EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/harish-rao45a4e4fd-781d-45fa-9cbf-52b4ef97aeb3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/harish-rao45a4e4fd-781d-45fa-9cbf-52b4ef97aeb3-415x250-IndiaHerald.jpgతెలంగాణ మంత్రి హరీష్ రావు మళ్లీ నోరు మెదపారు, రెచ్చగొడుతున్నారు. అది ఇష్యూ డైవర్షనల్ గేమో, ఎమోషనల్ గేమో కానీ మళ్లీ పాత పదాలు వచ్చేసాయి ఆయన నోటి వెంట. ఇంతకీ ఆయన ఏమన్నారంటే ఆయన నిన్ను మాట్లాడుతూ ఆంధ్ర నుంచి ఇక్కడికి కూలి పని మీద వచ్చిన వాళ్ళందరూ కూడా మీ రాష్ట్రాల్లో ఓట్లు తీసేసుకోండి, రద్దు చేసుకోండి‌ ఇక్కడ రిజిస్టర్ చేయించుకోండి. అక్కడ మీకు మంచి హాస్పిటల్స్ లేవు, రోడ్లు లేవు ఇక్కడికీ అక్కడికీ ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందని వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు గారి మాటలకు స్పందిస్తూ కారుమూరి నాగేశ్వHARISH RAO{#}Akkineni Nageswara Rao;Ishtam;Telangana;Ministerహరీష్‌రావు.. ఏపీ లీడర్లను బెదిరిస్తున్నారా?హరీష్‌రావు.. ఏపీ లీడర్లను బెదిరిస్తున్నారా?HARISH RAO{#}Akkineni Nageswara Rao;Ishtam;Telangana;MinisterThu, 13 Apr 2023 23:42:30 GMTతెలంగాణ మంత్రి హరీష్ రావు మళ్లీ నోరు మెదపారు, రెచ్చగొడుతున్నారు. అది ఇష్యూ డైవర్షనల్ గేమో, ఎమోషనల్ గేమో కానీ మళ్లీ పాత పదాలు వచ్చేసాయి ఆయన నోటి వెంట. ఇంతకీ ఆయన ఏమన్నారంటే ఆయన నిన్ను మాట్లాడుతూ ఆంధ్ర నుంచి ఇక్కడికి కూలి పని మీద వచ్చిన వాళ్ళందరూ కూడా మీ రాష్ట్రాల్లో ఓట్లు తీసేసుకోండి, రద్దు చేసుకోండి‌ ఇక్కడ రిజిస్టర్ చేయించుకోండి. అక్కడ మీకు మంచి హాస్పిటల్స్ లేవు, రోడ్లు లేవు ఇక్కడికీ అక్కడికీ ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందని వ్యాఖ్యలు చేశారు.


హరీష్ రావు గారి మాటలకు స్పందిస్తూ కారుమూరి నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ కావాలంటే "నువ్వు ఇక్కడకు రా, ఇక్కడ మా రాష్ట్రంలో ఎలా ఉందో చూపిస్తాం. దౌర్భాగ్యకరమైన స్టేట్మెంట్లు ఇవ్వద్దని ఆయన ఘాటుగా స్పందించారు. అయితే దీనికి కౌంటర్ గా మళ్లీ హరీష్ రావు స్పందించారు. కారుమూరి నాగేశ్వరరావు గారి కౌంటర్ తర్వాత, ఆ నిమిషంలోనే స్టేజిపై ఉన్న హరీష్ రావు దానికి ఘాటుగా స్పందించి మా దగ్గర రైతుబంధు ఉంది, రైతు బీమా ఉంది మీ దగ్గర ఏముంది? ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోము. తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి అని హెచ్చరించారు. ఇలా పాత తరహా ధోరణిలోనే ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది.


మొదట వ్యాఖ్య చేసింది హరీష్ రావు గారు అయినా దానికి కారుమూరి నాగేశ్వరరావు గారు ఘాటైన వ్యాఖ్యతో స్పందించేసరికి, కౌంటర్ ఇచ్చేసరికి ఆ కౌంటర్ కి వెంటనే ప్రతి కౌంటర్ గా హరీష్ రావు గారు కూడా మరింత ఘాటుగా స్పందించడం జరిగింది. ఇలాంటి బెదిరింపులు, ఆవేశాలు అగ్రహాల ద్వారా, ఇలాంటి వ్యాఖ్యల ద్వారా ఆంధ్ర, తెలంగాణ మధ్య వివాదాన్ని రాజేస్తూ, తెలంగాణ ప్రజల్లో తిరిగి చైతన్యాన్ని లేదంటే వివాదాన్ని  రాజేస్తున్నారా అనేటువంటిది కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు, సందేహిస్తున్నారు. ఏది ఏమైనా రాజకీయ మాటల వెనకాల ఉద్దేశం సరిగ్గా చెప్పలేం.



RRR Telugu Movie Review Rating

సమంతకు రౌడీ హీరో బూస్టింగ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>