EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/indiad899829b-54fd-4efe-b4cd-74000cffde6d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/indiad899829b-54fd-4efe-b4cd-74000cffde6d-415x250-IndiaHerald.jpgనాయకులను మూర్ఖంగా అభిమానించినంత వరకు వాళ్లు అడ్డుగోలుగానే వెళ్తారు. నాయకుడిని అభిమానించడంలో తప్పులేదు, కాని నాయకుడు తప్పు దోవలో వెళ్తుంటే దాన్ని చక్కదిద్దే బాధ్యత కార్యకర్తలకు, అభిమానులకు ఉంటుంది. లేకపోతే నియంతృత్వ ధోరణి అవుతుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే సమయంలో విపక్షాలు చేస్తున్నది అదే. విపక్షాలన్నీ పలు అంశాలపై చర్చించాలని గొడవ గొడవ చేస్తున్నాయి పార్లమెంటులో. అవకాశం ఇచ్చేస్తే ఒకరోజు రెండు రోజుల్లో మీ వాదన మీరు వినిపిస్తే, వాళ్ళ వాదన అనేది వాళ్ళు విINDIA{#}central government;Manam;Governmentఅటు బీజేపీ.. ఇటు విపక్షాలు.. ప్రజాస్వామ్యం ఖూనీ?అటు బీజేపీ.. ఇటు విపక్షాలు.. ప్రజాస్వామ్యం ఖూనీ?INDIA{#}central government;Manam;GovernmentMon, 10 Apr 2023 13:00:00 GMTనాయకులను మూర్ఖంగా అభిమానించినంత వరకు వాళ్లు అడ్డుగోలుగానే వెళ్తారు. నాయకుడిని అభిమానించడంలో తప్పులేదు,  కాని నాయకుడు తప్పు దోవలో వెళ్తుంటే దాన్ని చక్కదిద్దే బాధ్యత కార్యకర్తలకు, అభిమానులకు ఉంటుంది. లేకపోతే నియంతృత్వ ధోరణి అవుతుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే సమయంలో విపక్షాలు చేస్తున్నది అదే.


విపక్షాలన్నీ పలు అంశాలపై చర్చించాలని గొడవ గొడవ చేస్తున్నాయి పార్లమెంటులో. అవకాశం ఇచ్చేస్తే ఒకరోజు రెండు రోజుల్లో మీ వాదన మీరు వినిపిస్తే, వాళ్ళ వాదన అనేది వాళ్ళు వినిపిస్తే పబ్లిక్ చూసుకుంటారు. ‌ కానీ వాదనకు అవకాశాలు ఇవ్వకుండా ఉభయ సభల్లోని తమ తమ హెడ్స్ ద్వారా ఆపించేస్తున్నారు. తద్వారా సభా సమావేశాలు అన్నీ అయిపోయాయి.


ప్రభుత్వం అలాంటి కుట్రలు చేస్తున్నప్పుడు విపక్షం ఏం చేయాలి. సరే అని చెప్పేసి ఆందోళనలు బయట చేసుకుంటూ, మిగతా టైం లో తీర్మానాల్లోని చర్చల్లో పాల్గొంటూ, ఆ చర్చల సందర్భంగా ఇట్లాంటి అంశాలను రైజ్ చేయవచ్చు. మీరు ఇలాంటి తప్పు చేశారు అనేటువంటి దాన్ని రైజ్ చేయొచ్చు. తద్వారా జనాల్లోకి వెళ్తుంది. బాధ్యతాయుతమైనది అవుతుంది.


బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ పై ఏ చర్చా లేకుండా 40 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఆమోదం పొందుతుంది‌. ఏ చర్చా లేకుండా బిల్లులు ఇష్టారీతిన ఆమోదం పొందుతున్నాయి. వీళ్ళందర్నీ ఎన్నుకున్నది ఎందుకు ప్రజలు, చర్చించి ప్రజా అవసరాల రీత్యా దానిలో ఉండాలని కదా. ఒక బిల్లులో ప్రభుత్వం లోపాలు చేస్తుంటే దానిలోని పాయింట్స్ ని విపక్షాలు  ప్రస్తావించాలి. దానికి మూర్ఖంగా పోకుండా తమ వైఖరి చెప్పి అందులో తప్పు ఒప్పులను సరి చేసుకోవాల్సింది ఉంది‌‌. ప్రజా ప్రతినిధులనే వాళ్లను ఎన్నుకునేది అందుకే. కానీ ప్రజాస్వామ్యాన్ని చంపేసుకుంటున్నారు వీళ్ళు అందరూ కలిసి. నాయకుల ఆలోచన మారడం లేదు. వాళ్ళను మార్చవలసిన మనం కూడా మా వాళ్ళు మాట్లాడేది రైట్ అనే ఫీలింగ్ లో ఉండటమే ఇక్కడ మన తప్పు అవుతుంది.



RRR Telugu Movie Review Rating

వావ్: మహేష్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన నమ్రత..!!

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?

ఆ విషయంలో ఇండియాకు అండగా అమెరికా?

మోదీ మాటల్లో అంతరార్ధం.. హైదరాబాద్‌ పేరు మార్చేస్తారా?

పాకిస్తాన్‌లో మళ్లీ సైనిక పాలన ఖాయమేనా?

బంగ్లాదేశ్‌లో ఆరని మంటలు.. చైనా కుట్రేనా?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>