HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health4fb504b1-1c36-4821-bdf9-c4bda6c1b6d1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health4fb504b1-1c36-4821-bdf9-c4bda6c1b6d1-415x250-IndiaHerald.jpgమొలల సమస్య కారణంగా తీవ్రమైన నొప్పి, బాధ కలుగుతుంది. అలాగే ఆ భాగంలో మంటతో పాటు రక్తస్రావం అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా మంది మొలల ను ఆపరేషన్స్ ద్వారా తొలగించుకుంటూ ఉంటారు.ఆపరేషన్ తో అవసరం లేకుండా ఆయుర్వేద చిట్కాలను ఉపయోగించి బాహ్య ఇంకా అంతర్గత మొలలను మనం తగ్గించుకోవచ్చు. మొలలను తగ్గించే హోమ్ టిప్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి మనం అర చెక్క నిమ్మకాయను, పావు టీ స్పూన్ పసుపును ఇంకా ఒక టీ స్పూన్ జీలకర్ర పొడిని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గ్లాhealth{#}Turmeric;oil;cumin;Ayurveda;Masala;House;Manamపైల్స్ ప్రాబ్లమ్ ని ఈజీగా తరిమికొట్టే టిప్?పైల్స్ ప్రాబ్లమ్ ని ఈజీగా తరిమికొట్టే టిప్?health{#}Turmeric;oil;cumin;Ayurveda;Masala;House;ManamSat, 15 Apr 2023 09:10:00 GMTమొలల సమస్య కారణంగా తీవ్రమైన నొప్పి, బాధ కలుగుతుంది. అలాగే ఆ భాగంలో మంటతో పాటు రక్తస్రావం అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా మంది మొలల ను ఆపరేషన్స్ ద్వారా తొలగించుకుంటూ ఉంటారు.ఆపరేషన్ తో అవసరం లేకుండా ఆయుర్వేద చిట్కాలను ఉపయోగించి బాహ్య ఇంకా అంతర్గత మొలలను మనం తగ్గించుకోవచ్చు. మొలలను తగ్గించే హోమ్ టిప్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి  మనం అర చెక్క నిమ్మకాయను, పావు టీ స్పూన్ పసుపును ఇంకా ఒక టీ స్పూన్ జీలకర్ర పొడిని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తీసుకొని అందులో నిమ్మరసాన్ని పిండాలి. తరువాత ఇందులోనే పసుపు ఇంకా జీలకర్ర పొడి వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ప్రతి రోజూ ఉదయం పూట పరగడుపున తాగాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల ప్రేగుల్లో మలం సింపుల్ గా మెత్తబడుతుంది. అప్పుడు మలబద్దకం సమస్య తలెత్తకుండా ఉంటుంది. మలవిసర్జన చాలా సాఫీగా సాగుతుంది.


అలాగే జీలకర్ర జీర్ణవ్యవస్థను కూడా బాగా మెరుగుపరుస్తుంది. ఈ విధంగా పసుపు, నిమ్మరసం ఇంకా జీలకర్ర పొడిని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల అంతర్గతంగా ఉండే మొలలు చాలా ఈజీగా తగ్గుతాయి.ఇలా ఒక 15 రోజుల పాటు తీసుకోవడం వల్ల మొలల నుండి రక్తం కారడం కూడా చాలా ఈజీగా తగ్గుతుంది. ఇక బాహ్య మొలలతో బాధపడే వారు వామును వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఒక టీ స్పూన్ వామును నీటిలో వేసి రాత్రంతా కూడా నానబెట్టాలి. పొద్దున్నే ఈ నీటిని వడకట్టి వామును మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత దీనికి సమానంగా ఆర్గానిక్ పసుపును కలపాలి. తరువాత ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు మొలలపై రాసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మొలలు ఎండిపోయి ఈజీగా రాలిపోతాయి. ఈ టిప్స్ పాటిస్తూనే మొలల సమస్యతో బాధపడే వారు నీటిని ఎక్కువగా తాగాలి. కారం, నూనె పదార్థాలను ఇంకా మసాలా పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ విధంగా ఈ టిప్స్ పాటించడం వల్ల మొలల సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



RRR Telugu Movie Review Rating

అమరావతి : శేషజీవితమంతా పేదల కోసమేనట..ఇంతకాలం ఏమి చేశారో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>