MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyandb5fc449-8546-4093-a5da-dde9f4428ab4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyandb5fc449-8546-4093-a5da-dde9f4428ab4-415x250-IndiaHerald.jpg2024 ఎన్నికలకు ఒక సంవత్సరం మాత్రమే మిగిలింది. ఈసంవత్సరం చివరిలో జరగబోతున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో ‘జనసేన’ పోటీ చేస్తుందని లీకులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య పవన్ వరసపెట్టి సినిమాల షూటింగ్ లో పాల్గొంటూ తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. సుజిత్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న మూవీ షూటింగ్ ముంబాయ్ బ్యాక్ డ్రాప్ లో ఈవారం షూటింగ్ ప్రారంభం కాబోతోంది.మరొకవైపు హరీష్ శంకర్ మూవీ ‘వినోదయ సితం’ కు సంబంధించిన డబ్బింగ్ వర్క్ పూర్తి చేయాలి. రోజుకు 18 గంటలు పవన్ కPAVANKALYAN{#}Telangana;Elections;Venu Sreeram;Dil;sujeeth;harish shankar;kalyan;Mumbai;Cinema;mediaవకీల్ సాబ్ సీక్వెల్ వెనుక సీక్రెట్ !వకీల్ సాబ్ సీక్వెల్ వెనుక సీక్రెట్ !PAVANKALYAN{#}Telangana;Elections;Venu Sreeram;Dil;sujeeth;harish shankar;kalyan;Mumbai;Cinema;mediaThu, 13 Apr 2023 08:20:04 GMT2024 ఎన్నికలకు ఒక సంవత్సరం మాత్రమే మిగిలింది. ఈసంవత్సరం చివరిలో జరగబోతున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో ‘జనసేన’ పోటీ చేస్తుందని లీకులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య పవన్ వరసపెట్టి సినిమాల షూటింగ్ లో పాల్గొంటూ తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. సుజిత్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న మూవీ షూటింగ్ ముంబాయ్ బ్యాక్ డ్రాప్ లో ఈవారం షూటింగ్ ప్రారంభం కాబోతోంది.



మరొకవైపు హరీష్ శంకర్ మూవీ ‘వినోదయ సితం’ కు సంబంధించిన డబ్బింగ్ వర్క్ పూర్తి చేయాలి. రోజుకు 18 గంటలు పవన్ కళ్యాణ్ పనిచేసినా ఈసినిమాల షూటింగ్ లు ఈసంవత్సరం చివరిలోపు పూర్తి కావడం కష్ట సాధ్యమైన పని అని అంటున్నారు. ఈసినిమాలు ఇలా ఉండగానే వేణు శ్రీరామ్ ‘వకీల్ సాబ్’ సీక్వెల్ గురించి లీకులు ఇస్తున్నాడు. దిల్ రాజ్ కూడ పవన్ కళ్యాణ్ తో సినిమా ఉంటుంది అని చెపుతున్నాడు.



పవన్ ప్రస్తుతం తాను నటించే సినిమాలకు ఇండస్ట్రీలో ఎవరూ తీసుకొని భారీ పారితోషికాన్ని తీసుకుని తన పాత్ర షూటింగ్ ను 30 రోజులలో పూర్తి చేయాలి అన్న కండిషన్ లో పవన్ కొత్త సినిమాలు చేస్తున్నాడు. ఈపరిస్థితుల మధ్య ఇప్పుడు ‘వకీల్ సాబ్’ సీక్వెల్ తెర పైకి రావడం వెనుక ఒక ఆసక్తికర కారణం ఉంది. ఈసీక్వెల్ లో లాయర్ పాత్రలో కనిపించే పవన్ కళ్యాణ్ ను మరింత పవర్ ఫుల్ గా దీనజన భాందువుడుగా చూపిస్తారని తెలుస్తోంది.


రాబోతున్న ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని కొన్ని పవర్ ఫుల్ రాజకీయ పంచ్ డైలాగ్స్ ఈమూవీలో పవన్ పాత్రతో పలికిస్తారని టాక్. వాస్తవానికి పవన్ ఎంతో ముచ్చటపడి తయారు చేయించుకున్న ‘వారాహి’ వాహనంలో ఈపాటికే జనం మధ్యకు వెళ్ళాలి. అయితే తన వాహనమలో కాకుండా ఇలా వరసపెట్టి సినిమాలు చేస్తూ మధ్యమధ్యలో మీడియా సమావేశాలు పబ్లిక్ మీటింగ్స్ తో తన వ్యూహాలు నడిపితే ఒకవైపు సినిమాల సపోర్ట్ మరొకవైపు తన అభిమానుల సపోర్ట్ తో నిరంతరం అటు సినిమా వార్తలలో ఇటు రాజకీయ వార్తలలో ప్రతిరోజు జనానికి తన గురించి గుర్తుకు వచ్చేలా పవన్ వ్యూహాలు ఉన్నాయి అంటున్నారు..






RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ : వివేకా మర్డర్ లో కొత్తకోణం ?

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>