MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan748fb88d-ac69-4276-9859-483dcbc6240a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan748fb88d-ac69-4276-9859-483dcbc6240a-415x250-IndiaHerald.jpgప్రస్తుతం మన టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్ లో నడుస్తుందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల పుట్టినరోజున వాళ్ళ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు అలా రీ రిలీజ్ చేస్తున్న సినిమాలకు కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. దీంతో నిర్మాతలు కూడా సినిమాకి ప్రచారం చేస్తున్నారు. అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఒకటి రీ రిలీజ్ కాబోతోంది. అయితే ఈ రీ రిలీజ్ మూవీ కోసం ఏకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారట. వింటుంటేనే చాలా ఇంట్రెస్టPawan Kalyan{#}johnny;Nagababu;Johnny;Gudumba Shankar;Ashish Vidyarthi;Comedy;september;Ram Charan Teja;Event;Pawan Kalyan;kalyan;Tollywood;Cinemaపవన్ రీ రిలీజ్ మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!!పవన్ రీ రిలీజ్ మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!!Pawan Kalyan{#}johnny;Nagababu;Johnny;Gudumba Shankar;Ashish Vidyarthi;Comedy;september;Ram Charan Teja;Event;Pawan Kalyan;kalyan;Tollywood;CinemaTue, 11 Apr 2023 16:50:00 GMTప్రస్తుతం మన టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్ లో నడుస్తుందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల పుట్టినరోజున వాళ్ళ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు అలా రీ రిలీజ్ చేస్తున్న సినిమాలకు కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. దీంతో నిర్మాతలు కూడా సినిమాకి ప్రచారం చేస్తున్నారు. అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఒకటి రీ రిలీజ్ కాబోతోంది. అయితే ఈ రీ రిలీజ్ మూవీ కోసం ఏకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారట. వింటుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ..! ఇంతకీ రీ రిలీజ్ కాబోతున్న ఆ పవన్ కళ్యాణ్ మూవీ మరేదో కాదు 'గుడుంబా శంకర్'.. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో డిజాస్టర్ గా నిలిచిన గుడుంబా శంకర్ మూవీ ని ఇప్పుడు రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీకి సంబంధించి పలు సాంకేతిక మార్పులు, చేర్పులు చేసి రిలీజ్ చేస్తారట. అయితే ఇప్పుడు ఈ సినిమాకి భారీ స్థాయిలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించాలనే ఆలోచనలో మూవీ టీం ఉందని అంటున్నారు. 2004లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితాన్ని అందుకోలేకపోయింది. జానీ లాంటి డిజాస్టర్ తర్వాత వచ్చిన ఈ సినిమా పవన్ కి మరో ప్లాప్ ఇచ్చింది. అటు ఫాన్స్ కూడా ఈ మూవీ రిజల్ట్ తో డిసప్పాయింట్ అయ్యారు. ఈ సినిమా అంతా బాగానే ఉన్నప్పటికీ సినిమాకి క్లైమాక్స్ చాలా పెద్ద మైనస్ అయింది.

అయితే సినిమాలో ఉన్న కామెడీ మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, బ్రహ్మానందం, ఆలీ, ఆశిష్ విద్యార్థి, వేణుమాధవ్ వీళ్ళ మధ్య వచ్చే సీన్స్ అయితే ఎంతో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ కామెడీ ట్రాక్స్ ని నమ్ముకుని మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. మొన్నామధ్య మెగా బ్రదర్ నాగబాబు ఆరెంజ్ మూవీని రీ రిలీజ్ చేసి మంచి రిజల్ట్ అందుకున్నాడు. రామ్ చరణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా చెప్పుకునే ఆరెంజ్ మూవీ రీ రిలీజ్ కి భారీగా కలెక్షన్స్ వచ్చాయి. అలానే గుడుంబా శంకర్ కి కూడా అదే రేంజిలో కలెక్షన్స్ వస్తాయని అనుకుంటున్నారట. అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న గుడుంబా శంకర్ మూవీ ని రీ రిలీజ్ చేయబోతున్నారట...!!



RRR Telugu Movie Review Rating

విరూపాక్ష: సాయి తేజ్ కి ఈసారి పెద్ద హిట్టు కన్ఫామ్?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?

చంద్రబాబు, పవన్ పొత్తుకు అదే అడ్డంకి?

కొత్త ఆయుధాలు సమకూర్చుకున్న రష్యా?

తీవ్ర గందరగోళంలో పవన్‌.. బాబుకు పిచ్చ క్లారిటీ?

ఈవీఎంలు వద్దు.. బ్యాలెటే ముద్దంటున్న పొరుగు దేశం?

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>