EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/warb1ddf05c-8cc4-435d-bb79-d3fb93cff1ba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/warb1ddf05c-8cc4-435d-bb79-d3fb93cff1ba-415x250-IndiaHerald.jpgఉక్రెయిన్ లోని రష్యా ఆక్రమిత ప్రాంతం క్రిమియా. 2014 సంవత్సరంలో ఇది పూర్తిగా స్వాధీనం చేసుకున్న ప్రాంతం. ఇదే కాకుండా లూహన్ స్కీ, డోనెట్స్ స్కీ, లాంటి తదితర ప్రాంతాలను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు రష్యా యుద్ధం చేస్తూనే ఉంది. కానీ ఉక్రెయిన్ ఇప్పుడు రివర్స్ ఎటాక్ కు దిగుతోంది. క్రిమియాను మళ్లీ ఉక్రెయిన్ లో కలుపుకోవాలని దాడులు చేస్తుంది. క్రిమియా లోపల చొరబడేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తోంది. అంతే కాకుండా రష్యాలో ని వివిధ ప్రాంతాలపై దాడులు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఉక్రెయిన్ చేసిన కWAR{#}Ukraine;Russiaరావణ కాష్టం: ఉక్రెయిన్‌కు దండిగా నాటో ఆయుధాలు?రావణ కాష్టం: ఉక్రెయిన్‌కు దండిగా నాటో ఆయుధాలు?WAR{#}Ukraine;RussiaFri, 14 Apr 2023 05:00:00 GMTఉక్రెయిన్ లోని రష్యా ఆక్రమిత ప్రాంతం క్రిమియా. 2014 సంవత్సరంలో  ఇది పూర్తిగా స్వాధీనం చేసుకున్న ప్రాంతం. ఇదే కాకుండా లూహన్ స్కీ, డోనెట్స్ స్కీ, లాంటి తదితర ప్రాంతాలను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు రష్యా యుద్ధం చేస్తూనే ఉంది. కానీ ఉక్రెయిన్ ఇప్పుడు రివర్స్ ఎటాక్ కు దిగుతోంది. క్రిమియాను మళ్లీ ఉక్రెయిన్ లో కలుపుకోవాలని దాడులు చేస్తుంది. క్రిమియా లోపల చొరబడేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తోంది. అంతే కాకుండా రష్యాలో ని వివిధ ప్రాంతాలపై దాడులు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది.


అయితే ఉక్రెయిన్ చేసిన కుట్రలను రష్యా సైనిక విభాగం సమర్థమంతంగా చిత్తు చేస్తుంది. 400 కిలోమీటర్ల దూరంలోనే ఉక్రెయిన్ పంపిన యుద్ధ విమానాలను కూల్చేశారు. డ్రోన్లను సమర్థవంతంగా అడ్డుకున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ అడుగు ముందుకేసి క్రిమియాలో దాడులకు దిగింది.  రష్యా సైన్యం చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. దాడుల్లో ఎవరూ గాయపడకుండా చూసుకుంది. క్రిమియాను మళ్లీ తమ ఆధీనంలోకి తీసుకోవాలని భావిస్తున్న ఉక్రెయిన్ ఎదురు దాడికి దిగుతోందని రష్యాకు తెలిసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించింది.


ఇన్ని రోజులు రష్యా చేసే దాడులకు భయపడిన ఉక్రెయిన్ నూతన మిస్సైల్, కొత్త కొత్త బాంబులు, డ్రోన్లు అందిన నేపథ్యంలో ఏకంగా రష్యా స్వాధీనం చేసుకున్న ప్రాంతాలనే ఏటాక్ చేస్తోంది. ఇలా ఎటాకింగ్ కు దిగడంతో రష్యా హై అలర్ట్ ప్రకటించి వాటి దాడులను తిప్పికొడుతుంది. క్రిమియాలో ఉక్రెయిన్ చేసిన దాడితో ప్రస్తుతం ఎవరూ గాయపడలేదని రష్యా ప్రకటించింది. మరి రష్యాను ఇంతలా ఎదుర్కొనే ధైర్యం ఉక్రెయిన్ చేస్తోందంటే దానికి ఆయుధాలు దండిగానే అందాయని అర్థం చేసుకోవచ్చు.


కానీ పుతిన్ ఊరుకుంటారా... దాడికి ప్రతిదాడిగా తీవ్రమైన చర్యలే తీసుకుంటారు. ఉక్రెయిన్ లోని ఏ ప్రాంతంలో దాడి చేస్తారో.. ఎవరిపై ఎటాక్ చేస్తారో ఇప్పుడు తెలియకుండా ఉంది. మరి ఉక్రెయిన్ సైన్యం ఆ దాడిని ఆపగలవా లేవో చూడాలి.



RRR Telugu Movie Review Rating

అమరావతి : చంద్రబాబును జూనియర్ వెంటాడుతున్నారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>