EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/elections352f8c63-8128-411a-be4d-3315edf36c7d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/elections352f8c63-8128-411a-be4d-3315edf36c7d-415x250-IndiaHerald.jpgతెలంగాణలో వారసత్వ రాజకీయాలు ఎక్కువయ్యాయని సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ హైదరాబాద్ లో జరిగిన బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ కుటుంబ వారసత్వ పార్టీలైన పంజాబ్ లో అకాలీదల్, మహారాష్ట్రలో శివసేన, జమ్మూ కాశ్మీర్ లో ముక్తీ కుటుంబం, ఏపీలో జగన్ తో సంబంధాలు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నప్పుడు ప్రధాని మోదీకి వారసత్వ రాజకీయాలు గుర్తుకు రాలేదా.. అని సిబల్ విమర్శించారు. ఏపీలో జగన్ ది వారసత్వం అయితే elections{#}Bharatiya Janata Party;Jammu and Kashmir - Srinagar/Jammu;Rahul Gandhi;Kapil Sibal;Congress;Prime Minister;Telangana Chief Minister;Shiv Sena;politics;Punjab;central government;Minister;Hyderabad;CM;Jagan;Partyవారసత్వ రాజకీయాలు.. మంచివా.. కావా?వారసత్వ రాజకీయాలు.. మంచివా.. కావా?elections{#}Bharatiya Janata Party;Jammu and Kashmir - Srinagar/Jammu;Rahul Gandhi;Kapil Sibal;Congress;Prime Minister;Telangana Chief Minister;Shiv Sena;politics;Punjab;central government;Minister;Hyderabad;CM;Jagan;PartySat, 15 Apr 2023 13:00:00 GMTతెలంగాణలో వారసత్వ రాజకీయాలు ఎక్కువయ్యాయని సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ హైదరాబాద్ లో జరిగిన బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ కుటుంబ వారసత్వ పార్టీలైన  పంజాబ్ లో అకాలీదల్, మహారాష్ట్రలో శివసేన, జమ్మూ కాశ్మీర్ లో ముక్తీ కుటుంబం, ఏపీలో జగన్ తో సంబంధాలు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నప్పుడు ప్రధాని మోదీకి వారసత్వ రాజకీయాలు గుర్తుకు రాలేదా.. అని సిబల్ విమర్శించారు.


ఏపీలో జగన్ ది వారసత్వం అయితే  కాంగ్రెస్ నుంచే పోరాటం చేసేవారు. కాంగ్రెస్ నుంచే ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవారు. కాదనుకునే సొంత పార్టీ పెట్టుకుని ఎంపీగా గెలిచి, పోయిన ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చి ఆంధ్రకు ముఖ్యమంత్రి అయ్యారు. సైద్ధాంతిక విబేధాలు కలిగిన వారిని పక్కన బెట్టి శివసేన అధినేత కాంగ్రెస్ తో కలిస్తే వారిని కలుపుకొని మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పుడు కుటుంబ రాజకీయాలు సిబల్ కు గుర్తుకు రాలేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అందుకే బీజేపీ షిండే అస్త్రంతో మహారాష్ట్రలో మళ్లీ పాగా వేసింది.


ప్రస్తుతం ప్రాంతీయ వారసత్వం పెరిగిపోతున్న నేపథ్యంలో బీజేపీ ఆయా పార్టీలకు దూరం అవుతోంది. ఎందుకంటే వారి రాజకీయ స్వార్థాల కోసం ఎప్పటి నుంచో ఉన్న సిద్ధాంతాలను పక్కన బెట్టి కాంగ్రెస్ లాంటి వారితోనే శివసేన కలిసినపుడు ప్రాంతీయ పార్టీలపై బీజేపీకి నమ్మకం పోయింది. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో సొంతంగా మెజార్టీ సాధించి తనకు తానుగా అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది.


సత్తా ఉన్న నాయకుడు ఉంటే వారసత్వం ఉన్నా అక్కడి ప్రజలు అంగీకరిస్తారు. అయినా కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ వారసత్వ నాయకుడు కాడా.. మరెందుకు కాంగ్రెస్ ను విమర్శించడం లేదని కొంతమంది రాజకీయ నాయకులు కపిల్ సిబల్ ను ప్రశ్నిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

విడుదల పార్ట్‌1: ఎలా ఉందంటే?

జగన్‌ ఆస్తి లెక్కల్లో గందరగోళం.. ఏది నిజం?

చూసుకుందామా?: చంద్రబాబుకు జగన్ సవాల్‌?

కేసీఆర్‌.. ఆ.. అప్పుల్లో నెంబర్‌ వన్‌?

జగన్‌ రిటర్న్‌ గిఫ్ట్ ఇవ్వాలనే కేసీఆర్ డిసైడ్ అయ్యారా?

ఆ కేసులో జగన్.. సాక్ష్యం చెబుతారా?

ఏం చేయాలో అర్థంకాని స్థితిలో పాకిస్తాన్‌..?

బానిస వ్యాపారం: మానవ చరిత్రలో మహా అమానవీయం?

తైవాన్‌ను కబ్జా చేసేందుకే చైనా డిసైడ్‌ అయ్యిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>