MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa2b107708e-407e-4d1f-a8a7-c06a964f61ca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa2b107708e-407e-4d1f-a8a7-c06a964f61ca-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న 'పుష్ప2' మూవీ కోసం సినీ లవర్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల బన్నీ బర్త్ డే సందర్భంగా వెరీ ఈజ్ పుష్ప? అంటూ విడుదల చేసిన టీజర్ వీడియో ఆడియన్స్ లో విపరీతమైన ఆసక్తిని పెంచింది. దీంతో సోషల్ మీడియా అంతటా పుష్ప 2 టీజర్ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఇటీవల విడుదల చేసిన ఈ టీజర్ సోషల్ మీడియాలో రికార్డ్ స్థాయిలో వ్యూస్ తో దుమ్మురేపుతోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటునPushpa2{#}sukumar;Allu Arjun;netizens;Indian;Audience;Pokiri;media;Director;Cinemaవామ్మో.. 'పుష్ప2' లో అంత పెద్ద ట్విస్ట్ ఉందా?.. సుకుమార్ మాములోడు కాదు..?వామ్మో.. 'పుష్ప2' లో అంత పెద్ద ట్విస్ట్ ఉందా?.. సుకుమార్ మాములోడు కాదు..?Pushpa2{#}sukumar;Allu Arjun;netizens;Indian;Audience;Pokiri;media;Director;CinemaWed, 12 Apr 2023 16:00:00 GMTటాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న 'పుష్ప2' మూవీ కోసం సినీ లవర్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల బన్నీ బర్త్ డే సందర్భంగా వెరీ ఈజ్ పుష్ప? అంటూ విడుదల చేసిన టీజర్ వీడియో ఆడియన్స్ లో విపరీతమైన ఆసక్తిని పెంచింది. దీంతో సోషల్ మీడియా అంతటా పుష్ప 2 టీజర్ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఇటీవల విడుదల చేసిన ఈ టీజర్ సోషల్ మీడియాలో రికార్డ్ స్థాయిలో వ్యూస్ తో దుమ్మురేపుతోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఓ లేటెస్ట్ అప్డేట్ ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. 

ఇక ఈ అప్డేట్ గురించి తెలుసుకున్న ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటంటే పుష్పది రూల్ లో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు పుష్ప 2 క్లైమాక్స్ లో సుకుమార్ ఎవరు ఊహించని ఓ భారీ ట్విస్ట్ కూడా ఇవ్వబోతున్నాడట. పార్ట్ 2 లో ఓ అండర్ కవర్ ఆఫీసర్ పాత్ర కూడా ఉంటుందట. అంటే మహేష్ పోకిరి టైపులో ఆ పాత్రకు సంబంధించి అదిరిపోయే ట్విస్ట్ కూడా ఇవ్వబోతున్నారని అంటున్నారు. అయితే ఈ లేటెస్ట్ అప్డేట్ పుష్ప 2 పై ఉన్న అంచనాలను తారాస్థాయికి చేర్చింది.ఇక లేటెస్ట్ గా రిలీజ్ చేసిన టీజర్ ని బట్టి చూస్తుంటే సినిమాలో ఈ ట్విస్ట్ ఉండొచ్చు? అలా కూడా జరగొచ్చు?..

అని నెటిజన్స్ పుష్ప2 స్టోరీని తమకు తోచినట్లు ఇమేజిన్ చేసుకుంటున్నారు. మొత్తానికి పుష్ప 2 కోసం సుకుమార్ భారీ భారీ స్కెచ్ లే వేస్తున్నాడు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇలాంటి గాసిప్స్ తోనే సినిమాపై హైప్ ఓ రేంజ్ లో పెరుగుతోంది. ఈ హైపే రేపు సినిమా సక్సెస్ కి మెయిన్ ఎసెట్ గా మారుతుంది. ఒకవేళ నిజంగానే పుష్ప2లో బన్నీ డ్యూయల్ రోల్ చేస్తే కచ్చితంగా ఈ మూవీ రేపు ఇండియన్ బాక్సాఫీస్ ని రూల్ చేయడం గ్యారెంటీ అని చెబుతున్నారు సినీ విశ్లేషకులు. మరి ముందు ముందు సుకుమార్ దీనిపై ఎలాంటి హింట్ ఇస్తాడో చూడాలి. ఇక ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాని వీలైతే ఈ ఏడాది చివరికల్లా లేదా వచ్చేఏడాది వేసవికి విడుదల చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు...!!



RRR Telugu Movie Review Rating

ఏజెంట్: తగ్గిన బజ్.. ఇకనైన టీం నిద్రలేస్తుందా?

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?

లోకేశ్‌ పాదయాత్రలో ఆ పని కూడా కానిచ్చేస్తున్నాడా?

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో భారత్‌కు భారీ లాభాలు?

ఫ్యామిలీ లేకపోవడమే మోడీకి ప్లస్సా?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>