EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/money7ced672c-e788-4640-ac9e-1043c8dec436-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/money7ced672c-e788-4640-ac9e-1043c8dec436-415x250-IndiaHerald.jpgచాలా మంది పిల్లలకు చెప్పకుండా భవిష్యత్తులో పనికొస్తుందని బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తారు. వాటిని మరిచిపోతారు. ఏడాది నుంచి బ్యాంకుల్లో లావాదేవీలు లేని ఖాతాలను చూడాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకులకు సూచించింది. అయితే ఇలాంటి లావాదేవీలు లేని ఖాతాలను పరిశీలిస్తే దాదాపు రూ.35 వేల కోట్లు గా తేలింది. అయితే ఈ డిపాజిట్ల వారసులను కనుక్కోవాలని ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. బ్యాంకు ఆఫ్ బరోడా రూ. 3904 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ. 2557 కోట్ల రూపాయాలు క్లైయిమ్ చేయనివి ఉన్నాయి. అయితే ఇలా క్లైయMONEY{#}News;central government;Bankరూ. 35 వేల కోట్లు.. బ్యాంకుల్లో వదిలేశారట?రూ. 35 వేల కోట్లు.. బ్యాంకుల్లో వదిలేశారట?MONEY{#}News;central government;BankSun, 16 Apr 2023 09:00:00 GMTచాలా మంది పిల్లలకు చెప్పకుండా భవిష్యత్తులో పనికొస్తుందని బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తారు. వాటిని మరిచిపోతారు. ఏడాది నుంచి బ్యాంకుల్లో లావాదేవీలు లేని ఖాతాలను చూడాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకులకు సూచించింది. అయితే ఇలాంటి లావాదేవీలు లేని ఖాతాలను పరిశీలిస్తే దాదాపు రూ.35 వేల కోట్లు గా తేలింది.


అయితే ఈ డిపాజిట్ల వారసులను కనుక్కోవాలని ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. బ్యాంకు ఆఫ్ బరోడా రూ. 3904 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ. 2557 కోట్ల రూపాయాలు క్లైయిమ్ చేయనివి ఉన్నాయి. అయితే ఇలా క్లైయిమ్ చేయకుండా ఉన్న అన్ని బ్యాంకుల్లో కలిపి మొత్తం రూ. 35112 కోట్లుగా ఉన్నట్లు తేలింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ డిపాజిట్ చేసిన వ్యక్తి  ప్రస్తుతం లేకుండా పోతే వచ్చే సమస్యే పెద్దదిగా ఉండబోతుంది.


మేం అంటే మేం వారసులం అని గొడవలు అయ్యే ప్రమాదం ఉంది. నామినీ పేర్లు రాసిన వారికి సాధారణంగా చెల్లుతుంది. కానీ ఒకే కుటుంబంలో ముగ్గురు నలుగురు, పిల్లలు ఉంటే సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. పెద్దలు చాలా మంది పిల్లలకు తెలియకుండా గతంలో భూములు, ఇండ్లు, ప్లాట్లు కొనే వారు. కానీ వారు అర్థంతరంగా చనిపోతే ఆ భూములను, ప్లాట్లను వేరే వాళ్లు కబ్జా చేసేసేవారు. ఈ కబ్జా అయిన వాటి విషయంలో ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది.


కానీ బ్యాంకుల్లో సొమ్ము మాత్రం అస్సలు కబ్జా కాదు. లావాదేవీలు జరగని వాటిపై ఇలా ఆర్బీఐకి సమాచారం అందించి వాటిని ఏం చేయాలనే నిర్ణయం తీసుకుంటుంది. దీన్ని బట్టి బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ఎంతైనా మంచిదే అనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఆ డిపాజిట్ల విషయంలో ఎవరూ వారసులు ఎవరికి చెందనున్నాయనే విషయంలో మాత్రం వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దాన్ని బ్యాంకులు ఏ విధంగా పరిష్కరిస్తాయనే వివరాలు తెలుసుకోవాలి.



RRR Telugu Movie Review Rating

ఢిల్లీ : సీఎం తాపత్రయమంతా ఇదేనా ?

జగన్‌ ఆస్తి లెక్కల్లో గందరగోళం.. ఏది నిజం?

చూసుకుందామా?: చంద్రబాబుకు జగన్ సవాల్‌?

కేసీఆర్‌.. ఆ.. అప్పుల్లో నెంబర్‌ వన్‌?

జగన్‌ రిటర్న్‌ గిఫ్ట్ ఇవ్వాలనే కేసీఆర్ డిసైడ్ అయ్యారా?

ఆ కేసులో జగన్.. సాక్ష్యం చెబుతారా?

ఏం చేయాలో అర్థంకాని స్థితిలో పాకిస్తాన్‌..?

బానిస వ్యాపారం: మానవ చరిత్రలో మహా అమానవీయం?

తైవాన్‌ను కబ్జా చేసేందుకే చైనా డిసైడ్‌ అయ్యిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>