Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-8133536c-e323-4fa2-85e7-b6cf1103eec4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-8133536c-e323-4fa2-85e7-b6cf1103eec4-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం రావణాసుర.ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రానికి వసూళ్ల పరంగానూ దూసుకెళ్తోంది. నెగిటివ్ పాత్రలో రవితేజ పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడుతున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ ఫిల్మ్ వర్గాల్లో నడుస్తోంది. ఈ మూవీ ఓటీటీ విడుదలకు సంబందించిన వార్త బయటకొచ్చింది. రావణాసుర ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. Socialstars lifestyle {#}daksha;vedhika;contract;Chitram;megha akash;pujitha;sudheer varma;Ravi;ravi teja;Cinemaన్యూ అప్డేట్ తో వచ్చిన రావణాసుర మూవీ ....!!న్యూ అప్డేట్ తో వచ్చిన రావణాసుర మూవీ ....!!Socialstars lifestyle {#}daksha;vedhika;contract;Chitram;megha akash;pujitha;sudheer varma;Ravi;ravi teja;CinemaSun, 09 Apr 2023 16:13:15 GMTమాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం రావణాసుర.ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రానికి వసూళ్ల పరంగానూ దూసుకెళ్తోంది. నెగిటివ్ పాత్రలో రవితేజ పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడుతున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ ఫిల్మ్ వర్గాల్లో నడుస్తోంది. ఈ మూవీ ఓటీటీ విడుదలకు సంబందించిన వార్త బయటకొచ్చింది.

రావణాసుర ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. భారీ ధరకు ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్నట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం. అంతేకాకుండా ఓటీటీ విడుదల విషయంలోనూ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. రావణాసుర మేకర్స్‌తో ఈ ఓటీటీ సంస్థ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం విడుదలైన 8 వారాల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే రావణాసుర శాటిలైట్ రైట్స్‌ను జీ సంస్థ సొంతం చేసుకుంది. 50 రోజల తర్వాత అంటే మే చివర్లో ఈ మూవీ డిజిటల్‌తో పాటు టీవీల్లోనూ సందడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక థియేటర్లలో విడుదలైన తొలి రోజు రావణాసుర ఏడు కోట్ల గ్రాస్‌ను రూ.3 కోట్ల 80 లక్షల షేర్‌ను సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ పండితుల అంచనా. అయితే రవితేజ గత చిత్రం ధమాకా ఓపెనింగ్స్‌ను మాత్రం ఇది బీట్ చేయలేకపోయింది. ధమాకా తొలి రోజు రూ. 10 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.

అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హర్షన్ వర్ధన్ రామేశ్వర్-భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చారు. సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అను ఇమ్మాన్యూయేల్, ఫరియా అబ్దుల్లా, దక్ష నాగర్కర్, పూజిత పొన్నాడ, మేఘ ఆకాష్ కీలక పాత్రలు పోషించారు.



RRR Telugu Movie Review Rating

మీటర్: మైత్రికి చెత్త రికార్డ్.. పరువు పొయిందిగా?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?

మోదీతోనే చంద్రబాబు గేమ్స్ ఆడుతున్నారా?

కొట్టుకుంటున్న నాయకులు.. జగన్‌ పట్టించుకోవట్లేదా?

సీఎం అయితే ఎలా.. ఇప్పటి నుంచే బాబు ప్లానింగ్‌?

ఆ మూడు అంశాలే మళ్లీ జగన్‌ను గెలిపిస్తాయా?

పవన్‌ సీఎం కావాలంటే.. అదొక్కటే దారి?

జగన్‌.. క్యాడర్‌ను కాపాడుకోవట్లేదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>