EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kodali-nani2dc2d6d3-1596-4471-b785-8068a5af862a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kodali-nani2dc2d6d3-1596-4471-b785-8068a5af862a-415x250-IndiaHerald.jpgగుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడూ కొడాలి నాని గెలిచారు. ప్రస్తుతం వైసీపీ తరఫున కొడాలి నానే గెలిచారు. నాని గెలిచిన రెండు సార్లు టీడీపీ అధికారంలో లేదు. రెండు సార్లు ప్రతిపక్షంలోనే టీడీపీ ఉంది. గుడివాడలో విపక్షం అంటేనే తెలుగుదేశం పార్టీగా మారిపోయింది. గుడివాడ టీడీపీ లో గ్రూపులుగా విడిపోతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త వారిని గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ పెడుతూ ఉండటం వల్ల అది మైనస్ గా మారుతోంది. ప్రస్తుతం టీడీపీ నుంచి వెనిగళ్ల రాము అనే వ్యక్తి గుడివాడ నియోజకవర్గంలో క్రియాశీలకంKODALI NANI{#}Nani;Kodali Nani;ramu;Telugu Desam Party;Amarnath Cave Temple;YCP;Yelamanchili;Devineni Nehru;Pinnamaneni Babji;Minister;TDP;Congressగుడివాడ: ఒక్కటవుతున్న తమ్ముళ్లు.. నానికి కష్టమేనా?గుడివాడ: ఒక్కటవుతున్న తమ్ముళ్లు.. నానికి కష్టమేనా?KODALI NANI{#}Nani;Kodali Nani;ramu;Telugu Desam Party;Amarnath Cave Temple;YCP;Yelamanchili;Devineni Nehru;Pinnamaneni Babji;Minister;TDP;CongressWed, 12 Apr 2023 10:00:00 GMTగుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడూ కొడాలి నాని గెలిచారు. ప్రస్తుతం వైసీపీ తరఫున కొడాలి నానే గెలిచారు. నాని గెలిచిన  రెండు సార్లు టీడీపీ అధికారంలో లేదు. రెండు సార్లు ప్రతిపక్షంలోనే టీడీపీ ఉంది.  గుడివాడలో విపక్షం అంటేనే తెలుగుదేశం పార్టీగా మారిపోయింది.  గుడివాడ టీడీపీ లో గ్రూపులుగా విడిపోతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త వారిని గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ పెడుతూ ఉండటం వల్ల అది మైనస్ గా మారుతోంది.


ప్రస్తుతం టీడీపీ నుంచి వెనిగళ్ల రాము అనే వ్యక్తి గుడివాడ నియోజకవర్గంలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. అయితే అతడికి టికెట్ ఇస్తున్నారో లేదో తెలియని పరిస్థితి. వాస్తవానికి గుడివాడలో సింపథి రావికి ఉంది. ఏళ్ల తరబడి కష్టపడ్డాడు అనే మాట ప్రజల్లోకి వెళ్లిపోయింది. దేవినేని నెహ్రు చేతిలో ఓడిపోతూ వచ్చిన యలమంచిలి నాగేశ్వరరావు చివరకు గుడివాడలో గెలుపొందారు. సానుభూతి, ప్రజాభిమానం రెండు కలగలిసి ఆయన విజయం సాధించారు.


వైసీపీ నుంచి కొడాలి నాని, కాంగ్రెస్ నుంచి మంత్రిగా చేసిన  పిన్నమనేని కూడా ఇక్కడి నుంచి పోటీలో దిగేందుకు సిద్ధంగా ఉన్నారు.  టీడీపీ నుంచి రాము ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. పిన్నమనేనిది పక్కన  ఊరు కాబట్టి కలిసొస్తుందని ఆశిస్తున్నారు. పిన్నమనేని, రావి, వెనిగళ్ల రాము కూడా టీడీపీ నుంచి గుడివాడ టికెట్ ఆశిస్తున్నారు. కానీ ఈ ముగ్గురు మొన్నీ మధ్య ఒకే వేదికపై కలిశారు. ఐక్యంగా ఉన్నామని చాటేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాల్లో ఇదొకటి.


కొడాలి నాని కూడా గుడివాడలో స్ట్రాంగ్ గానే ఉన్నారు. కానీ మొన్నటి వరకు మంత్రి పదవి ఉన్న సమయంలో ఆయన చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు చాలా మందిని ఇరిటేషన్ కు గురి చేశాయని తెలుస్తోంది. టీడీపీ కూడా ఎలాగైనా నానిని ఓడించాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. మరి టీడీపీ గుడివాడలో వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందా లేదా అనేది చూడాలి.





RRR Telugu Movie Review Rating

మరోసారి గొప్ప మనసు చాటుకున్న లారెన్స్.. ఏకంగా 150 మంది చిన్నారులకు అండగా నిలిచిన హీరో..!!

చంద్రబాబు గుట్టు బయటపెట్టిన లోకేశ్‌?

రష్యాతో దోస్తీ: అమెరికాకు షాక్‌ ఇచ్చిన సౌదీ అరేబియా?

పాదయాత్రలో కొత్త రికార్డు సాధించిన లోకేశ్‌?

అమెరికా ప్లేస్‌ను చైనా ఆక్రమిస్తోందా?

లోకేశ్‌ పాదయాత్రలో ఆ పని కూడా కానిచ్చేస్తున్నాడా?

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో భారత్‌కు భారీ లాభాలు?

ఫ్యామిలీ లేకపోవడమే మోడీకి ప్లస్సా?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>