HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpgకీళ్ల వాతం వల్ల శరీరంలో ఒకే చోట కాకుండా వివిధ భాగాల్లో కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కీళ్ల భాగంలో నొప్పులు, వాపులు అలాగే ఆ భాగంలో ఎర్రగా అవ్వడం, నడుస్తున్నప్పుడు, కూర్చునప్పుడు నొప్పులు రావడం ఇంకా కీళ్లు పట్టినట్టు ఉండడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇంకా ఈ సమస్య చిన్న నొప్పిగా మొదలయ్యి నడవడానికి కూడా వీలుకానంత పెద్ద సమస్యలాగా తయారు అవుతుంది. ఈ కీళ్ల వాతం అనేది ముఖ్యంగా శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం వల్ల తలెత్తుతుంది. యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం వల్ల మనం కీళ్లవాతంతో పాటు చాలా ఇతhealth{#}Turmeric;cumin;Ayurveda;Pepper Powder;Apple;Manam;vegetable marketకీళ్ళ నొప్పులు, వాపులు ఈజీగా తగ్గే టిప్?కీళ్ళ నొప్పులు, వాపులు ఈజీగా తగ్గే టిప్?health{#}Turmeric;cumin;Ayurveda;Pepper Powder;Apple;Manam;vegetable marketSun, 09 Apr 2023 17:16:00 GMTకీళ్ల వాతం వల్ల శరీరంలో ఒకే చోట కాకుండా వివిధ భాగాల్లో కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి.  కీళ్ల భాగంలో నొప్పులు, వాపులు అలాగే ఆ భాగంలో ఎర్రగా అవ్వడం, నడుస్తున్నప్పుడు, కూర్చునప్పుడు నొప్పులు రావడం ఇంకా కీళ్లు పట్టినట్టు ఉండడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇంకా ఈ సమస్య చిన్న నొప్పిగా మొదలయ్యి నడవడానికి కూడా వీలుకానంత పెద్ద సమస్యలాగా తయారు అవుతుంది. ఈ కీళ్ల వాతం అనేది ముఖ్యంగా శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం వల్ల తలెత్తుతుంది. యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం వల్ల మనం కీళ్లవాతంతో పాటు చాలా ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ అనేది బాగా పెరిగిపోతుంది.దీంతో ఈ యూరిక్ యాసిడ్ అనేది కీళ్ల మధ్య పేరుకుపోతుంది.ఈ కీళ్లవాతం వంశపారపర్యంగా వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ సమస్య తలెత్తగానే చాలా మంది చాలా రకాల మందులను వాడుతూ ఉంటారు. అయితే కొంతమందిలో ఈ మందులు పని చేస్తాయి. మరికొంతమందిలో ఈ మందులు చాలా కాలం దాకా అస్సలు పని చేయవు. ఎక్కువ రోజుల పాటు మందులు వాడడం వల్ల మనం చాలా రకాల ఇతర దుష్ప్రభావాల బారిన పడాల్సి వస్తుంది. అయితే ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా చక్కటి ఆయుర్వేద టిప్స్ వాడి మనం ఈ సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు.


కీళ్ల వాతాన్ని తగ్గించడంలో శొంఠి బాగా ఉపయోగపడుతుంది. ముందుగా ఒక గిన్నెలో 6 టీ స్పూన్ల శొంఠి పొడిని తీసుకోని ఆ తరువాత ఇందులో 6 టీ స్పూన్ల జీలకర్ర పొడి ఇంకా 3 టీ స్పూన్ల మిరియాల పొడి వేసి కలపాలి. ఇక ఇలా తయారు చేసుకున్న పొడిని అర టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వేసి కలిపి తాగాలి.ఇలా రోజుకు మూడు పూటలా ఆహారం తీసుకోవడానికి అర గంట ముందు ఈ నీరు తాగాలి. ఈ విధంగా తాగడం వల్ల కీళ్ల నొప్పులు ఇంకా వాపులు తగ్గుతాయి. అలాగే ఆపిల్ సైడ్ వెనిగర్ ను తీసుకోవడం వల్ల కూడా మనం కీళ్ల వాతాన్ని ఈజీగా తగ్గించుకోవచ్చు. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ ఆపిల్ సైడ్ వెనిగర్ ఇంకా కొద్దిగా తేనె వేసి కలిపి తాగాలి. ఇలా రోజూ ఉదయం పూట పరగడుపున తాగడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది. కీళ్ల వాతం, కీళ్ల నొప్పులతో బాధపడే వారు ఈ టిప్ ని వాడడం వల్ల చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. అదే విధంగా పసుపును రోజూ వాడటం వల్ల కూడా కీళ్ల వాతం తగ్గుతుంది. మనకు మార్కెట్ లో 500 ఎమ్ జి ఇంకా 1000 ఎమ్ జి పసుపు క్యాప్సుల్స్ లభిస్తాయి. ఇక వీటినైనా మనం వాడవచ్చు లేదా రాత్రి పడుకోవడానికి అరగంట ముందు వేడి పాలల్లో పసుపు కలిపి తీసుకున్నా కూడా మీకు చాలా మంచి ఫలితం ఉంటుంది.



RRR Telugu Movie Review Rating

మీటర్: మైత్రికి చెత్త రికార్డ్.. పరువు పొయిందిగా?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?

మోదీతోనే చంద్రబాబు గేమ్స్ ఆడుతున్నారా?

కొట్టుకుంటున్న నాయకులు.. జగన్‌ పట్టించుకోవట్లేదా?

సీఎం అయితే ఎలా.. ఇప్పటి నుంచే బాబు ప్లానింగ్‌?

ఆ మూడు అంశాలే మళ్లీ జగన్‌ను గెలిపిస్తాయా?

పవన్‌ సీఎం కావాలంటే.. అదొక్కటే దారి?

జగన్‌.. క్యాడర్‌ను కాపాడుకోవట్లేదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>