MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/lawarence--rudrudu43f6ed0e-4bc6-4ada-bba2-2ef30b985198-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/lawarence--rudrudu43f6ed0e-4bc6-4ada-bba2-2ef30b985198-415x250-IndiaHerald.jpgరాఘవా లారెన్స్ కొంత గ్యాప్ తీసుకొని హీరోగా నటించిన సినిమా 'రుద్రుడు'. ఈ సినిమా ప్రమోషన్స్ చాలా బాగా జరిగాయి. ఇది పక్కా మాస్ కమర్షియల్ తమిళ సినిమా అని తెలుస్తూ ఉంది. ఎన్నో అంచనాలతో ఈ రోజు విడుదల అయ్యింది అసలు ఈ సినిమా కథ ఏంటి? తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.విశాఖలో భూమి అనే వ్యక్తి (శరత్ కుమార్)కి ఎదురు లేదు. డబ్బు కోసం చాలా నేరాలు చేస్తాడు. అతడు ఓ కరుడుగట్టిన డబ్బు పిశాచి. క్రూరుడు. అలాంటి భూమి మనుషులను రుద్ర (రాఘవా లారెన్స్) చంపేస్తాడు. ఓ పెద్ద కంపెLAWARENCE - RUDRUDU{#}Ananya Pandey;Rakhta Charitra;Athadu;Kumaar;Mass;marriage;raghava lawrence;ananya;Ananya Nagalla;job;Tamil;Hero;Telugu;Manam;Audience;Cinemaరుద్రుడు రివ్యూ: పక్కా మాస్.. కానీ?రుద్రుడు రివ్యూ: పక్కా మాస్.. కానీ?LAWARENCE - RUDRUDU{#}Ananya Pandey;Rakhta Charitra;Athadu;Kumaar;Mass;marriage;raghava lawrence;ananya;Ananya Nagalla;job;Tamil;Hero;Telugu;Manam;Audience;CinemaFri, 14 Apr 2023 14:32:00 GMTరాఘవా లారెన్స్ కొంత గ్యాప్ తీసుకొని హీరోగా నటించిన సినిమా 'రుద్రుడు'. ఈ సినిమా ప్రమోషన్స్ చాలా బాగా జరిగాయి. ఇది పక్కా మాస్ కమర్షియల్ తమిళ సినిమా అని తెలుస్తూ ఉంది. ఎన్నో అంచనాలతో ఈ రోజు విడుదల అయ్యింది అసలు ఈ సినిమా కథ ఏంటి? తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.విశాఖలో భూమి అనే వ్యక్తి (శరత్ కుమార్)కి ఎదురు లేదు. డబ్బు కోసం చాలా నేరాలు చేస్తాడు. అతడు ఓ కరుడుగట్టిన డబ్బు పిశాచి. క్రూరుడు. అలాంటి భూమి మనుషులను రుద్ర (రాఘవా లారెన్స్) చంపేస్తాడు. ఓ పెద్ద కంపెనీలో  ఉద్యోగం చేసే ఆ యువకుడు ఎందుకు హంతకుడు అయ్యాడు? ఇక అతను ప్రేమించి పెళ్లి చేసుకున్న అనన్య (ప్రియా భవానీ శంకర్) ఏమైంది? అసలు రుద్ర జీవితంలో ఏం జరిగింది? రుద్రుడిగా మారి ఎందుకు రక్త చరిత్ర సృష్టించాడు? ఇక తన మనుషులను చంపింది రుద్ర అని తెలుసుకున్న భూమి ఏం చేశాడు? అసలు రుద్ర, భూమికి సంబంధం ఏమిటి? అనేది సినిమా చూస్తే అర్ధమవుతుంది.


మొత్తానికి 'రుద్రుడు' సినిమా అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉంది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి విశ్రాంతి వరకు, ఆ తర్వాత మళ్ళీ శుభం కార్డు పడే దాకా కమర్షియల్ మీటర్ ఎక్కడా తప్పలేదు. హీరో పరిచయం, ఆ తర్వాత ప్రేమకథ, మధ్యలో ఎమోషనల్ సీన్స్ ఇంకా అలాగే పేరెంట్స్ సెంటిమెంట్ అండ్ లవ్... అన్నీ పది పదిహేను తెలుగు సినిమాల్లో చూసేసిన సీన్లని మిక్స్ చేసి కిచిడీ రూపంలో మళ్ళీ చూసిన ఫీలింగ్ ఇస్తాయి. మాస్ ఎలిమెంట్స్ ఉన్నా కథగా మాత్రం సోల్ మిస్ అయ్యింది. కమర్షియల్ సినిమాకు ఎలాంటి హంగులు కావాలో... టెక్నికల్ అంశాల్లో అటువంటివన్నీ ఉన్నాయి.జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం కూడా కమర్షియల్ బాణీలో ఆకట్టుకుంది. కానీ ప్రతి ఒక్కరిని ఈ సినిమా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా క్లాస్, ఫ్యామిలీ ఆడియన్స్ కి అంతగా నచ్చదు.



RRR Telugu Movie Review Rating

రుద్రుడు రివ్యూ: పక్కా మాస్.. కానీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>