Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ravushashtri9cea08b1-5472-41bc-902f-095336afafd8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ravushashtri9cea08b1-5472-41bc-902f-095336afafd8-415x250-IndiaHerald.jpgఐపీల్ 2023 సీజన్ లో ఇప్పటికే వరస విజయాలతో దూకుడు మీద ఉన్న గుజరాత్ టైటాన్స్ నడ్డి విరిచాడు కోల్కతా బ్యాట్స్ మెన్ రింకు సింగ్. గెలిచి తీరుతాము అనే నమ్మకం తో ఉన్న గుజరాత్ కి చివరి ఓవర్ లో చుక్కలు చూపించాడు. చివరి ఏడూ బంతులకే ఆరు సిక్స్ లు, ఒక ఫోర్ బాది తమ జట్టును గెలిపించుకున్నాడు రింకు సింగ్. సిక్సర్ల హీరో అంటూ అందరు ఇప్పుడు అతడిని ముచ్చటగా పిలుచుకుంటున్నారు. అతడి ఆటను చూస్తున్న వారికి కూడా సూపర్ హుషారును తెప్పించాడు. ముచ్చటగా బ్యాట్ కు పని చెప్తూ సిక్స్ లు బాడుతుంటే కన్నార్పకుండా అందరు అలాగే చRavushashtri{#}Dookudu;Gujarat - Gandhinagar;Cricket;Interview;Father;media;Hero;Indiaకనీసం నా కొడుక్కి బ్యాట్ కూడా కొనివ్వలేదు : రింకు సింగ్ తండ్రికనీసం నా కొడుక్కి బ్యాట్ కూడా కొనివ్వలేదు : రింకు సింగ్ తండ్రిRavushashtri{#}Dookudu;Gujarat - Gandhinagar;Cricket;Interview;Father;media;Hero;IndiaTue, 11 Apr 2023 15:30:00 GMTఐపీల్ 2023 సీజన్ లో ఇప్పటికే వరస విజయాలతో దూకుడు మీద ఉన్న గుజరాత్ టైటాన్స్ నడ్డి విరిచాడు కోల్కతా బ్యాట్స్ మెన్ రింకు సింగ్. గెలిచి తీరుతాము అనే నమ్మకం తో ఉన్న గుజరాత్ కి చివరి ఓవర్ లో చుక్కలు చూపించాడు. చివరి ఏడూ బంతులకే ఆరు సిక్స్ లు, ఒక ఫోర్ బాది తమ జట్టును గెలిపించుకున్నాడు రింకు సింగ్. సిక్సర్ల హీరో అంటూ అందరు ఇప్పుడు అతడిని ముచ్చటగా పిలుచుకుంటున్నారు. అతడి ఆటను చూస్తున్న వారికి కూడా సూపర్ హుషారును తెప్పించాడు.


 ముచ్చటగా బ్యాట్ కు పని చెప్తూ సిక్స్ లు బాడుతుంటే కన్నార్పకుండా అందరు అలాగే చూస్తూ ఉండిపోయారు. ఇక రింకు సింగ్ తండ్రి తన కొడుకు ఆడిన విధానం గురించి ఒక మీడియా సంస్థ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసాడు. అంతే కాదు రింకు చిన్నతనం నుంచి తాను ఏమి చేయలేదని, క్రికెట్ తిండి పెట్టాడు చదువు మీద ద్రుష్టి పెట్టు అని చెప్పేవాడినని, కానీ రింకు నా మాట వినకుండా ఆట మీద మాత్రమే ద్రుష్టి పెట్టాడు అని, చివరికి అతడి కోసం నేను ఒక బ్యాట్ ని కూడా కొనివ్వలేదు అని, అన్ని తనకు తానుగా కష్టపడి సమకూర్చుకున్నాడని తన ఆనందాన్ని మీడియా తో పంచుకున్నాడు.


ఇక చాల మంది నా కొడుకు ఆట బాగుంది అని చెప్తే అప్పుడు నేను ఆట ఆడాలనుకుంటే సరిగ్గా ఆడు అని మాత్రమే చెప్పానని ఎమోషనల్ అయ్యాడు. ఇక నా కొడుకు భవిష్యత్తు గురించి మేము చాల కలలు కంటున్నాం అని, కోల్కతా కోసం రింకు చక్కగా ఆడిన తీరు సంతోషాన్ని ఇచ్చిందని, ఎదో ఒక రోజు టీమ్ ఇండియా కు ఆడితే చూడాలని ఉందని రింకు తండ్రి ఖన్ చాంద్ చెప్పుకోచ్చారు.



RRR Telugu Movie Review Rating

విరూపాక్ష: సాయి తేజ్ కి ఈసారి పెద్ద హిట్టు కన్ఫామ్?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?

చంద్రబాబు, పవన్ పొత్తుకు అదే అడ్డంకి?

కొత్త ఆయుధాలు సమకూర్చుకున్న రష్యా?

తీవ్ర గందరగోళంలో పవన్‌.. బాబుకు పిచ్చ క్లారిటీ?

ఈవీఎంలు వద్దు.. బ్యాలెటే ముద్దంటున్న పొరుగు దేశం?

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>