EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/soudi-arabia8d47beed-d03e-4579-a8fb-22e5c86df75b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/soudi-arabia8d47beed-d03e-4579-a8fb-22e5c86df75b-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత్ అమెరికా, రష్యా రెండు దేశాలతో మిత్ర దేశంగా ఉంటోంది. రష్యా నుంచి ఆయిల్ కొనకూడదని అమెరికా ఆంక్షలు విధించినా కూడా తక్కువ ధరకు అక్కడి నుంచి ఆయిల్ కొని భారత్ సొమ్ము చేసుకుంటోంది. ప్రస్తుతం ఇదే బాటలో నడవాలని సౌదీ నిర్ణయించుకుంది. రష్యాకు చెందిన యుద్ధ నౌక సౌదీ అరేబియాలోని జెడ్డా కు చేరుకుంది. కనీసం వాణిజ్య నౌకలు కూడా రావాద్దని అమెరికా హెచ్చరించిన వేళ ఏకంగా యుద్ద నౌకనే సౌదీకి చేరుకోవడంతో అమెరికా కంగుతింది. అమెరికా రెండు లక్షల బ్యారెళ్ల చమురును ఇవ్వమని అడిగితే కేవలం లక్ష బ్యారెళ్లు మాత్రమSOUDI ARABIA{#}mithra;India;Russia;Korea; South;Ukraine;American Samoa;Moscow;oil;Thief;Europe countries;Dongaరష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?SOUDI ARABIA{#}mithra;India;Russia;Korea; South;Ukraine;American Samoa;Moscow;oil;Thief;Europe countries;DongaWed, 12 Apr 2023 06:00:00 GMTప్రస్తుతం భారత్ అమెరికా, రష్యా రెండు దేశాలతో మిత్ర దేశంగా ఉంటోంది. రష్యా నుంచి ఆయిల్ కొనకూడదని అమెరికా ఆంక్షలు విధించినా కూడా తక్కువ ధరకు అక్కడి నుంచి ఆయిల్ కొని భారత్ సొమ్ము చేసుకుంటోంది. ప్రస్తుతం ఇదే బాటలో నడవాలని సౌదీ నిర్ణయించుకుంది.  రష్యాకు చెందిన యుద్ధ నౌక సౌదీ అరేబియాలోని జెడ్డా కు చేరుకుంది. కనీసం వాణిజ్య నౌకలు కూడా రావాద్దని అమెరికా హెచ్చరించిన వేళ ఏకంగా యుద్ద నౌకనే సౌదీకి చేరుకోవడంతో అమెరికా కంగుతింది. అమెరికా రెండు లక్షల బ్యారెళ్ల చమురును ఇవ్వమని అడిగితే కేవలం లక్ష బ్యారెళ్లు మాత్రమే ఇస్తామని చెప్పినా సౌదీ ప్రస్తుతం రష్యాతో కలిసి అడుగులేయడం అమెరికాకు మింగుడు పడని అంశం.


ప్రపంచంలో ఎక్కువగా క్రూడాయిల్ ఉత్పత్తి అయ్యే దేశాల్లో సౌదీ కూడా ఒకటి. ప్రపంచ దేశాలకు ఎక్కువగా ఆయిల్ ను ఎగుమతి చేస్తూ సంపన్న దేశంగా విరాజిల్లుతోంది. ఇలాంటి దేశంలో అమెరికా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది. ఏ విధంగా ముందడుగు వేస్తుందనేది చూడాలి. అయితే ఉక్రెయిన్ కు మద్దతు ఇచ్చి ఆయుధాలు సరఫరా  చేస్తున్న అమెరికా రష్యాపై ఉక్రెయిన్ ను గెలిపించుకోలేక నానా తంటాలు పడుతోంది. దీంతో విసుగు చెందిన యూరప్ దేశాలు సైతం ఆయిల్ ను దొంగ చాటుగా కొనడం ప్రారంభించాయి.


ఇప్పటి వరకు గ్యాస్ ను మాత్రం రష్యా నుంచే కొనుగోలు చేస్తున్నాయి. ఒపెక్ దేశాలు కూడా అమెరికా మాటను పెడచెవిన పెట్టడంతో ఏం చేయాలో తోచని పరిస్థితి అగ్రరాజ్యానిది. ఈ మధ్య సౌదీ, చైనా, రష్యా, ఉత్తర కొరియా నాలుగు దేశాలు మాస్కోలో సమావేశమయ్యాయి. మాస్కో లో జరిగిన సమావేశం సంబంధించి అమెరికా గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే.  సౌదీ ఆయిల్ ఇవ్వనని చెప్పడం, రష్యా యుద్ధ నౌక ఏకంగా సౌదీ కి రావడం అమెరికాకు ఆందోళన కలిగించే విషయాలే.



RRR Telugu Movie Review Rating

అమరావతి : విశాఖపై కేసీయార్ యాక్షన్ ప్లాన్ రెడీ ?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?

చంద్రబాబు, పవన్ పొత్తుకు అదే అడ్డంకి?

కొత్త ఆయుధాలు సమకూర్చుకున్న రష్యా?

తీవ్ర గందరగోళంలో పవన్‌.. బాబుకు పిచ్చ క్లారిటీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>