Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/suryae20fcba8-7dde-4670-859a-cbb25c7882e5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/suryae20fcba8-7dde-4670-859a-cbb25c7882e5-415x250-IndiaHerald.jpgటి20 ఫార్మాట్లో సూర్య కుమార్ యాదవ్ ఎంత విధ్వంసకరమైన ఆటగాడో అన్న విషయం గురించి క్రికెట్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అద్భుతమైన ఆట తీరుతో క్రికెట్ ప్రపంచం చూపును తన వైపుకు తిప్పుకున్నాడు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్లో నయా మిస్టర్ 360 ప్లేయర్గా మారిపోయాడు. అటు సహచర ఆటగాళ్లు పరుగులు తీయడానికి ఎంతో కష్టపడి పోతున్న మైదానంలో కూడా గ్రౌండ్లో ఇరువైపులా కూడా అద్భుతమైన షాట్స్ ఆడుతూ సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతూ ఉంటాడు సూర్య కుమార్ యాదవ్. ఇలా అద్భుతమైన ఫామ్ కనబరిచాడు కాబట్టే ఇక ఇప్పుడు ఐసీSurya{#}Suryakumar Yadav;Mister;ICC T20;surya sivakumar;INTERNATIONAL;Mumbai;Cricketపేలవ ఫామ్ ఓకే కానీ.. ఈ డకౌట్స్ ఏంటి?పేలవ ఫామ్ ఓకే కానీ.. ఈ డకౌట్స్ ఏంటి?Surya{#}Suryakumar Yadav;Mister;ICC T20;surya sivakumar;INTERNATIONAL;Mumbai;CricketWed, 12 Apr 2023 15:30:00 GMTటి20 ఫార్మాట్లో సూర్య కుమార్ యాదవ్ ఎంత విధ్వంసకరమైన ఆటగాడో అన్న విషయం గురించి క్రికెట్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అద్భుతమైన ఆట తీరుతో క్రికెట్ ప్రపంచం చూపును తన వైపుకు తిప్పుకున్నాడు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్లో నయా మిస్టర్ 360 ప్లేయర్గా మారిపోయాడు. అటు సహచర ఆటగాళ్లు పరుగులు తీయడానికి ఎంతో కష్టపడి పోతున్న మైదానంలో కూడా గ్రౌండ్లో ఇరువైపులా కూడా అద్భుతమైన షాట్స్ ఆడుతూ సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతూ ఉంటాడు సూర్య కుమార్ యాదవ్.



ఇలా అద్భుతమైన ఫామ్ కనబరిచాడు కాబట్టే ఇక ఇప్పుడు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. గత కొంతకాలం నుంచి ఇలా నెంబర్ వన్ స్థానాల్లోనే కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. అలాంటి సూర్య కుమార్ యాదవ్ మొన్నటి వరకు వన్డే ఫార్మాట్లో పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. దీంతో సూర్యకుమార్ యాదవ్ కేవలం టి20 లకు మాత్రమే పనికొస్తాడని వన్డే ఫార్మాట్ కి సెట్ కాడు అంటూ విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు అతని ప్రదర్శన చూస్తుంటే టి20 ఫార్మాట్లో సైతం సూర్యకుమార్ నిరాశ పరుస్తున్నాడు అన్నది తెలుస్తుంది.



 ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టులో స్టార్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న సూర్య కుమార్.. వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. సాధారణంగా ఏ ఆటగాడు అయినా సరే అటు పేలవమైన ఫామ్ లో ఉన్నప్పుడు తక్కువ పరుగులు చేసి వికెట్ కోల్పోవడం చూస్తూ ఉంటాం. కానీ సూర్య కుమార్ మాత్రం ఏకంగా పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్ అవుతూ ఉండటం మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గత ఆరు ఇన్నింగ్స్ లో సూర్యకుమార్ కు ఇది నాలుగో గోల్డెన్ డకౌట్ కావడం గమనార్హం . పేలవా ఫామ్ ఓకే కానీ ఇలా గోల్డెన్ డకౌట్ అవ్వడం ఏంటి అని ఫ్యాన్స్ సైతం సోషల్ మీడియాలో అతన్ని ప్రశ్నిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

ఏజెంట్: తగ్గిన బజ్.. ఇకనైన టీం నిద్రలేస్తుందా?

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?

లోకేశ్‌ పాదయాత్రలో ఆ పని కూడా కానిచ్చేస్తున్నాడా?

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో భారత్‌కు భారీ లాభాలు?

ఫ్యామిలీ లేకపోవడమే మోడీకి ప్లస్సా?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>