MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ayesha-takia26328938-9087-4a7e-9277-0b3b7a1f52be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ayesha-takia26328938-9087-4a7e-9277-0b3b7a1f52be-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కింగ్ నాగార్జున పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచిన సినిమా సూపర్. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. టాలీవుడ్ ని చాలా కాలం పాటు టాప్ హీరోయిన్ గా ఏలిన అనుష్క ఈ సినిమాతోనే హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టింది.ఇక ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అయేషా టకియా నటించింది.ఈరోజు ఆమె పుట్టినరోజు. ఇక అయేషా టకియా అప్పటికీ ఇప్పటికీ పూర్తిస్థాయిలో మారిపోయారు. ఈమె తెలుగులో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా బాలీవుడ్ లో మాత్AYESHA TAKIA{#}BEAUTY;anoushka;Akkineni Nagarjuna;Salman Khan;prema;Islam;bollywood;Tollywood;Cinema;marriage;Love;Industry;Remake;Hero;Heroine;News;Success;March;Lover;media;Partyఅయేషా టకియా బర్త్ డే స్పెషల్!అయేషా టకియా బర్త్ డే స్పెషల్!AYESHA TAKIA{#}BEAUTY;anoushka;Akkineni Nagarjuna;Salman Khan;prema;Islam;bollywood;Tollywood;Cinema;marriage;Love;Industry;Remake;Hero;Heroine;News;Success;March;Lover;media;PartyMon, 10 Apr 2023 07:31:00 GMTటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కింగ్ నాగార్జున పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచిన సినిమా సూపర్. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. టాలీవుడ్ ని చాలా కాలం పాటు టాప్ హీరోయిన్ గా ఏలిన అనుష్క ఈ సినిమాతోనే  హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టింది.ఇక ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అయేషా టకియా నటించింది.ఈరోజు ఆమె పుట్టినరోజు. ఇక అయేషా టకియా అప్పటికీ ఇప్పటికీ పూర్తిస్థాయిలో మారిపోయారు. ఈమె తెలుగులో  ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా బాలీవుడ్ లో మాత్రం సక్సెస్ ఫుల్ హీరోయిన్ అయ్యారు. అయేషా సిన్సియర్ లవర్ కూడా. ఆమె తన ప్రేమ కోసం కెరీర్ నే త్యాగం చేసింది. ఈ విషయం గురించి అభిమానులకు ఎక్కువగా తెలియదు. తన నటనతో ఈ హీరోయిన్ చాలా అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. పలు యాడ్స్ ద్వారా ఒక వెలుగు వెలిగిన అయేషా తర్వాత రోజుల్లో బాలీవుడ్ లో సరైన కథలను ఎంపిక చేసుకోవడంలో ఫెయిల్ కావడంతో ఆమెకు ఆఫర్లు తగ్గాయి.


2005 వ సంవత్సరంలో  అయేషా ప్రముఖ పార్టీ నేత, బిజినెస్ మేన్ అయిన ఫర్హాన్ అజ్మీతో ప్రేమలో పడ్డారు. 2009 వ సంవత్సరం మార్చి నెలలో వీళ్లిద్దరి పెళ్లి జరిగింది. వివాహం తర్వాత ఇస్లాం మతంలోకి మారిన అయేషా తన పేరు చివరన అజ్మీ చేర్చుకుని అప్పట్లో వార్తల్లో నిలిచారు. పెళ్లి తర్వాత ఫ్యామిలీకి ఎక్కువగా ప్రాధాన్యత  ఇచ్చి కెరీర్ విషయంలో తప్పటడుగులు వేశారు.ఈమె పెళ్లికి ముందు పలువురు సెలబ్రిటీలతో కూడా ప్రేమాయణం నడిపినట్టు ఈ బ్యూటీ గురించి వార్తలు వినిపించినా ఆ వార్తల గురించి అయేషా మాత్రం ఎప్పుడూ స్పందించలేదు. అయేషా 2013 వ సంవత్సరంలో ఓ బాబుకు జన్మనివ్వగా ఆ బాబుకు మైఖేల్ అని పేరు పెట్టారు. అయేషా సినిమాలకు దూరంగా ఉన్నా ఫ్యాన్స్ కు మాత్రం సోషల్ మీడియా ద్వారా దగ్గరగానే ఉన్నారు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ వాంటెడ్ సినిమా ద్వారా చాలా మంచి గుర్తింపు తెచ్చుకుంది అయేషా. ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ ఇండస్ట్రీ హిట్ పోకిరికి రీమేక్ గా తెరకెక్కి పెద్ద హిట్టుగా నిలిచింది.



RRR Telugu Movie Review Rating

ఆ తేదీన "సింహాద్రి" మూవీ రీ రిలీస్..!

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?

ఆ విషయంలో ఇండియాకు అండగా అమెరికా?

మోదీ మాటల్లో అంతరార్ధం.. హైదరాబాద్‌ పేరు మార్చేస్తారా?

పాకిస్తాన్‌లో మళ్లీ సైనిక పాలన ఖాయమేనా?

బంగ్లాదేశ్‌లో ఆరని మంటలు.. చైనా కుట్రేనా?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>