MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devil0fb29805-2419-4e76-b4bd-6934ba28c55e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devil0fb29805-2419-4e76-b4bd-6934ba28c55e-415x250-IndiaHerald.jpgనందమూరి హీరోల్లో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ అంటే అది నందమూరి కళ్యాణ్ రామ్ ఒక్కడే. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఈ హీరో ప్రయోగాలకు ఎప్పుడూ కూడా పెద్దపీట వేస్తుంటాడు. రొటీన్ మూవీస్ కాకుండా ఆడియన్స్ కి విభిన్న తరహా కథలను చూపించాలని ఎప్పుడు కూడా ఆరాటపడుతుంటాడు. అలా ప్రయోగాలు చేసిన చాలాసార్లు కళ్యాణ్ రామ్ ఎన్నో ఫెయిల్యూర్స్ అందుకున్నాడు. అయినా కూడా ఈ హీరో ఎక్కడ వెనక్కి తగ్గలేదు. అలా చాలా కాలం తర్వాత 'బింబిసార' సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా అందించిన విజయంతో ఇటీవల 'అమిగోస్' అనే సినిమDevil{#}CBN;abhishek;jeevitha rajaseskhar;kalyan ram;Audience;Medaram;Hero;Heroine;India;Cinemaషూటింగ్ పూర్తి చేసుకున్న 'డెవిల్'.. రిలీజ్ ఎప్పుడంటే..?షూటింగ్ పూర్తి చేసుకున్న 'డెవిల్'.. రిలీజ్ ఎప్పుడంటే..?Devil{#}CBN;abhishek;jeevitha rajaseskhar;kalyan ram;Audience;Medaram;Hero;Heroine;India;CinemaWed, 12 Apr 2023 12:10:00 GMTనందమూరి హీరోల్లో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ అంటే అది నందమూరి కళ్యాణ్ రామ్ ఒక్కడే. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఈ హీరో ప్రయోగాలకు ఎప్పుడూ కూడా పెద్దపీట వేస్తుంటాడు. రొటీన్ మూవీస్ కాకుండా ఆడియన్స్ కి విభిన్న తరహా కథలను చూపించాలని ఎప్పుడు కూడా ఆరాటపడుతుంటాడు. అలా ప్రయోగాలు చేసిన చాలాసార్లు కళ్యాణ్ రామ్ ఎన్నో ఫెయిల్యూర్స్ అందుకున్నాడు. అయినా కూడా ఈ హీరో ఎక్కడ వెనక్కి తగ్గలేదు. అలా చాలా కాలం తర్వాత 'బింబిసార' సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా అందించిన విజయంతో ఇటీవల 'అమిగోస్' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. 

విడుదలకు ముందు ఈ సినిమాకి మంచి బజ్ ఏర్పడగా.. తీరా రిలీజ్ అయ్యాక భారీ నష్టాలను మూటగట్టుకుంది. కానీ సినిమాలో కళ్యాణ్ రామ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో కళ్యాణ్రామ్ అదరగొట్టాడు. ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ మరో మూడు సినిమాలను సెట్స్ పై ఉంచాడు. అందులో 'డెవిల్' అనే సినిమా ఒకటి. ఈ సినిమాను బాబు బాగా బిజీ మూవీ ఫేం నవీన్ మేడారం డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్తో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న ఈ మూవీ తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.

పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ సినిమా 1945 బ్రిటిష్ పరిపాలన కాలంలో సాగుతుంది. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలిస్తున్న టైంలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగానే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ రహస్య గూఢచారిగా కనిపించబోతున్నాడు. ఇక అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామ భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ  సినిమాలో కళ్యాణ్రామ్ కి జోడిగా సంయుక్త మీద హీరోయిన్ గా నటిస్తోంది. ఇక తాజాగా షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకోబోతున్న ఈ సినిమాని ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మూవీ టీం ప్లాన్ చేస్తుంది. అన్నట్టు సినిమాలో కళ్యాణ్రామ్ మెకోవర్ దగ్గరనుంచి అతని నటన, యాక్షన్ సీక్వెన్స్ లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయట...!!



RRR Telugu Movie Review Rating

"ఏజెంట్" థర్డ్ సింగిల్ విడుదల అనౌన్స్మెంట్ ఈరోజు ఆ సమయానికి..!

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?

లోకేశ్‌ పాదయాత్రలో ఆ పని కూడా కానిచ్చేస్తున్నాడా?

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో భారత్‌కు భారీ లాభాలు?

ఫ్యామిలీ లేకపోవడమే మోడీకి ప్లస్సా?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>