Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan69e7f41f-4d6f-496e-9fc4-4c223d72a788-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan69e7f41f-4d6f-496e-9fc4-4c223d72a788-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద చిన్న సినిమాలదే ఎక్కువగా హవా నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషన్ విజయాన్ని సాధిస్తున్న సినిమాలు చాలానే కనిపిస్తున్నాయి. వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టి నష్టాలను తెచ్చి పెడుతుంటే.. అటు10 కోట్ల బడ్జెట్ కూడా దాటని కొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతూ నిర్మాతలకు లాభాల పంట పండిస్తున్నాయి. ఇక ఇలాంటి సినిమాల లిస్టులో ఇటీవల చేరిపోయింది జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వంలో పCharan{#}priyadarshi;Muralidhar Rao;Venu Thottempudi;Chirutha;kalyan ram;Jabardasth;Reddy;Audience;Telugu;dil raju;Chiranjeevi;Hero;Ram Charan Teja;Cinema;Successచిరుత కాదు చిట్టెలుక.. చరణ్ పై బలగం నటుడు కామెంట్?చిరుత కాదు చిట్టెలుక.. చరణ్ పై బలగం నటుడు కామెంట్?Charan{#}priyadarshi;Muralidhar Rao;Venu Thottempudi;Chirutha;kalyan ram;Jabardasth;Reddy;Audience;Telugu;dil raju;Chiranjeevi;Hero;Ram Charan Teja;Cinema;SuccessThu, 13 Apr 2023 08:15:00 GMTఇటీవల కాలంలో తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద చిన్న సినిమాలదే ఎక్కువగా హవా నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషన్ విజయాన్ని సాధిస్తున్న సినిమాలు చాలానే కనిపిస్తున్నాయి. వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టి నష్టాలను తెచ్చి పెడుతుంటే.. అటు10 కోట్ల బడ్జెట్ కూడా దాటని కొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతూ నిర్మాతలకు లాభాల పంట పండిస్తున్నాయి. ఇక ఇలాంటి సినిమాల లిస్టులో ఇటీవల చేరిపోయింది జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు వచ్చిన బలగం సినిమా.



 దిల్ రాజు సమర్పణలో ఇక ఆయన తనయులు హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి ఈ సినిమాను నిర్మించారు అని చెప్పాలి. ప్రియదర్శి కావ్య కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడమే కాదు ప్రతి ప్రేక్షకుడి మదిని దోచేసింది అని చెప్పాలి. దీంతో ఇక ఈ సినిమాలోని నటీనటులు ఎక్కడ చూసినా ఇంటర్వ్యూలలో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో అల్లుడు నారాయణ పాత్రలో నటించిన మురళీధర్ గౌడ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్ చరణ్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.



 మా ఆఫీసులో పనిచేసే ఒక మహిళ చిరంజీవి అభిమాని. ఆయన కొడుకు రామ్ చరణ్ మొదటి సినిమా రిలీజ్ రోజునే బ్యాంకు పని ఉందని అబద్ధం చెప్పి సినిమాకు వెళ్ళింది. ఆ విషయం నాకు తెలిసింది. ఇక ఆమె మళ్ళీ తిరిగి ఆఫీసుకు వచ్చాక సినిమా ఎలా ఉంది అని అడిగాను.  అయితే అందుకు ఆమె బదులు ఇస్తూ.. ఏం సినిమా సార్.. చిరుత అని పేరు పెట్టారు.. కానీ చిట్టెలుకలా కూడా లేడు అంటూ కామెంట్లు చేసింది. అయితే ఇలా సినిమాల్లోకి వచ్చిన సమయంలో రామ్ చరణ్ పై ప్రజల్లో అలాంటి అభిప్రాయం ఉండేది. కానీ నేడు ఏ స్టేజిలో ఉన్నాడు. నటుడిగా ఎంతో ఎదిగాడు. అందుకోసం తనని తాను ఎంతో మార్చుకున్నాడు అంటూ మురళీధర్ గౌడ్ ప్రశంసలు కురిపించారు.



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ : వివేకా మర్డర్ లో కొత్తకోణం ?

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>