MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi6a697c04-ec69-414d-8341-23c9518fe050-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi6a697c04-ec69-414d-8341-23c9518fe050-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఓ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న చిరు.. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో బోళా శంకర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తోనే బిజీగా ఉన్నాడు చిరంజీవి. తమిళంలో హిట్ అయిన వేదాళం అనే సినిమాకి రీమేక్ గా వస్తున్న ఈ మూవీలో తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. కీర్తి సురేష్ మెగాస్టార్ కి సోదరిగా కనిపించనుంది.ఇదిలా ఉంటె మెగాస్టార్ గ్యారేజ్ లో ఇప్పుడు మరో లగ్జరీ Chiranjeevi{#}Car;Remake;meher ramesh;shankar;keerthi suresh;tamannaah bhatia;Chiranjeevi;Hero;tuesday;Cinemaలగ్జరీ కార్ కొన్న మెగాస్టార్.. రేట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?లగ్జరీ కార్ కొన్న మెగాస్టార్.. రేట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?Chiranjeevi{#}Car;Remake;meher ramesh;shankar;keerthi suresh;tamannaah bhatia;Chiranjeevi;Hero;tuesday;CinemaWed, 12 Apr 2023 16:58:10 GMTటాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఓ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న చిరు.. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో బోళా శంకర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తోనే బిజీగా ఉన్నాడు చిరంజీవి. తమిళంలో హిట్ అయిన వేదాళం అనే సినిమాకి రీమేక్ గా వస్తున్న ఈ మూవీలో తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. కీర్తి సురేష్ మెగాస్టార్ కి సోదరిగా కనిపించనుంది.ఇదిలా ఉంటె మెగాస్టార్ గ్యారేజ్ లో ఇప్పుడు మరో లగ్జరీ కారు వచ్చి చేరింది.తాజాగా చిరంజీవి టయోటా వెల్ ఫైర్ కారును కొనుగోలు చేశారు. 

ఇక దీని షో రూమ్ ధర టాక్స్ ధరలతో కలుపుకొని సుమారు ఒకటి 1.9 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఇక బర్నింగ్ బ్లాక్ కలర్ లో చాలా స్పెషల్ గా ఉన్న ఈ కారికి ఆర్టీఏ అధికారులు ఆల్-1 నంబర్ కేటాయించారు. సుమారు 4.70 లక్షలతో టీఎస్ 09 బిజీ 1111 నంబర్ను మెగాస్టార్ చిరంజీవి సొంతం చేసుకున్నారు. ఇక అందులో భాగంగానే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కోసం మంగళవారం ఖైరతాబాద్ ఆర్టిఏ ఆఫీస్ కి వచ్చారు చిరంజీవి. ఇక ఆర్టీవో రామచంద్రం సమక్షంలో ఫోటో, డిజిటల్ సంతకం తదితర ప్రక్రియను పూర్తి చేశారు. కొణిదల చిరంజీవి పేరుతోనే ఈ కారణం రిజిస్ట్రేషన్ చేశారు.

ఇక ఈ ఈ కారు ప్రత్యేకతలు గమనిస్తే.. హై స్పెసిఫికేషన్స్ తో మార్కెట్లోకి వచ్చిన ఈ మల్టీపర్పస్ వెహికల్ లో మూడు వరుసలుంటాయి. ఏడుగురు ఈ కారులో కూర్చుని ప్రయాణం చేయవచ్చు. మధ్యలో విఐపి సీట్లు కూడా ఉంటాయి. ఇక భద్రత కోసం ఈ కారులో ఏకంగా ఏడు ఎయిర్ బ్యాగ్స్ ఉండడం విశేషం  ట్విన్ సన్ రూఫ్, 13 అంగుళాల ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్ లాంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక ఫ్రంట్ లో కూడా పది అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ఉంటుంది. ఇక ఈ కార్లో ఎల్ఈడి హెడ్ లైన్స్ కూడా ఉన్నాయి. ఇక లీటర్ కి ఈ కారు గరిష్టంగా సుమారు 16.35 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. వీటితోపాటు పనోరమిక్ వ్యూ మానిటర్, వెహికల్ డైనమిక్ మేనేజ్మెంట్, ఫ్రంట్ అండ్ రియల్ పార్కింగ్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఇక ఈ కార్ కి 2.5 పెట్రోలింగ్ ఇంజన్ తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్స్ కూడా ఉన్నాయి. ఇక ప్రస్తుతం మెగాస్టార్ లేటెస్ట్ లగ్జరీ కార్ కు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి...!!



RRR Telugu Movie Review Rating

ఏజెంట్: తగ్గిన బజ్.. ఇకనైన టీం నిద్రలేస్తుందా?

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?

లోకేశ్‌ పాదయాత్రలో ఆ పని కూడా కానిచ్చేస్తున్నాడా?

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో భారత్‌కు భారీ లాభాలు?

ఫ్యామిలీ లేకపోవడమే మోడీకి ప్లస్సా?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>