EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/lokeshd5dcbd57-c2d0-4dba-b450-94b3e5f5010a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/lokeshd5dcbd57-c2d0-4dba-b450-94b3e5f5010a-415x250-IndiaHerald.jpgపంచాయతీలకు నేరుగా నిధులుస్తాయి. కానీ వాటిని వేరే వాటికి మళ్లిస్తున్నారని టీడీపీ యువనేత లోకేశ్ చెబుతున్నారు. వాటిని కాపాడుకోవాలని సర్పంచులకు సూచిస్తున్నారు. కానీ గతంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు గ్రామాల్లో ఏ కార్యక్రమం చేపట్టినా అది రాష్ట్ర ప్రభుత్వానికే క్రెడిట్ దక్కేది. డబ్బులు ఇచ్చేది కేంద్రం. కానీ ప్రచారం చేసుకునేవి రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పటికీ కూడా గ్రామీణ రోడ్లు, సంఘ భవనాలు, మంచి నీటి సౌకర్యం తదితర పథకాలకు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచే ఎక్కువగా వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని చేస్తుLOKESH{#}Aqua;YCP;central government;CBN;TDP;Government;Nara Lokesh;Bharatiya Janata Party;Partyచంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?LOKESH{#}Aqua;YCP;central government;CBN;TDP;Government;Nara Lokesh;Bharatiya Janata Party;PartyWed, 12 Apr 2023 08:00:00 GMTపంచాయతీలకు నేరుగా నిధులుస్తాయి. కానీ వాటిని వేరే వాటికి మళ్లిస్తున్నారని టీడీపీ యువనేత లోకేశ్ చెబుతున్నారు. వాటిని కాపాడుకోవాలని సర్పంచులకు సూచిస్తున్నారు. కానీ గతంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు గ్రామాల్లో ఏ కార్యక్రమం చేపట్టినా అది రాష్ట్ర ప్రభుత్వానికే క్రెడిట్ దక్కేది. డబ్బులు ఇచ్చేది కేంద్రం. కానీ ప్రచారం చేసుకునేవి రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పటికీ కూడా గ్రామీణ రోడ్లు,  సంఘ భవనాలు, మంచి నీటి సౌకర్యం తదితర పథకాలకు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచే ఎక్కువగా వస్తాయి.


రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని చేస్తుంది. ఉపాధి హామీ పథకం, రేషన్, అంగన్ వాడీ పథకాలు కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. కానీ గతంలో చంద్రబాబు ఏనాడు కూడా కేంద్రం ఒక్క రూపాయి ఇచ్చిందని చెప్పలేదు. లోకేశ్ అన్న మాటలను చంద్రబాబు ఏకీభవిస్తారా? లేక లోకేశ్ ను మందలిస్తారా.. చూడాలి. ఎప్పుడైనా సరే గ్రామ పంచాయతీలకు సంబంధించి పల్లెటూర్లకు కేంద్రం నుంచి 80 రూపాయాల నిధులు వస్తే రాష్ట్రం నుంచి కేవలం 10 నుంచి 20 రూపాయాలు వస్తాయన్నది నిజం.


కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విషయాన్ని బయట పెట్టదు. కేవలం మేం మాత్రమే అభివృద్ధి చేశామని గొప్పలకు పోతుంది. కాబట్టి లోకేశ్ చెప్పిన ఈ విషయాన్ని చంద్రబాబు ఎలాగో అంగీకరించే పరిస్థితిలో ఉండరు. పోనీ వైసీపీ నిజమని చెబుతుందా అంటే అధికారంలో ఉన్న పార్టీ అసలు అలా అంటే మొదటికే మోసం వస్తుంది.


ఎక్కువ డబ్బులు కేంద్రం పెట్టిన తర్వాత మీరేం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తారు. దీన్ని బీజేపీ ఆంధ్రలో క్యాష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే నాయకుడే కనిపించడు. అంతా విపులంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించగల సామర్థ్యం ఉన్న నాయకుడు ఆంధ్ర బీజేపీలో లేరని చెప్పొచ్చు లేకపోతే లోకేశ్ మాట్లాడిన మాటల్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పేవారే.



RRR Telugu Movie Review Rating

బలగం బ్యూటీ.. చిరంజీవి సినిమాలో నటించిందట తెలుసా?

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?

లోకేశ్‌ పాదయాత్రలో ఆ పని కూడా కానిచ్చేస్తున్నాడా?

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో భారత్‌కు భారీ లాభాలు?

ఫ్యామిలీ లేకపోవడమే మోడీకి ప్లస్సా?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>