈ పండ్లను తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. ఈ పండ్లు దొరికే కాలంలో వీటిని పిల్లలకు తినిపించడం చాలా మంచిది. ఈ విధంగా తాటి పండ్లు మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



RRR Telugu Movie Review Rating

నాగార్జున అన్నమయ్య సినిమా ఉత్సహంగా చేయడానికి కారణం అదేనా....!!

జగన్‌ ఆస్తి లెక్కల్లో గందరగోళం.. ఏది నిజం?

చూసుకుందామా?: చంద్రబాబుకు జగన్ సవాల్‌?

కేసీఆర్‌.. ఆ.. అప్పుల్లో నెంబర్‌ వన్‌?

జగన్‌ రిటర్న్‌ గిఫ్ట్ ఇవ్వాలనే కేసీఆర్ డిసైడ్ అయ్యారా?

ఆ కేసులో జగన్.. సాక్ష్యం చెబుతారా?

ఏం చేయాలో అర్థంకాని స్థితిలో పాకిస్తాన్‌..?

బానిస వ్యాపారం: మానవ చరిత్రలో మహా అమానవీయం?

తైవాన్‌ను కబ్జా చేసేందుకే చైనా డిసైడ్‌ అయ్యిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>