PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-ramoji-jagan87320d01-ece3-4b99-8d69-1bb9d6bbee09-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-ramoji-jagan87320d01-ece3-4b99-8d69-1bb9d6bbee09-415x250-IndiaHerald.jpgమిగిలిన ఆరు కేసుల విచారణలో ఏమి జరుగుతుందో ఎవరు ఊహించలేకున్నారు. రామోజీని 3వ తేదీ, శైలజను 6వ తేదీన విచారణ జరిగింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే విచారణతో మామా, కోడళ్ళు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా చంద్రబాబునాయుడు అండ్ కో ఎందుకని నోరిప్పటంలేదు. చంద్రబాబు, లోకేష్ తో పాటు తమ్ముళ్ళల్లో ఒక్కళ్ళు కూడా రామోజీకి మద్దతుగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. చంద్రబాబు కోసమే జగన్మోహన్ రెడ్డితో వైరం పెట్టుకున్నారన్న విషయం అందరికీ తెలుసు. chandrababu ramoji jagan{#}ramoji rao;vedhika;Lokesh;Lokesh Kanagaraj;Jagan;CBN;YCP;Yevaruఅమరావతి : రామోజీ ఏమాత్రం ఊహించలేదా ?అమరావతి : రామోజీ ఏమాత్రం ఊహించలేదా ?chandrababu ramoji jagan{#}ramoji rao;vedhika;Lokesh;Lokesh Kanagaraj;Jagan;CBN;YCP;YevaruSun, 09 Apr 2023 05:00:00 GMT



చంద్రబాబునాయుడు నుండి ఇలాంటి ట్విస్టు ఎదురవుతుందని బహుశా రామోజీరావు ఊహించుండరు. మార్గదర్శి చిట్ ఫండ్ మోసాలపై సీఐడీ ఇప్పటికే ఛైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజను సీఐడీ విచారించిన విషయం తెలిసిందే. రామోజీ, శైలజ ఏ1, ఏ2గా నమోదైన ఏడు కేసుల్లో ఇప్పటికి మొదటి విచారణ మాత్రమే జరిగింది. ఇంకా ఇద్దరినీ ఆరుకేసుల్లో విచారణ జరుపుతామని సీఐడీ ఎస్పీ ప్రకటించారు. రెండోవిడత విచారణ వేదిక అమరావతికి మారుతున్నట్లు కూడా ప్రకటించారు.





మిగిలిన ఆరు కేసుల విచారణలో ఏమి జరుగుతుందో ఎవరు ఊహించలేకున్నారు. రామోజీని 3వ తేదీ, శైలజను 6వ తేదీన విచారణ జరిగింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే విచారణతో మామా, కోడళ్ళు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా చంద్రబాబునాయుడు అండ్ కో ఎందుకని నోరిప్పటంలేదు. చంద్రబాబు, లోకేష్ తో పాటు తమ్ముళ్ళల్లో ఒక్కళ్ళు కూడా రామోజీకి మద్దతుగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. చంద్రబాబు కోసమే జగన్మోహన్ రెడ్డితో వైరం పెట్టుకున్నారన్న విషయం అందరికీ తెలుసు.





రామోజీ-జగన్ మధ్య మొదటినుండి మంచి సంబంధాలు లేకపోయినా డైరెక్టుగా ఇద్దరి మధ్య వైరం కూడా లేదు. ఒకటిరెండు సందర్భాల్లో ఇద్దరు కలుసుకున్నపుడు రామోజీకి జగన్ నమస్కారం పెట్టి  ఇవ్వాల్సినంత మర్యాద ఇచ్చారు. అయినా జగన్ను అనవసరంగా రామోజీ ఎందుకు కెలుక్కున్నారంటే కేవలం చంద్రబాబు కోసమే. రామోజీ కష్టాల్లో ఉన్నపుడు తాను కాకపోయినా కనీసం తమ్ముళ్ళతో అయినా చంద్రబాబు మాట్లాడించక పోవటమే ఆశ్చర్యంగా ఉంది. 





చంద్రబాబు కోసమే గడచిన 13 ఏళ్ళుగా జగన్ పైన రామోజీ వార్తలు, కథనాలు వండి వారుస్తున్నారు. అవసరమం లేకపోయినా ఏదోకటి సృష్టించో లేకపోతే పాతవో తీసుకొచ్చి బ్యానర్లు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపణలు కూడా చేస్తున్నారు. అయినా జగన్ కు వ్యతిరేకంగా రామోజీ రెచ్చిపోతున్నారే కానీ తగ్గలేదు. అలాంటిది ఇపుడు రామోజీనే విచారణపేరుతో పీకల్లలోతు ఇరుక్కుపోతే చంద్రబాబు తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.  చంద్రబాబు నుండి ఇలాంటి వైఖరిని బహుశా రామోజీ కూడా ఊహించలేదేమో.




RRR Telugu Movie Review Rating

అమరావతి : రామోజీ ఏమాత్రం ఊహించలేదా ?

సీఎం అయితే ఎలా.. ఇప్పటి నుంచే బాబు ప్లానింగ్‌?

ఆ మూడు అంశాలే మళ్లీ జగన్‌ను గెలిపిస్తాయా?

పవన్‌ సీఎం కావాలంటే.. అదొక్కటే దారి?

జగన్‌.. క్యాడర్‌ను కాపాడుకోవట్లేదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>