MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raghava-lawrence7a4b6894-d5db-4011-9caa-afba0b4c9226-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raghava-lawrence7a4b6894-d5db-4011-9caa-afba0b4c9226-415x250-IndiaHerald.jpgకొరియోగ్రాఫర్ కం డైరెక్టర్ కం హీరో రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో మొదట ఓ సాదాసీదా డాన్సర్ గా కెరీర్ ప్రారంభించిన లారెన్స్ ఆ తర్వాత తన డాన్స్ టాలెంట్ తో స్టార్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్నాడు. అక్కడితో ఆగకుండా తనలోని నటుడిని ఆవిష్కరించాడు. అలా హీరోగా కూడా మారి పలు సూపర్ హిట్ సినిమాలో నటించాడు.ఇక ఆపై డైరెక్టర్గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అలా సినీ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా భారీ క్రేజ్ సంపాదించుకున్న లారెన్స్ కి ఎంతో గొప్ప మనసు ఉంది. ముఖRaghava Lawrence{#}shankar;Varsham;Kumaar;Heart;raghava lawrence;Event;radhika;Director;Hero;Cinema;Telugu;mediaమరోసారి గొప్ప మనసు చాటుకున్న లారెన్స్.. ఏకంగా 150 మంది చిన్నారులకు అండగా నిలిచిన హీరో..!!మరోసారి గొప్ప మనసు చాటుకున్న లారెన్స్.. ఏకంగా 150 మంది చిన్నారులకు అండగా నిలిచిన హీరో..!!Raghava Lawrence{#}shankar;Varsham;Kumaar;Heart;raghava lawrence;Event;radhika;Director;Hero;Cinema;Telugu;mediaWed, 12 Apr 2023 12:00:12 GMTకొరియోగ్రాఫర్ కం డైరెక్టర్ కం హీరో రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో మొదట ఓ సాదాసీదా డాన్సర్ గా కెరీర్ ప్రారంభించిన లారెన్స్ ఆ తర్వాత తన డాన్స్ టాలెంట్ తో స్టార్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్నాడు. అక్కడితో ఆగకుండా తనలోని నటుడిని ఆవిష్కరించాడు. అలా హీరోగా కూడా మారి పలు సూపర్ హిట్ సినిమాలో నటించాడు.ఇక ఆపై డైరెక్టర్గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అలా సినీ  ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా భారీ క్రేజ్ సంపాదించుకున్న లారెన్స్ కి ఎంతో గొప్ప మనసు ఉంది. ముఖ్యంగా లారెన్స్ లో ఉన్న గొప్ప గుణం సేవాగుణం. తన చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలను అనుభవించిన లారెన్స్ ఇప్పుడు వేలాదిమంది అనాధ పిల్లలను దత్తత తీసుకొని తన సొంత ఖర్చుతో వారిని చదివిస్తూ వారి బాగోగులను చూసుకుంటున్నాడు. 

అలాగే లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వేలాది మందికి వైద్య సేవలను అందిస్తున్నాడు. అటువంటి గొప్ప మనసు కలిగిన రాఘవ లారెన్స్ మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. తాజాకా మరో 150 మంది పిల్లలను దత్తత తీసుకున్నాడు లారెన్స్. ఇక 150 మంది పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తానంటూ వాగ్దానం చేశాడు. ఇందుకు తనకు సినీ ప్రేక్షకుల నుంచి ఆశీస్సులు కావాలని కోరాడు. ఇక తాను తాజాగా నటిస్తున్న రుద్రుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ఆ 150 మంది చిన్నారులతో కలిసిన దిగిన ఫోటోను లారెన్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నెటిజన్లు రాఘవ లారెన్స్ పై పొగడ్తల వర్షం కురిపిస్తూ అతని గొప్ప మనసుకి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

ఇక గతంలోనూ రాఘవ లారెన్స్ తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారు. గతంలో 141 మంది చిన్నారులకు శస్త్ర చికిత్స చేయించి వార్తల్లో నిలిచాడు. కేవలం తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు శస్త్ర చికిత్స చేయించాలన్న, ఆర్థిక సమస్యల కారణంగా చదువుకోలేకపోతున్నా వెంటనే లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ను సంప్రదించమంటూ రాఘవ లారెన్స్ స్వయంగా కోరారు. దీంతో రాఘవ లారెన్స్ గొప్ప మనసుకి సోషల్ మీడియా వేదికగా అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక లారెన్స్ సినిమాల విషయానికొస్తే.. తాజాగా ఈ హీరో నటించిన రుద్రుడు మూవీ ఈనెల 14న రిలీజ్ కానుంది. మదర్ సెంటిమెంట్ తో రూపొందిన ఈ సినిమాని కతిరేషన్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో లారెన్స్ సరసన భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. నాజర్, రాధిక శరత్ కుమార్ కీలకపాత్రలు పోషించారు...!!



RRR Telugu Movie Review Rating

మనుషుల్లాగే మద్యానికి బానిసగా మారిన కుక్క.. చివరికి?

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?

లోకేశ్‌ పాదయాత్రలో ఆ పని కూడా కానిచ్చేస్తున్నాడా?

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో భారత్‌కు భారీ లాభాలు?

ఫ్యామిలీ లేకపోవడమే మోడీకి ప్లస్సా?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>