EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu9310fff6-f9dc-4e4f-b731-82ee67974e2d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu9310fff6-f9dc-4e4f-b731-82ee67974e2d-415x250-IndiaHerald.jpgచంద్రబాబు ఇచ్చిన సంక్షేమ పథకాలు, జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాల్లో తేడా చాలానే ఉంటుంది. చంద్రబాబు రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చెప్పి చేయలేదు. డ్వాక్రా మహిళలకు సంపూర్ణ రుణ మాఫీ అమలును అటకెక్కించారు. పావల వడ్డీ రుణాలు, జీరో వడ్డీ రుణాలను పక్కన పెట్టారని వైసీపీ ఆరోపిస్తుంది. చివరకు ఇచ్చిన పది వేల రూపాయాలతోనే సర్దుకుపోతారని చంద్రబాబు భావించారని విమర్శలు చేస్తుంటారు. పెన్షన్లకు సంబంధించి కూడా బాబు రూ. 1000 ప్రకటించారు. కానీ జగన్ 3000 వేలు ఇస్తామని చెప్పగానే చంద్రబాబు రూ. 2 వేలకు పెన్షన్లను పెంచేశారుCHANDRABABU{#}Sri Lanka;DWCRA;zero;Government;CBN;Jagan;media;YCP;TDPసీఎం అయితే ఎలా.. ఇప్పటి నుంచే బాబు ప్లానింగ్‌?సీఎం అయితే ఎలా.. ఇప్పటి నుంచే బాబు ప్లానింగ్‌?CHANDRABABU{#}Sri Lanka;DWCRA;zero;Government;CBN;Jagan;media;YCP;TDPSun, 09 Apr 2023 00:00:00 GMTచంద్రబాబు ఇచ్చిన సంక్షేమ పథకాలు, జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాల్లో తేడా చాలానే ఉంటుంది. చంద్రబాబు రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చెప్పి చేయలేదు. డ్వాక్రా మహిళలకు సంపూర్ణ రుణ మాఫీ అమలును అటకెక్కించారు. పావల వడ్డీ రుణాలు, జీరో వడ్డీ రుణాలను పక్కన పెట్టారని వైసీపీ ఆరోపిస్తుంది. చివరకు ఇచ్చిన పది వేల రూపాయాలతోనే సర్దుకుపోతారని చంద్రబాబు భావించారని విమర్శలు చేస్తుంటారు. పెన్షన్లకు సంబంధించి కూడా బాబు రూ. 1000 ప్రకటించారు. కానీ జగన్ 3000 వేలు ఇస్తామని చెప్పగానే చంద్రబాబు రూ. 2 వేలకు పెన్షన్లను పెంచేశారు.


సంక్షేమ పథకాల అమలు వల్ల ప్రజలకు లాభం చేకూరుతుందన్నది నిజం. కానీ వాటిని ప్రవేశపెట్టిన తర్వాత తీసేయడం కుదరదు. కానీ ఆ పథకానికి డబ్బులు ఎలా సమకూరుస్తారన్నది అసలైన ప్రశ్న. ఇప్పటికే అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నారు. ఎప్ ఆర్ బీఎం కూడా కొత్త అప్పులు ఇచ్చేందుకు సిద్దంగా లేనట్లు తెలుస్తోంది. ఉచిత పథకాలు ప్రవేశపెట్టడం వల్ల శ్రీలంక లాంటి పరిస్థితులు రాష్ట్రంలో కూడా వస్తాయని పత్రికలు, మీడియా సంస్థలు, కొంత మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


సంక్షేమ పథకాలు అమలు  చేయకపోతే ప్రభుత్వానికి మనుగడ ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను తొలగిస్తామని ప్రచారం చేసి గెలవగలదా లేదు. కానీ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పనుల వల్లే రాష్ట్రం అప్పుల కుప్పగా మారుతుందని విమర్శలు చేస్తోంది. టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలు కూడా  అప్పులు తీసుకొచ్చి పెట్టినవే అని మరిచిపోతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న మీడియాతో రాష్ట్రంలో అప్పులు పెరిగిపోతున్నాయని ప్రచారం చేస్తున్నారు.


అయితే ప్రభుత్వం కొన్ని విషయాల్లో అప్పులు చేయక తప్పదు. కానీ దానికి తగిన ఆదాయం వచ్చేలా కొన్ని ప్రణాళికలు వేసుకోవాలి. ఏ ప్రభుత్వమైనా సంక్షేమ పథకాల అమలును ఆపలేవు. కానీ ఖర్చును తగ్గించుకుని ప్రజల నెత్తిపై మోసిన అప్పుల భారాన్ని తగ్గిస్తే మంచిది.



RRR Telugu Movie Review Rating

సీఎం అయితే ఎలా.. ఇప్పటి నుంచే బాబు ప్లానింగ్‌?

ఆ మూడు అంశాలే మళ్లీ జగన్‌ను గెలిపిస్తాయా?

పాలరాతి శిల్పం లా హనీ రోజ్ అందాలు..!!

పవన్‌ సీఎం కావాలంటే.. అదొక్కటే దారి?

జగన్‌.. క్యాడర్‌ను కాపాడుకోవట్లేదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>