Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-4f862190-32c3-43a8-92dd-19337f335ebc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-4f862190-32c3-43a8-92dd-19337f335ebc-415x250-IndiaHerald.jpgఇండస్ట్రీలో ఉన్న మాస్ డైరెక్టర్లలో వివి వినాయక్ కూడా ఒకరు. తన రెండు దశాబ్దాల కెరియర్లో వివి వినాయక్ ఎంతో మంది స్టార్ హీరోలతో ఎన్నో బ్లాక్ బస్టర్ లను అందించారు. కానీ గత కొంతకాలంగా వివి వినాయక్ సినిమాలకి దూరంగా ఉంటున్నారు. మరోవైపు కొత్త తరం డైరెక్టర్లు హిట్ సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే వివి వినాయక్ కేవలం ఒక డైరెక్టర్ మాత్రమే. రైటర్ కాదు. చాలా వరకు వివి వినాయక్ దర్శకత్వం వహించిన సినిమా కథలు వినాయక రాసినవి కాదు. గతంలో వినాయక్ వద్ద మంచి రైటింగ్ టీం ఉండేది. దీంతో వినాయక్ పట్టిందSocialstars lifestyle {#}bellamkonda sai sreenivas;v v vinayak;gold;Rajamouli;Remake;Varsham;Prabhas;Tollywood;Balakrishna;Mass;Industry;Cinema;Director;Blockbuster hitఆ కారణంతో ఇండస్ట్రీ కి దూరం అవుతున్న ఒకప్పటి స్టార్ డైరెక్టర్...!!ఆ కారణంతో ఇండస్ట్రీ కి దూరం అవుతున్న ఒకప్పటి స్టార్ డైరెక్టర్...!!Socialstars lifestyle {#}bellamkonda sai sreenivas;v v vinayak;gold;Rajamouli;Remake;Varsham;Prabhas;Tollywood;Balakrishna;Mass;Industry;Cinema;Director;Blockbuster hitThu, 13 Apr 2023 07:20:31 GMTఇండస్ట్రీలో ఉన్న మాస్ డైరెక్టర్లలో వివి వినాయక్ కూడా ఒకరు. తన రెండు దశాబ్దాల కెరియర్లో వివి వినాయక్ ఎంతో మంది స్టార్ హీరోలతో ఎన్నో బ్లాక్ బస్టర్ లను అందించారు.

కానీ గత కొంతకాలంగా వివి వినాయక్ సినిమాలకి దూరంగా ఉంటున్నారు. మరోవైపు కొత్త తరం డైరెక్టర్లు హిట్ సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే వివి వినాయక్ కేవలం ఒక డైరెక్టర్ మాత్రమే. రైటర్ కాదు. చాలా వరకు వివి వినాయక్ దర్శకత్వం వహించిన సినిమా కథలు వినాయక రాసినవి కాదు. 

గతంలో వినాయక్ వద్ద మంచి రైటింగ్ టీం ఉండేది. దీంతో వినాయక్ పట్టిందల్లా బంగారం అయినట్లు చాలా వరకు సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. కానీ ఈ మధ్యకాలంలో మంచి రైటర్లు అందరూ డైరెక్టర్లు గానే మారడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వివి వినాయక్ కు మంచి కథలు ఏమీ దొరకటం లేదు. గతంలో వినాయక్ నందమూరి బాలకృష్ణ హీరోగా కూడా ఒక సినిమా ప్లాన్ చేశారు కానీ రైటింగ్ టీం కారణంగా సినిమా హోల్డ్ లోకి వెళ్లిపోయింది. బాలకృష్ణకి సూటయ్యే కథని వివి వినాయక్ తీసుకురాలేకపోయారు.

ప్రస్తుతం వివి వినాయక టాలీవుడ్ లో ప్రభాస్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ అయినా చత్రపతి సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. అదే టైటిల్ తో ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్సినిమా హిందీ వర్షన్ లో హీరోగా నటిస్తున్నారు. ఈ మధ్యనే సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్ లను అందించి, కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వివి వినాయక్ కథలు లేక ఇండస్ట్రీ లో నిలదొక్కుకోలేకపోవటం నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలి.



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ : వివేకా మర్డర్ లో కొత్తకోణం ?

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>