MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kabzaf907c954-665a-4aec-bf75-949204a020bf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kabzaf907c954-665a-4aec-bf75-949204a020bf-415x250-IndiaHerald.jpgకన్నడ అగ్ర హీరో ఉపేంద్ర ఇటీవల నటించిన తాజా చిత్రం 'కబ్జా'. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాతో ఉపేంద్ర సిల్వర్ స్క్రీన్ పై కనిపించాడు. పాన్ ఇండియా లెవెల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఉపేంద్ర తో పాటు కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ వంటి కన్నడ స్టార్స్ ఈ సినిమాలో కీలకపాత్రను పోషించారు. ఇక ఉపేంద్ర సరసన శ్రియ శరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. భారీ ప్రొడక్షన్ వాల్యూస్ తో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకి ఆర్ చంద్రు దర్శకత్వం వహించారు. ఇక టీజర్, ట్రైలర్స్ తో ఆడియన్స్Kabza{#}r chandru;shivaraj kumar;upendra;Fort;KGF;Amazon;Kannada;Chitram;Hero;India;Heroine;Bhumika Chawla;Audience;Cinemaఓటీటీలో ఉపేంద్ర 'కబ్జా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?ఓటీటీలో ఉపేంద్ర 'కబ్జా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?Kabza{#}r chandru;shivaraj kumar;upendra;Fort;KGF;Amazon;Kannada;Chitram;Hero;India;Heroine;Bhumika Chawla;Audience;CinemaTue, 11 Apr 2023 20:50:04 GMTకన్నడ అగ్ర హీరో ఉపేంద్ర ఇటీవల నటించిన తాజా చిత్రం 'కబ్జా'. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాతో ఉపేంద్ర సిల్వర్ స్క్రీన్ పై కనిపించాడు. పాన్ ఇండియా లెవెల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఉపేంద్ర  తో పాటు కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ వంటి కన్నడ స్టార్స్ ఈ సినిమాలో కీలకపాత్రను పోషించారు. ఇక ఉపేంద్ర సరసన శ్రియ శరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. భారీ ప్రొడక్షన్ వాల్యూస్ తో పీరియాడికల్  యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకి ఆర్ చంద్రు దర్శకత్వం వహించారు. ఇక టీజర్, ట్రైలర్స్ తో ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ..

మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా కన్నడ తో పాటు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల అయింది. అయితే భారీ అంచనాలను విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలను మూటగట్టుకుంది. సినిమాకి కేజిఎఫ్ రేంజ్ ఎలివేషన్స్ ఇవ్వడం చాలా పెద్ద మైనస్ గా మారింది. దీంతో ఆడియన్స్ ని ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అటు కలెక్షన్స్ పరంగా కూడా బాగా నిరాశపరిచింది. కానీ లాంగ్ గ్యాప్ తర్వాత ఉపేంద్ర సిల్వర్ స్క్రీన్ పై కనిపించడం, సినిమాలో కొన్ని ఎలివేషన్ సీన్స్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. అయితే కేజిఎఫ్ సినిమాతో పోల్చుకోకుండా ఈ మూవీని చూస్తే ఖచ్చితంగా ఆకట్టుకునే అవకాశం ఉందని రివ్యూస్ కూడా వచ్చాయి.

ఇలాంటి తరుణంలో చాలామంది ఈ మూవీని థియేటర్లో మిస్సయిన ఆడియన్స్ ఓటిటి రిలీజ్ ఎప్పుడు అని ఆసక్తిగా ఎదురు చూడ సాగారు. ఇక తాజాగా ఆడియన్స్ నిరీక్షణకు తెరపడింది. కబ్జా మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో కబ్జా సినిమాను ఏప్రిల్ 14న స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారిక ప్రకటనను విడుదల చేశారు. సుమారు 110 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా కేవలం విడుదలైన 25 రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుండడం గమనార్హంగా మారింది. ఇక ఈ సినిమాలో సీనియర్ నటులు పోసాని కృష్ణమురళి, కోట శ్రీనివాసరావు, కబీర్ దుహాన్ సింగ్ తదితరులు ముఖ్య భూమిక పోషించారు. అలాగే హీరోయిన్ తాన్యా హోప్ స్పెషల్ సాంగ్ లో కనిపించి ఆకట్టుకుంది. ఇక థియేటర్లో మెప్పించలేకపోయిన ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి...!!



RRR Telugu Movie Review Rating

పీపుల్స్ మీడియాతో బన్నీ భారీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే..?

జంక్‌ఫుడ్‌ కల్చర్‌: అయ్యో.. ఏడేళ్లకే పెద్ద మనిషా?

చంద్రబాబు, పవన్ పొత్తుకు అదే అడ్డంకి?

కొత్త ఆయుధాలు సమకూర్చుకున్న రష్యా?

తీవ్ర గందరగోళంలో పవన్‌.. బాబుకు పిచ్చ క్లారిటీ?

ఈవీఎంలు వద్దు.. బ్యాలెటే ముద్దంటున్న పొరుగు దేశం?

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>