MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha113d3008-6edb-4187-b897-2b08719225ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha113d3008-6edb-4187-b897-2b08719225ab-415x250-IndiaHerald.jpgసమంత కెరియర్ లో చాల సినిమాలకు చిన్మయి డబ్బింగ్ చెప్పింది. ఆరోజులలో సమంత ఆత్మగా చిన్మయి ని గుర్తించేవారు. అయితే ఆతరువాత కాలంలో సమంత తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం మొదలుపెట్టి ఆవిషయంలో సక్సస్ సాధించింది. తెలుగు భాష ఆమె చాల అనర్గళంగా మాట్లాడగలదు.అయితే ఆమె ఇప్పటివరకు ఎటువంటి పౌరాణిక సినిమాలలో నటించలేదు. దీనికితోడు పౌరాణిక పాత్రల సంభాషణలు చాల గంభీరంగా ఉంటాయి. అలాంటి పాత్రలు నటించే నటీనటులకు తెలుగు భాష పై మంచి పట్టు ఉండాలి. దీనికితోడు గొంతులో గంభీరత కనిపించాలి. గతంలో శారద వాణిశ్రీ జమున లాంటsamantha{#}Chinmayi;Sharada;jamuna;Dil;Hindi;Samantha;Tamil;Heroine;Cinema;Teluguశాకుంతలం విజయానికి సమంత వాయస్ కీలకం కానుందా !శాకుంతలం విజయానికి సమంత వాయస్ కీలకం కానుందా !samantha{#}Chinmayi;Sharada;jamuna;Dil;Hindi;Samantha;Tamil;Heroine;Cinema;TeluguWed, 12 Apr 2023 09:00:00 GMTసమంత కెరియర్ లో చాల సినిమాలకు చిన్మయి డబ్బింగ్ చెప్పింది. ఆరోజులలో సమంత ఆత్మగా చిన్మయి ని గుర్తించేవారు. అయితే ఆతరువాత కాలంలో సమంత తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం మొదలుపెట్టి ఆవిషయంలో సక్సస్ సాధించింది. తెలుగు భాష ఆమె చాల అనర్గళంగా మాట్లాడగలదు.


అయితే ఆమె ఇప్పటివరకు ఎటువంటి పౌరాణిక సినిమాలలో నటించలేదు. దీనికితోడు పౌరాణిక పాత్రల సంభాషణలు చాల గంభీరంగా ఉంటాయి. అలాంటి పాత్రలు నటించే నటీనటులకు తెలుగు భాష పై మంచి పట్టు ఉండాలి. దీనికితోడు గొంతులో గంభీరత కనిపించాలి. గతంలో శారద వాణిశ్రీ జమున లాంటి హీరోయిన్స్ పౌరాణిక పాత్రలలో నటించి ఆపాత్రలకు జీవం పోశారు.


అలాంటి స్థాయిలో సమంత డైలాగ్స్ చెప్పగలదా అన్న సందేహాలు కొందరు వ్యక్త పరుస్తున్నారు. అంతేకాదు ఈసినిమాకు సమంత గొంతు మైనస్ అవుతుందా అన్న చర్చలు కూడ జరుగుతున్నాయి. మరొక విషయం ఏమిటంటే ఈసినిమాకు సంబంధించి సమంత తెలుగు తమిళ మళయాళ హిందీ భాషలలో తానే డబ్బింగ్ చెప్పుకుంది. ఒక విధంగా ఇది చాల సాహసం అని అంటున్నారు. పౌరాణిక సినిమాలకు ఆయువుపట్టు అయిన డైలాగ్స్ చెప్పడంలో తేలిపోతే దాని ప్రభావం సినిమా సక్సస్ పై ఉంటుంది.

అయితే సమంత ఈవిషయంలో మరొక విధంగా స్పందిస్తోంది. వేర్వేరు భాష‌ల్లో డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డం చాలా క‌ష్ట పడ్డానని దీనికోసం తాను చాల రిహార్సిల్స్ చేసానని అంటోంది. అయితే ఆమె కష్టం ఎంతవరకు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంది అన్న విషయం పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకేసారి దేశవ్యాప్తంగా 5 భాషలలో విడుదల కాబోతున్న ‘శాకుంతలం’ మూవీ ఫలితంలో తేడా వస్తే ఈమూవీ బయ్యర్లు తీవ్రంగా నష్టపోవడమే కాకుండా అది సమంత భవిష్యత్ సినిమాల మార్కెటింగ్ పై తీవ్ర ప్రభావం చూపించే ఆస్కారం ఉంది. అయితే ప్రస్తుతం దిల్ రాజ్ అదృష్టం పరుగులు తీస్తున్న పరిస్థితులలో ఆయన చేయి పడిన ‘శాకుంతలం’ ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందో చూడాలి..






RRR Telugu Movie Review Rating

బలగం బ్యూటీ.. చిరంజీవి సినిమాలో నటించిందట తెలుసా?

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?

లోకేశ్‌ పాదయాత్రలో ఆ పని కూడా కానిచ్చేస్తున్నాడా?

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో భారత్‌కు భారీ లాభాలు?

ఫ్యామిలీ లేకపోవడమే మోడీకి ప్లస్సా?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>