Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl1c94b00d-1739-4439-baeb-aa978e795758-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl1c94b00d-1739-4439-baeb-aa978e795758-415x250-IndiaHerald.jpgఐపీఎల్ క్రికెట్లో ఫ్యూచర్ స్టార్స్ ను అందిస్తుంది అన్నది ఇప్పటివరకు ఎన్నోసార్లు నిరూపితమైంది. అంతే కాదు ఏమీ లేకుండా ఐపిఎల్ లోకి వచ్చిన వారికి అన్ని ఇచ్చేస్తుంది అన్నది కూడా ఎంతో మంది ఆటగాళ్ల విషయంలో నిజమయింది. ఇక ఇప్పుడు మరో ఆటగాడిని కూడా ఐపీఎల్ స్టార్ ను చేసేసింది అని చెప్పాలి. ఇటీవల గుజరాత్, కోల్కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కొత్త స్టార్ తెరమీదికి వచ్చేసాడు. అప్పటికే రషీద్ ఖాన్ హ్యాట్రిక్ తీసి కోల్కతా ఓటమిని శాసించాడు అని చెప్పాలి. ఇక చివరి ఓవర్లో 29 పరుగులు చేయాలి. స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ Ipl{#}Yash;Cricket;Umesh Yadav;Gujarat - Gandhinagar;Rajasthan;Driver;Yevaru;Varsham;Yuva;Father;Tigerఒకప్పుడు స్వీపర్, ఆటో డ్రైవర్.. ఇప్పుడు ఐపీఎల్ హీరో?ఒకప్పుడు స్వీపర్, ఆటో డ్రైవర్.. ఇప్పుడు ఐపీఎల్ హీరో?Ipl{#}Yash;Cricket;Umesh Yadav;Gujarat - Gandhinagar;Rajasthan;Driver;Yevaru;Varsham;Yuva;Father;TigerMon, 10 Apr 2023 07:50:00 GMTఐపీఎల్ క్రికెట్లో ఫ్యూచర్ స్టార్స్ ను అందిస్తుంది అన్నది ఇప్పటివరకు ఎన్నోసార్లు నిరూపితమైంది. అంతే కాదు ఏమీ లేకుండా ఐపిఎల్ లోకి వచ్చిన వారికి అన్ని ఇచ్చేస్తుంది అన్నది కూడా ఎంతో మంది ఆటగాళ్ల విషయంలో నిజమయింది. ఇక ఇప్పుడు మరో ఆటగాడిని కూడా ఐపీఎల్ స్టార్ ను చేసేసింది అని చెప్పాలి. ఇటీవల గుజరాత్, కోల్కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కొత్త స్టార్ తెరమీదికి వచ్చేసాడు. అప్పటికే రషీద్ ఖాన్ హ్యాట్రిక్ తీసి కోల్కతా ఓటమిని  శాసించాడు అని చెప్పాలి. ఇక చివరి ఓవర్లో 29 పరుగులు చేయాలి. స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ఉంటేనే ఇంత స్కోరుని ఛేదించడం చాలా కష్టం.


 అలాంటిది అప్పటివరకు ఎక్కడ క్రికెట్లో పెద్దగా అనుభవం లేని యువ క్రికెటర్ ఉంటే ఒత్తిడికి చిత్తవ్వాల్సిందే. కానీ ఇలాంటి సమయంలో రింకు సింగ్ సంచలన ప్రదర్శన చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. యష్ దయాల్ వేసిన  ఆఖరి ఓవర్లో సిక్సర్ల వర్షం కురిపించాడు. తొలి బంతికి ఉమేష్ యాదవ్ సింగిల్ తీసుకొని రింకు సింగ్ కు స్ట్రైక్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత ఐదు బంతులను కూడా రింకు సింగ్ సిక్సర్లుగా మలిచాడు. ఓడిపోయే మ్యాచ్ లో కోల్కతా జట్టుకు విజయం అందించి.. హీరోగా మారిపోయాడు అని చెప్పాలి. కాగా ఈ రింకు సింగ్ ఎవరు అని అందరూ అతని గురించి డీటెయిల్స్ తెలుసుకోవడం మొదలుపెట్టారు.


 24 ఏళ్ల రింకు సింగ్ యూపీలోని పేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి  గ్యాస్ సిలిండర్లను డోర్ డెలివరీ చేస్తూ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించేవాడు. ఇక తల్లి ఇంటి బాధ్యతలను చూసుకునేది. రింకుకు సోదరుడు సోదరి కూడా ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల 9వ తరగతిలోనే చదువుకు పులి స్టాప్ పెట్టేసాడు. తండ్రికి  ఆసరాగా ఉండేందుకు స్వీపర్గా పనిచేసాడు. కొన్నాళ్లపాటు ఆటో డ్రైవర్ గా కూడా పనిచేశాడు. ఎన్ని కష్టాలు ఉన్న క్రికెట్ ను మాత్రం వదలలేదు. ఇక అతని కష్టానికి 2018లో ఫలితం దక్కింది. అతన్ని 80 లక్షలకు కోల్కతా కొనుగోలు చేసింది. 2018 నుంచి 2021 మధ్యలో కోల్కతాకు పెద్దగా రింకు పరుగులు చేయలేదు. అయినప్పటికీ అతని మీద నమ్మకం ఉంచింది. 55 లక్షలకు అతన్ని మరోసారి కొనుగోలు చేసింది. గత ఏడాది రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్లో 23 బంతుల్లో 42 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇక ఇప్పుడు గుజరాత్ తో జరిగిన మ్యాచ్లో మరోసారి ఓడిపోయే గెలిపించి హీరోగా మారిపోయాడు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

ఆ తేదీన "సింహాద్రి" మూవీ రీ రిలీస్..!

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?

ఆ విషయంలో ఇండియాకు అండగా అమెరికా?

మోదీ మాటల్లో అంతరార్ధం.. హైదరాబాద్‌ పేరు మార్చేస్తారా?

పాకిస్తాన్‌లో మళ్లీ సైనిక పాలన ఖాయమేనా?

బంగ్లాదేశ్‌లో ఆరని మంటలు.. చైనా కుట్రేనా?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>