EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/navamid862d14e-71b7-4389-8fad-2028d093c182-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/navamid862d14e-71b7-4389-8fad-2028d093c182-415x250-IndiaHerald.jpgఎవరికైనా మతపరమైన అభిమానం ఉండొచ్చు కానీ ఆ అభిమానం ముదిరి పాకాన పడకూడదు. దానివల్ల ఎటువంటి విద్వేషాలు చెలరేగకూడదు. వాస్తవంగా బక్రీదుకు ఒకచోట ఉండి కార్యక్రమాలు చేసుకుంటారు. రంజాన్ కూడా ఒక చోట ఉండి కార్యక్రమాలు చేసుకుంటారు. కానీ క్రమంగా అందులోని కొంతమంది పెద్దలు కావాలని ఆ కార్యక్రమాలను విస్తరిస్తూ రోడ్లమీద, రైల్వే స్టేషన్ లో, బస్టాండ్లో కొంతమంది చేస్తూ ఉన్నారు. ఈఫిల్ టవర్ దగ్గర కూడా చేసింది మనం గమనించం. ఇదివరకు వాళ్ళు ఇలా చేయలేదు. ఇప్పుడే ఎందుకు చేస్తున్నారంటే ఎవరు ఆపుతారో చూద్దామని, మన ఓట్లు వాళ్NAVAMI{#}Maharashtra;Ramzan;Eiffel Tower;Maha;GEUM;Jayanthi;central government;Manam;Yevaruహిందువుల పండుగల్లో హింస.. ఎందుకలాగ?హిందువుల పండుగల్లో హింస.. ఎందుకలాగ?NAVAMI{#}Maharashtra;Ramzan;Eiffel Tower;Maha;GEUM;Jayanthi;central government;Manam;YevaruSun, 09 Apr 2023 10:00:00 GMTఎవరికైనా మతపరమైన అభిమానం ఉండొచ్చు కానీ ఆ అభిమానం ముదిరి పాకాన పడకూడదు. దానివల్ల ఎటువంటి విద్వేషాలు చెలరేగకూడదు. వాస్తవంగా బక్రీదుకు ఒకచోట ఉండి కార్యక్రమాలు చేసుకుంటారు. రంజాన్ కూడా ఒక చోట ఉండి కార్యక్రమాలు చేసుకుంటారు. కానీ క్రమంగా అందులోని కొంతమంది పెద్దలు కావాలని ఆ కార్యక్రమాలను విస్తరిస్తూ రోడ్లమీద, రైల్వే స్టేషన్ లో, బస్టాండ్లో కొంతమంది చేస్తూ ఉన్నారు. ఈఫిల్ టవర్ దగ్గర కూడా చేసింది మనం గమనించం.


 ఇదివరకు వాళ్ళు ఇలా చేయలేదు. ఇప్పుడే ఎందుకు చేస్తున్నారంటే ఎవరు ఆపుతారో చూద్దామని, మన ఓట్లు వాళ్ళకి కావాలి కదా అనే ఉద్దేశంతో దాని వెనకాల మళ్ళీ ఒక పొలిటికల్ ఇంటెన్షన్ ఉంటుందని, అలా సైకలాజికల్ గేమ్ ని వాళ్ళ చేసుకుంటూ వస్తున్నారని కొంతమంది సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు.


శ్రీరామనవమి లాంటి పండుగలు కూడా గుడిలోనే ఉండి చేస్తూ ఉంటారు. మహా అయితే బయట ఊరేగింపులు చేస్తూ ఉంటారు‌. కానీ ప్రత్యేకించి శోభాయాత్ర లాంటివి గతంలో జరిగేవి కావు.  మొన్న శ్రీరామనవమి, ఇప్పుడు హనుమాన్ జయంతి సందర్భంగా ఇండియాలో శోభాయాత్రలు మొదలైనట్టే అనుకోవాలి. అక్కడ తాము చేసుకుంటూ వచ్చిన దాన్ని వాళ్లు సమర్థించుకుంటూ వచ్చి, ఇప్పుడు దీన్ని అంగీకరించట్లేదు. దాని పర్యవసనమే గత వారం గుజరాత్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర మరియు బీహార్‌లలో రామనవమి సందర్భంగా హింస చెలరేగింది.


ఇప్పుడు దేశమంతా శోభాయాత్రలు హనుమాన్ జయంతి సందర్భంగా ముందు ఒక వారం రోజులు వెనక ఒక వారం రోజులు తేదీలు పెట్టుకొని మరి జరుపుతున్న సందర్భంగా, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడానికి అవకాశం ఉన్న రాష్ట్రాలన్నింటిలో కూడా ఇమ్మీడియేట్ గా జాగ్రత్తలు తీసుకోవాలని, రాష్ట్రాలు ప్రిపేర్ గా ఉండాలని, అవసరమైతే కేంద్ర బలగాలను పంపడానికి సిద్ధంగా ఉన్నామని తాజాగా కేంద్ర ప్రభుత్వం  అధికారికంగా చెప్పుకొచ్చింది. సమాజంలో మత సామరస్యానికి భంగం కలిగించే ఏ అంశాన్నైనా పర్యవేక్షించాలని హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను కోరింది.



RRR Telugu Movie Review Rating

అయ్య బాబోయ్.. బతికుండగానే.. అంతిమయాత్ర చేసుకున్నాడు?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?

మోదీతోనే చంద్రబాబు గేమ్స్ ఆడుతున్నారా?

కొట్టుకుంటున్న నాయకులు.. జగన్‌ పట్టించుకోవట్లేదా?

సీఎం అయితే ఎలా.. ఇప్పటి నుంచే బాబు ప్లానింగ్‌?

ఆ మూడు అంశాలే మళ్లీ జగన్‌ను గెలిపిస్తాయా?

పవన్‌ సీఎం కావాలంటే.. అదొక్కటే దారి?

జగన్‌.. క్యాడర్‌ను కాపాడుకోవట్లేదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>