MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-kalyan3667f203-8c3e-4cec-a732-7f666bd5b208-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-kalyan3667f203-8c3e-4cec-a732-7f666bd5b208-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ తన కెరియర్ లో ఎప్పుడూ లేనివిధంగా నాలుగు సినిమాలను ఒకేసారి సెట్స్ పైకి తీసుకు వచ్చి వాటిని ఈసంవత్సరాంతం లోపు పూర్తి చేస్తాను అని చెపుతున్నప్పటికీ అది జరిగే పనేనా అన్న కన్ఫ్యూజన్ లో పవన్ తో సినిమాలు తీస్తున్న దర్శక నిర్మాతలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మరో సంవత్సరం లోపు ఎన్నికలు రాబోతుంటే తెలంగాణాలో మరో ఆరు నెలల లోపు ఎన్నికలు వస్తున్నాయి.ఈరెండు రాష్ట్రాల ఎన్నికలలోను పవన్ ‘జనసేన’ పోటీ చేయడమే కాకుండా ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపెట్టేలా తమ వ్యూహాలు ఉంటాయని చెపుతుpavan kalyan{#}harish shankar;kalyan;sujeeth;Andhra Pradesh;Janasena;Elections;June;Yevaru;Industry;Party;Remake;Darsakudu;News;Director;Cinemaపవన్ వ్యూహాలను అర్ధం చేసుకోలేకపోతున్న టాలీవుడ్ !పవన్ వ్యూహాలను అర్ధం చేసుకోలేకపోతున్న టాలీవుడ్ !pavan kalyan{#}harish shankar;kalyan;sujeeth;Andhra Pradesh;Janasena;Elections;June;Yevaru;Industry;Party;Remake;Darsakudu;News;Director;CinemaSat, 15 Apr 2023 10:00:00 GMTపవన్ కళ్యాణ్ తన కెరియర్ లో ఎప్పుడూ లేనివిధంగా నాలుగు సినిమాలను ఒకేసారి సెట్స్ పైకి తీసుకు వచ్చి వాటిని ఈసంవత్సరాంతం లోపు పూర్తి చేస్తాను అని చెపుతున్నప్పటికీ అది జరిగే పనేనా అన్న కన్ఫ్యూజన్ లో పవన్ తో సినిమాలు తీస్తున్న దర్శక నిర్మాతలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మరో సంవత్సరం లోపు ఎన్నికలు రాబోతుంటే తెలంగాణాలో మరో ఆరు నెలల లోపు ఎన్నికలు వస్తున్నాయి.


ఈరెండు రాష్ట్రాల ఎన్నికలలోను పవన్ ‘జనసేన’ పోటీ చేయడమే కాకుండా ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపెట్టేలా తమ వ్యూహాలు ఉంటాయని చెపుతున్నాడు. ఇలా జనసేన తయారవ్వాలి అంటే పవన్ పూర్తిగా తన దృష్టిని పార్టీ పై పెట్టాలి. అయితే ప్రస్తుతం పవన్ దృష్టి అంతా తాను ఒప్పుకున్న సినిమాలను అత్యంత వేగంగా పూర్తిచేయాలి అన్నలక్ష్యంతో పరుగులు తీస్తున్నాడు.


అయితే వాస్తవానికి జూన్ లో రాబోతున్న ‘వినోదయ సితం’ రీమేక్ తప్ప మరే సినిమా ఖచ్చితంగా ఫలాన సమయానికి వస్తుంది అన్నవిషయాన్ని ఆమూవీ దర్శక నిర్మాతలు కూడ చెప్పలేకపోతున్నారు అని అంటున్నారు. ‘హరిహర వీరమల్లు’ ని ఎట్టి పరిస్థితుల్లో ఈఏడాదే తీసుకురావాలని దర్శకుడు క్రిష్ విశ్వప్రయత్నం చేస్తున్నప్పటికీ అది జరిగే పనికాదు అంటున్నారు. ఈసినిమాను పక్కకు పెట్టి మిగతా సినిమాలు పవన్ ఎందుకు లైన్ గా చేస్తున్నాడు అన్నవిషయం అర్థం కాని విషయంగా మారింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ జనవరిలో వస్తుందని హరీష్ శంకర్ చెపుతున్నారు.


అయితే అది కూడ జరగడం కష్టం అనిఅంటున్నారు. సుజిత్ ‘ఓజి’ పనులు కూడ వేగంగా జరుగుతున్నాయి. ఈసినిమాను 30రోజులలో పూర్తిచేస్తాను అని పవన్ చెపుతున్నట్లు టాక్. పవన్ వ్యవహారశైలి అతడి దర్శక నిర్మాతలకు అర్థంకాదు కాబట్టి ఈసినిమాకు సంబంధించి బిజినెస్ ఎంక్వైరీలు వస్తున్నప్పటికీ విడుదలకు సంబంధించిన స్పష్టమైన క్లారిటీ రావడంలేదు అంటున్నారు. ఈసినిమాలు చాలవు అన్నట్లుగా పవన్ మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు ఉన్నాయి. అయితే ఈసినిమాలకు దర్శక నిర్మాతలు ఎవరు అన్న విషయం ప్రస్తుతానికి క్లారిటీ లేదు అని టాక్..







RRR Telugu Movie Review Rating

సమంత పై ఆసక్తికర పోస్ట్ చేసిన విజయ్ దేవరకొండ..!!

ఏం చేయాలో అర్థంకాని స్థితిలో పాకిస్తాన్‌..?

బానిస వ్యాపారం: మానవ చరిత్రలో మహా అమానవీయం?

తైవాన్‌ను కబ్జా చేసేందుకే చైనా డిసైడ్‌ అయ్యిందా?

కర్ణాటక: కులాల కొట్లాటలో బీజేపీ నెగ్గుకొస్తుందా?

నాటో వార్‌ ప్లాన్‌ లీక్.. ఉక్రెయిన్‌ పనేనా?

గుట్టురట్టు: ఉక్రెయిన్‌ వార్‌పై నాటో ప్లాన్స్‌ లీక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>