MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalyan-ramfa5db075-759f-4849-9e54-34bc0ec1f6a4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalyan-ramfa5db075-759f-4849-9e54-34bc0ec1f6a4-415x250-IndiaHerald.jpgమన తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నారు. వాటిలో చాలామంది ఇప్పటికే కొన్ని సూపర్ హిట్ సినిమాలతో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మరి కొంతమంది ఆరంభంలో పలు హిట్ సినిమాలు తీసిన ఆ తర్వాత మాత్రం సైలెంట్ అయిపోయారు. లవ్ స్టోరీస్, యాక్షన్స్ మూవీస్ తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్న చాలా మంది డైరెక్టర్స్ కొంతకాలం నుంచి ఎలాంటి సినిమాలు చేయకుండా ఖాళీగా ఉంటున్నారు. అలాంటి వారిలో యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ విరించి వర్మ ఒకరు. రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'ఉయ్యాల జంపాల' సినిమాతో దర్శకుడుగKalyan Ram{#}Ram Gopal Varma;kalyan;kalyan ram;Darsakudu;Raj Tarun;Uyyala Jampala;Majnu;Telugu;ram pothineni;Blockbuster hit;Hero;Success;Director;Love;Cinemaనందమూరి హీరోతో నాని డైరెక్టర్.. ఏకంగా ఏడేళ్ల గ్యాప్ తర్వాత సినిమా..?నందమూరి హీరోతో నాని డైరెక్టర్.. ఏకంగా ఏడేళ్ల గ్యాప్ తర్వాత సినిమా..?Kalyan Ram{#}Ram Gopal Varma;kalyan;kalyan ram;Darsakudu;Raj Tarun;Uyyala Jampala;Majnu;Telugu;ram pothineni;Blockbuster hit;Hero;Success;Director;Love;CinemaMon, 10 Apr 2023 18:25:00 GMTమన తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నారు. వాటిలో చాలామంది ఇప్పటికే కొన్ని సూపర్ హిట్ సినిమాలతో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మరి కొంతమంది ఆరంభంలో పలు హిట్ సినిమాలు తీసిన ఆ తర్వాత మాత్రం సైలెంట్ అయిపోయారు. లవ్ స్టోరీస్, యాక్షన్స్ మూవీస్ తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్న చాలా మంది డైరెక్టర్స్ కొంతకాలం నుంచి ఎలాంటి సినిమాలు చేయకుండా ఖాళీగా ఉంటున్నారు. అలాంటి వారిలో యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ విరించి వర్మ ఒకరు. రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'ఉయ్యాల జంపాల' సినిమాతో దర్శకుడుగా పరిచయమైన ఇతను.. మొదటి సినిమాతోనే డీసెంట్ హిట్ అందుకున్నాడు. 

మొత్తం నూతన నటీనటులతో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను అందుకుంది. ఈ సినిమా దర్శకుడిగా విరించి వర్మకి మంచి గుర్తింపు తెచ్చింది. ఇక ఉయ్యాల జంపాల తర్వాత ఏకంగా నాచురల్ స్టార్ నానితో మజ్ను అనే సినిమాను డైరెక్ట్ చేశాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక మజ్ను తర్వాత సైలెంట్ అయిపోయాడు. మజ్ను మూవీ రిలీజ్ అయి సుమారు ఏడేళ్లు అవుతున్న ఇప్పటివరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ప్రకటించలేదు. అయితే తాజాగా అతను ఓ సరికొత్త ప్రాజెక్టును డైరెక్ట్ చేసేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. అది కూడా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో.. 

ఇటీవల దర్శకుడు విరించి వర్మ 70 ఏళ్ల కాలం నాటి పీరియాడిక్ స్టోరీ లైన్తో కళ్యాణ్ రామ్ మెప్పించినట్లు తెలుస్తోంది. ఇక ఈ స్టోరీ లైన్ కళ్యాణ్రామ్ కి బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. దీంతో త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ మూవీ సెక్స్ పైకి వెళ్లబోతుందని అంటున్నారు. ప్రస్తుతం దర్శకుడు విరించి వర్మ ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో పడ్డాడట. ఇక త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. కాగా బింబిసార సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ నూతన ఖాతాలో వేసుకున్న కళ్యాణ్ రామ్ ఆ తర్వాత అమిగోస్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అవలేకపోయింది. ఇక ప్రస్తుతం డెవిల్ అనే సినిమా చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన అనంతరం విరించి వర్మతో మూవీ ఉండును నట్టు తెలుస్తోంది...!!



RRR Telugu Movie Review Rating

"మీటర్" మూవీ డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?

కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

జోక్యం వద్దు.. ఇస్లామిక్‌ దేశాలకు భారత్‌ వార్నింగ్‌?

జగన్, కేసీఆర్, స్టాలిన్ కోసం రాహుల్‌ కొత్త వ్యూహం?

ఆ విషయంలో ఇండియాకు అండగా అమెరికా?

మోదీ మాటల్లో అంతరార్ధం.. హైదరాబాద్‌ పేరు మార్చేస్తారా?

పాకిస్తాన్‌లో మళ్లీ సైనిక పాలన ఖాయమేనా?

బంగ్లాదేశ్‌లో ఆరని మంటలు.. చైనా కుట్రేనా?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>