EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ukrain83488bb4-51da-4d04-8961-6a6a448b6571-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ukrain83488bb4-51da-4d04-8961-6a6a448b6571-415x250-IndiaHerald.jpgఉక్రెయిన్ కు నాటో దేశాలు ఆయుధాలు ఇవ్వడానికి గల కారణం రష్యాను ఓడించడానికి సహకరిస్తాయని ఆశించి ఇచ్చాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఒక రకమైన బీభత్స వాతావరణం నెలకొంది. అందులో ప్రధాన విషయం నాటో ఇచ్చిన ఆయుధాలను సరైన రీతిలో ఉక్రెయిన్ ఉపయోగించుకోలేక పోతుంది. వాటిని ఎలా ఉపయోగించాలో తెలియక తమ సొంత సైనికులపైనే ప్రయోగిస్తుందని రష్యా ఆరోపిస్తుంది. ఉక్రెయిన్.. నాటో దేశాలు ఇస్తున్న ఆయుధాలను సరైన విధంగా ఉపయోగించడం లేదు. కారణం ఉక్రెయిన్ సైనికులు లొంగిపోవాలని చూస్తున్నారు. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు మాత్రం దీనికి ఒUKRAIN{#}Ukraine;advertisement;Nijam;Shakti;Russiaఉక్రెయన్‌ యుద్ధం: సొంత సైనికులనే చంపేసుకుంటోందా?ఉక్రెయన్‌ యుద్ధం: సొంత సైనికులనే చంపేసుకుంటోందా?UKRAIN{#}Ukraine;advertisement;Nijam;Shakti;RussiaThu, 13 Apr 2023 11:00:00 GMTఉక్రెయిన్ కు నాటో దేశాలు ఆయుధాలు ఇవ్వడానికి గల కారణం రష్యాను ఓడించడానికి సహకరిస్తాయని ఆశించి ఇచ్చాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఒక రకమైన బీభత్స వాతావరణం నెలకొంది. అందులో ప్రధాన విషయం నాటో ఇచ్చిన ఆయుధాలను సరైన రీతిలో ఉక్రెయిన్ ఉపయోగించుకోలేక పోతుంది. వాటిని ఎలా ఉపయోగించాలో తెలియక తమ సొంత సైనికులపైనే ప్రయోగిస్తుందని రష్యా ఆరోపిస్తుంది.


ఉక్రెయిన్.. నాటో దేశాలు ఇస్తున్న ఆయుధాలను సరైన విధంగా ఉపయోగించడం లేదు. కారణం ఉక్రెయిన్ సైనికులు లొంగిపోవాలని చూస్తున్నారు. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు మాత్రం దీనికి ఒప్పుకోవడం లేదు. దీని వల్ల సైనికుల్లో  తిరుగుబాటు వస్తుందని గ్రహించి ఏకంగా సైనికులనే చంపేస్తున్నారని పుతిన్ ఆరోపించారు. బాగ్ పుత్ ప్రాంతంలో ఉన్న ఉక్రెయిన్ సైనికులు యుద్ధంలో ఇక గెలవలేమని తెలిసి లొంగిపోవాలని కోరుకుంటున్నారు. కానీ అలా అడుగుతున్న వారిని జెలెన్ స్కీ చంపేయిస్తున్నారు. ముఖ్యంగా ఏ ఆయుధాలనైతే నాటో రష్యాతో యుద్దం చేయమని ఇచ్చిందో వాటితోనే సొంత సైనికుల ప్రాణాలు తీస్తున్నారని రష్యా ఆరోపిస్తుంది.


అయితే ఇందులో నిజం లేదు, అంతా అబద్ధమని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. రష్యా కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తుందని విమర్శించారు. బాగ్ పుత్ ప్రాంతంలో ఉక్రెయిన్ రోజు రోజుకు పట్టు కోల్పోతున్న విషయం తెలిసిందేే.  ఈ ప్రాంతంలో ఉన్న సైనికులు లొంగి పోవాలని అనడంతో ఈ విధమైన ఎటాక్ జరిగిందని రష్యా ఆరోపిస్తుంది.


ఎవరైనా సొంత సైనికులను చంపాలని అనుకోరని కేవలం రష్యా సానుభూతి కోసమే ఇలాంటి ప్రకటనలు చేస్తుందని ఆయా దేశాధినేతలు ఆరోపిస్తున్నారు. ఏదైమైనా ఉక్రెయిన్ లో సైనికులు ఇప్పటి వరకు శక్తి వంచన లేకుండా ధీరత్వంతో పోరాడిన విషయం అందరికీ తెలిసిందే.  రష్యా ఆరోపణలు నిజం కాకూడదని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే బలమైన రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్ సైనికులు ఇలా చనిపోవడం ఎవరికి నచ్చదని అభిప్రాయపడుతున్నారు.



RRR Telugu Movie Review Rating

నా ఇల్లు వాడుకున్నాడు.. కనీసం వేణు థ్యాంక్స్ కూడా చెప్పలేదు?

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>