MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda7b51001-07d8-40a9-9012-09545e0fef24-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda7b51001-07d8-40a9-9012-09545e0fef24-415x250-IndiaHerald.jpgఅతి తక్కువ బడ్జెట్ తో తీసిన చిన్నసినిమాలు ఘనవిజయం సాధించి నిర్మాతలకు కోట్లు కురిపించిన సందర్భాలు చాల ఉన్నాయి. ‘జాతి రత్నాలు’ ‘డీజే టిల్లు’ లేటెస్ట్ గా వచ్చిన ‘బలగం’ సినిమాలు అతి తక్కువ బడ్జెట్ తో తీసినప్పటికీ ఆసినిమాలు మూవీ నిర్మాతలకు కోట్లు కురిపించాయి. ఈనేపధ్యంలో ఈమధ్యనే మళయాళంలో విడుదలై 50కోట్లు తెచ్చుకున్న ఒక చిన్న మళయాళ మూవీని తెలుగు నిర్మాతలు ఎందుకు పట్టించుకోలేదు అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారు. ఈమూవీ పేరు ‘రోమాంచమ్’ కేవలం 2కోట్లతో నిర్మించిన ఈమూవీ 50కోట్ల కలక్షన్స్ ను వసూలు చేసింది. 1997TOLLYWOOD{#}jeevan;GEUM;job;Remake;Comedy;media;Tollywood;Telugu;Cinema50కోట్ల సినిమాను పట్టించుకోని టాలీవుడ్ !50కోట్ల సినిమాను పట్టించుకోని టాలీవుడ్ !TOLLYWOOD{#}jeevan;GEUM;job;Remake;Comedy;media;Tollywood;Telugu;CinemaWed, 12 Apr 2023 12:42:53 GMTఅతి తక్కువ బడ్జెట్ తో తీసిన చిన్నసినిమాలు ఘనవిజయం సాధించి నిర్మాతలకు కోట్లు కురిపించిన సందర్భాలు చాల ఉన్నాయి. ‘జాతి రత్నాలు’ ‘డీజే టిల్లు’ లేటెస్ట్ గా వచ్చిన ‘బలగం’ సినిమాలు అతి తక్కువ బడ్జెట్ తో తీసినప్పటికీ ఆసినిమాలు మూవీ నిర్మాతలకు కోట్లు కురిపించాయి.


ఈనేపధ్యంలో ఈమధ్యనే మళయాళంలో విడుదలై 50కోట్లు తెచ్చుకున్న ఒక చిన్న మళయాళ మూవీని తెలుగు నిర్మాతలు ఎందుకు పట్టించుకోలేదు అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారు. ఈమూవీ పేరు ‘రోమాంచమ్’ కేవలం 2కోట్లతో నిర్మించిన ఈమూవీ 50కోట్ల కలక్షన్స్ ను వసూలు చేసింది. 1997 ప్రాంతంలో జరిగిన ఒక కథ ఆధారంగా ఈమూవీని నిర్మించారు. ఈమూవీ కథ విషయానికి వస్తే ఏడుగురు బ్రహ్మచారులు బెంగళూరు శివార్లలో ఒక రూమ్ అద్దెకు తీసుకుని ఉంటారు.


అందులో ఒకడికి ఉద్యోగం మరొకడికి వ్యాపారం తప్ప మిగిలినవాళ్లంతాఎటువంటి సంపాదన లేకుండా ఖాళీగా ఉంటారు. ఇంటర్వ్యూలకు వెళ్ళి రావడం వారి నిత్యజీవన విధానం. వారిలో ఒకడి పేరు జీవన్ ఖాళీగా ఉండి ఏపని చేయాలో తెలియక ఒక స్నేహితుడి దగ్గర ఆత్మలను పిలిచే ‘ఓజో’ బోర్డు గేమ్ నేర్చుకుంటాడు. ఆగేమ్ ను తన స్నేహితులను కూర్చోపెట్టి తన రూమ్ లో ఆడటానికి ప్రయత్నిస్తాడు. మొదట సరదాగా ఆడిన ఆగేమ్ లో అనామిక అనే ఆత్మ ప్రవేశించి వీళ్ళు అడిగే ప్రశ్నలకు క్యారంబోర్డు మీద టీ గ్లాసుని కదిలిస్తూ సమాధానం చెబుతుంది.


ఈవిషయం ఆచుట్టు పక్కల వారందరికీ తెలిసి విపరీతంగా జనం వస్తూ ఉంటారు. అయితే వీరంతా వారికి తెలియకుండానే అనామిక ఆత్మ గేమ్ లో చిక్కుకుని ఒక క్రైమ్ లో ఇరుక్కోవడమే కాకుండా వారంతా ఆసుపత్రికి వెళ్ళే పరిస్థితులు ఏర్పడతాయి. అక్కడ నుండి కథ అనేక మలుపులు తీసుకుంటుంది. దాదాపు సినిమా మొత్తం మూడు రూమ్ లు ఉన్న ఒకే ఇంట్లో జరుగుతుంది. అవుట్ డోర్ లొకేషన్స్ కూడ రెండు మూడు మాత్రమే కనిపిస్తాయి. ఈసినిమా మొత్తం ఖర్చు ఒక కోటి రూపాయలు మాత్రమే అని మళయాళ మీడియా వ్రాస్తోంది. సింపుల్ కామెడీ భయపెట్టే సీన్స్ లేకుండా ఈమూవీని తీసారు. అయితే ఈమూవీ రీమేక్ రైట్స్ గురించి ఇప్పటివరకు టాలీవుడ్ నిర్మాతలు ఎందుకు ప్రయత్నించడం లేదు అన్నది సమాధానం లేని ప్రశ్నగా మారింది..





RRR Telugu Movie Review Rating

"ఏజెంట్" థర్డ్ సింగిల్ విడుదల అనౌన్స్మెంట్ ఈరోజు ఆ సమయానికి..!

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?

లోకేశ్‌ పాదయాత్రలో ఆ పని కూడా కానిచ్చేస్తున్నాడా?

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో భారత్‌కు భారీ లాభాలు?

ఫ్యామిలీ లేకపోవడమే మోడీకి ప్లస్సా?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>