MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/lawarence--allu-arjun1e9f3ddb-3f8f-4f04-a8e1-05f12849eb94-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/lawarence--allu-arjun1e9f3ddb-3f8f-4f04-a8e1-05f12849eb94-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోలైన విశాల్, లారెన్స్, సూర్యలు వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ కూడా ముందుంటారన్న సంగతి తెలిసిందే.స్టార్ హీరో విశాల్ తన సినిమాకు వచ్చే ప్రతీ టికెట్‌లో ఓ రూపాయి రైతుకు వెళ్లేలా చేస్తాడని అందరికీ తెలిసిన విషయమే. ఇక సూర్య అయితే తన ఫౌండేషన్ ద్వారా చాలా మంది పిల్లలని చదివిస్తుంటాడు. అలాగే లారెన్స్ కూడా పిల్లలను దత్తత తీసుకోవడం, అనాథాశ్రమాలు ఇంకా వృద్దాశ్రమాలు నడుపుతుండటం గురించి అందరికీ తెలిసిందే. తాజాగా మరో నూట యాభై మంది పిల్లల్ని దత్తLAWARENCE - ALLU ARJUN{#}Chiranjeevi;Ram Charan Teja;Allu Arjun;Pawan Kalyan;surya sivakumar;Chirutha;raghava lawrence;Hero;Industry;Heart;Tollywood;Cinemaలారెన్స్ మంచితనానికి బన్నీ ఫిదా?లారెన్స్ మంచితనానికి బన్నీ ఫిదా?LAWARENCE - ALLU ARJUN{#}Chiranjeevi;Ram Charan Teja;Allu Arjun;Pawan Kalyan;surya sivakumar;Chirutha;raghava lawrence;Hero;Industry;Heart;Tollywood;CinemaThu, 13 Apr 2023 20:30:00 GMTకోలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోలైన విశాల్, లారెన్స్, సూర్యలు  వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ కూడా ముందుంటారన్న సంగతి తెలిసిందే.స్టార్ హీరో విశాల్ తన సినిమాకు వచ్చే ప్రతీ టికెట్‌లో ఓ రూపాయి రైతుకు వెళ్లేలా చేస్తాడని అందరికీ తెలిసిన విషయమే. ఇక సూర్య అయితే తన ఫౌండేషన్ ద్వారా చాలా మంది పిల్లలని చదివిస్తుంటాడు. అలాగే లారెన్స్ కూడా పిల్లలను దత్తత తీసుకోవడం, అనాథాశ్రమాలు ఇంకా వృద్దాశ్రమాలు నడుపుతుండటం గురించి అందరికీ తెలిసిందే. తాజాగా మరో నూట యాభై మంది పిల్లల్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఈ మంచి విషయంపై బన్నీ స్పందించాడు.రుద్రుడు సినిమాను తెలుగులో కూడా లారెన్స్ బాగానే ప్రమోట్ చేస్తున్నాడు. ఇక రుద్రుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో లారెన్స్ తన పాత రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో ఉన్న బంధాన్ని కూడా ఆయన తలుచుకున్నాడు. ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్ ఇలా అందరితో తనకున్న బంధాన్ని ఆయన చెప్పుకొచ్చాడు. 


ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ చిరుత కోసం చేసిన సాంగ్ అలాగే ఆనాటి రోజుల గురించి మళ్లీ అందరికీ చెప్పాడు.అయితే రుద్రుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే లారెన్స్ తన మంచితనాన్న ఇంకా సేవాగుణాన్ని చూపించాడు. మళ్లీ కొత్తగా 150 మంది పిల్లల్ని దత్తత తీసుకున్నట్టుగా, వారి బాగోగుల్ని ఇంకా చదువు సంధ్యలు తన బాధ్యత అన్నట్టుగా అందరి ముందు ఆయన చెప్పేశాడు. అంతేగాక ఆ పిల్లలందరితో లారెన్స్ ఫోటో దిగి ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఆ ట్వీట్‌కు టాలీవుడ్ స్టార్ హీరో బన్నీ స్పందించాడు.మిమ్మల్ని చూస్తే చాలా గౌరవం పెరుగుతోందన్నట్టుగా బన్నీ స్పందించాడు. రెస్పెక్ట్ అని చెబుతూ హార్ట్ సింబల్‌ను షేర్ చేశాడు బన్నీ. ఇక బన్నీ వేసిన ట్వీట్‌కు లారెన్స్ ఫ్యాన్స్ కూడా తిరిగి రిప్లైలు పెడుతున్నారు. బన్నీ, లారెన్స్ కాంబోలో సినిమా రావాలని ఇద్దరి స్టార్స్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలాగే గతంలో లారెన్స్ మాట్లాడిన మాటలను ఇప్పుడు తెరపైకి తీసుకొస్తున్నారు. స్టైల్ పార్ట్ 2 తీస్తే అందులో బన్నీ లాంటి మంచి డ్యాన్సర్‌తో చేయాలని ఉందంటూ చెప్పిన లారెన్స్ మాటలను ఇప్పుడు ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
" style="height: 733px;">



RRR Telugu Movie Review Rating

తను రిలేషన్ షిప్ లో ఉన్నానని చెప్పిన టిల్లు..!

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>