MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgదర్శకుడు శ్రీవాస్ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలుగా దర్శకుడుగా కొనసాగుతున్నాడు. బాలకృష్ణ నుండి అనేకమంది హీరోలతో ఇప్పటి వరకు అతడు సినిమాలు తీసినప్పటికీ అతడి సినిమాలలో ఇప్పటివరకు ఏమూవీ కూడ సూపర్ హిట్ అవ్వకపోవడంతో అతడి కెరియర్ పడుతూ లేస్తూ అన్న విధంగా కొనసాగుతోంది. లేటెస్ట్ గా హీరో గోపీచంద్ తో అతడు తీసిన ‘రామబాణం’ మూవీ వచ్చేనెల విడుదల కాబోతోంది.ప్రస్తుతం గోపీచంద్ వరస ఫ్లాప్ లతో కొనసాగుతున్న పరిస్థితులలో అతడి కెరియర్ ను అదేవిధంగా శ్రీవాస్ కెరియర్ ను ఈసినిమా రక్షిస్తుందని వీరిద్దరూ ఆశ పడుతున్నారు. MAHESH{#}srivas;Nijam;vegetable market;Balakrishna;Athadu;Darsakudu;Writer;ravi anchor;Hero;Dil;Director;media;Cinemaశ్రీమంతుడు మహర్షి సినిమాలతో నష్టపోయిన శ్రీవాస్ !శ్రీమంతుడు మహర్షి సినిమాలతో నష్టపోయిన శ్రీవాస్ !MAHESH{#}srivas;Nijam;vegetable market;Balakrishna;Athadu;Darsakudu;Writer;ravi anchor;Hero;Dil;Director;media;CinemaThu, 13 Apr 2023 13:34:20 GMTదర్శకుడు శ్రీవాస్ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలుగా దర్శకుడుగా కొనసాగుతున్నాడు. బాలకృష్ణ నుండి అనేకమంది హీరోలతో ఇప్పటి వరకు అతడు సినిమాలు తీసినప్పటికీ అతడి సినిమాలలో ఇప్పటివరకు ఏమూవీ కూడ సూపర్ హిట్ అవ్వకపోవడంతో అతడి కెరియర్ పడుతూ లేస్తూ అన్న విధంగా కొనసాగుతోంది.  లేటెస్ట్ గా హీరో గోపీచంద్ తో అతడు తీసిన ‘రామబాణం’ మూవీ వచ్చేనెల విడుదల కాబోతోంది.



ప్రస్తుతం గోపీచంద్ వరస ఫ్లాప్ లతో కొనసాగుతున్న పరిస్థితులలో అతడి కెరియర్ ను అదేవిధంగా శ్రీవాస్ కెరియర్ ను ఈసినిమా రక్షిస్తుందని వీరిద్దరూ ఆశ పడుతున్నారు. ఈసినిమాను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీవాస్ తాను ‘శ్రీమంతుడు’ ‘మహర్షి’ ‘శతమానం భవతి’ సినిమాల వల్ల తాను నష్టపోయాను అంటూ ఒక ఆసక్తికర విషయాన్ని తెలియచేసాడు.



కొన్ని సంవత్సరాల క్రితం తాను రచయిత బివిఎస్ రవి ఒక కథను తయారు చేసామని ఈకథ అప్పట్లో దిల్ రాజ్ కు కూడ నచ్చడంతో ఆ కథను సినిమాగా తీయాలి అన్న ప్రయత్నాలు జరుగుతూ ఉండగానే ‘శ్రీమంతుడు’ విడుదలై తన కథలోని ఒక పాయింట్ ను పట్టుకుపోయిందని ఆతరువాత ‘మహర్షి’ సినిమా విడుదల అయిన తరువాత తన కథలో మరొక పాయింట్ మిస్ అయిందని వివరించాడు. అంతేకాదు అప్పట్లో ఈవిషయమై ‘శ్రీమంతుడు’ ‘మహర్షి’ సినిమా నిర్మాతల పై అదేవిధంగా దర్శకుల పై అప్పట్లో కేసు పెడదామని అనుకుని అయితే ఇండస్ట్రీలో అందరు తెలిసిన వారే కావడంతో అప్పట్లో తాను ఆ విషయాన్ని వదులుకున్నానని శ్రీవాస్ అంటున్నాడు.


ఇక లేటెస్ట్ గా రాబోతున్న ‘రామబాణం’ మూవీ పై దర్శకుడు గోపీచంద్ మార్కెట్ కు మించి తాను ఖర్చు పెట్టిన విషయాన్ని గుర్తుకు చేస్తూ కథ పై తనకు ఉన్న నమ్మకంతో ‘రామబాణం’ మూవీని అంత భారీ స్థాయిలో తాను తీసాను అని అంటున్నాడు. మరి శ్రీవాస్ నమ్మకం ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి..







RRR Telugu Movie Review Rating

శ్రీమంతుడు మహర్షి సినిమాలతో నష్టపోయిన శ్రీవాస్ !

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>