PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/why-chandrababu-his-self-did-not-allot-tidco-houses0737e024-55e6-4a05-bd39-20083032f995-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/why-chandrababu-his-self-did-not-allot-tidco-houses0737e024-55e6-4a05-bd39-20083032f995-415x250-IndiaHerald.jpgఇక్కడ చంద్రబాబు చెప్పిందాంట్లో రెండు విషయాలు మాత్రమే కరెక్టు. మరో విషయాన్ని చెప్పకుండా దాచేశారు. వాస్తవాలు ఏమిటంటే చంద్రబాబు హయాంలో లక్షల ఇళ్ళ నిర్మాణాలు మొదలైన మాట వాస్తవం. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని లబ్దిదారులకు ఇవ్వని మాటా వాస్తవమే. అయితే మధ్యలో ఏమి జరిగిందనే విషయం మాత్రం చాలామందికి తెలీదు. 2019కి ముందు ఎన్నికలు వస్తున్నాయని హడావుడి చేసిన చంద్రబాబు ఇళ్ళ నిర్మాణాలను మొదలుపెట్టించారు. tdp chandrababu jagan{#}TECHNOLOGY;CBN;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Jagan;Elections;Ministerఅమరావతి : టిడ్కో ఇళ్ళపై చంద్రబాబు దాచిపెడుతున్నదిదేనా ?అమరావతి : టిడ్కో ఇళ్ళపై చంద్రబాబు దాచిపెడుతున్నదిదేనా ?tdp chandrababu jagan{#}TECHNOLOGY;CBN;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Jagan;Elections;MinisterSun, 09 Apr 2023 09:00:00 GMT


నెల్లూరు పర్యటనలో జగన్మోహన్ రెడ్డికి  చంద్రబాబునాయుడు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. ఇంతకీ అదేమిటంటే నెల్లూరులో తన హయాంలో కట్టిన టిడ్కో ఇళ్ళముందు నిలబడి చంద్రబాబు సెల్ఫీ దిగారు. ఆ సెల్ఫీని ట్విట్టర్లో పోస్టుచేసి జగన్ కు సవాలు విసిరారు. తాను కట్టిన లక్షలాది ఇళ్ళని అధికారంలోకి వచ్చిన తర్వాత  జగన్ ఎందుకివ్వలేదని నిలదీశారు. తన హయాంలో ఏడున్నర లక్షల ఇళ్ళు కడితే జగన్ వాటిని పేదలకు ఇవ్వకుండా దెయ్యాల కొంపలుగా మార్చేశారని మండిపోయారు.





ఇక్కడ చంద్రబాబు చెప్పిందాంట్లో రెండు విషయాలు మాత్రమే కరెక్టు. మరో విషయాన్ని చెప్పకుండా దాచేశారు. వాస్తవాలు ఏమిటంటే చంద్రబాబు హయాంలో లక్షల ఇళ్ళ నిర్మాణాలు మొదలైన మాట వాస్తవం. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని లబ్దిదారులకు ఇవ్వని మాటా వాస్తవమే. అయితే మధ్యలో ఏమి జరిగిందనే విషయం మాత్రం చాలామందికి తెలీదు. 2019కి ముందు ఎన్నికలు వస్తున్నాయని హడావుడి చేసిన చంద్రబాబు ఇళ్ళ నిర్మాణాలను మొదలుపెట్టించారు.





మిగిలిన ప్రాంతాల్లో ఎలాగున్నా నెల్లూరులో గెలవటం కోసం అప్పటి మున్సిపల్ మంత్రి షీర్ వాల్ టెక్నాలజీ పేరుతో ఇళ్ళని వేగంగా కట్టించే ప్రయత్నం చేశారు. అనుకున్నట్లే నిర్మాణంలో స్పీడు పెంచారు. ఇంతలో ఎన్నికల షెడ్యూల్ వస్తోందని తెలిసింది. దాంతో సామూహిక గృహప్రవేశాల పేరుతో చంద్రబాబు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేయించుకున్నారు. లబ్దిదారులకు ఇళ్ళని ఇచ్చేస్తున్నట్లు  బిల్డప్ ఇచ్చారు.





అయితే తమకు కేటాయించిన ఇళ్ళని చూసిన వారికి పెద్ద షాక్ కొట్టింది. ఎందుకంటే నిర్మించామని చెప్పుకున్న ఇళ్ళకి కరెంటు, మంచినీటి, డ్రైనేజి సౌకర్యాలు లేవు. ఇవేవీ కల్పించకుండానే  సామూహిక గృహప్రవేశాల పేరుచెప్పి జనాలను మోసం చేశారు. మౌళిక సదుపాయాలు లేని ఇళ్ళల్లో ఎలాగుంటామని చెప్పి లబ్దిదారులు వాటిల్లో చేరలేదు. నిజంగానే అన్నీ సౌకర్యాలతో చంద్రబాబు ఇళ్ళని నిర్మించేసుంటే మరి తానే లబ్దిదారులకు ఇళ్ళని ఎందుకు ఇవ్వలేదు ? 7.5 లక్షల ఇళ్ళని తాను నిర్మిస్తే జగన్ కేటాయించలేదని గోల చేస్తున్నారు. అది నిజమే అయితే తన హయాంలో తానే లబ్దిదారులకు ఎందుకివ్వలేదో  చంద్రబాబు సమాధానం చెప్పగలరా ? 









RRR Telugu Movie Review Rating

పుష్ప-2 అమ్మవారి గెటప్ వెనుక.. ఇంత కథ ఉందా?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?

మోదీతోనే చంద్రబాబు గేమ్స్ ఆడుతున్నారా?

కొట్టుకుంటున్న నాయకులు.. జగన్‌ పట్టించుకోవట్లేదా?

సీఎం అయితే ఎలా.. ఇప్పటి నుంచే బాబు ప్లానింగ్‌?

ఆ మూడు అంశాలే మళ్లీ జగన్‌ను గెలిపిస్తాయా?

పవన్‌ సీఎం కావాలంటే.. అదొక్కటే దారి?

జగన్‌.. క్యాడర్‌ను కాపాడుకోవట్లేదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>