Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhonicdf72341-ee10-44fd-8873-b264057e5748-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhonicdf72341-ee10-44fd-8873-b264057e5748-415x250-IndiaHerald.jpgప్రపంచ క్రికెట్లో డిఆర్ఎస్ అనే ఒక రూల్ ఉంది అన్న విషయం తెలిసిందే. డిఆర్ఎస్ అంటే ఎంపైర్ ఇచ్చిన నిర్ణయాన్ని సవాలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే థర్డ్ అంపైర్ ఇక అక్కడ ఏం జరిగింది అన్న విషయాన్ని మరోసారి రివ్యూ చేసి క్షుణ్ణంగా పరిశీలించి.. ఇక తుది నిర్ణయం ఏంటి అన్నది వెల్లడించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాలి. అయితే క్రికెట్ లో ఉండే డిఆర్ఎస్ అనే రూల్ గురించి వినిపించగానే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ధోని రివ్యూ సిస్టం అనే ఫుల్ ఫామ్ గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇక ఇప్పటికీ కూడా ఎంతోమంDhoni{#}surya sivakumar;Cricket;Ishan Kishan;MS Dhoni;Mumbaiడిఆర్ఎస్ ను.. ధోని రివ్యూ సిస్టం అని అందుకే అంటారు మరి?డిఆర్ఎస్ ను.. ధోని రివ్యూ సిస్టం అని అందుకే అంటారు మరి?Dhoni{#}surya sivakumar;Cricket;Ishan Kishan;MS Dhoni;MumbaiSun, 09 Apr 2023 11:30:00 GMTప్రపంచ క్రికెట్లో డిఆర్ఎస్ అనే ఒక రూల్ ఉంది అన్న విషయం తెలిసిందే. డిఆర్ఎస్ అంటే ఎంపైర్ ఇచ్చిన నిర్ణయాన్ని సవాలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే థర్డ్ అంపైర్ ఇక అక్కడ ఏం జరిగింది అన్న విషయాన్ని మరోసారి రివ్యూ చేసి క్షుణ్ణంగా పరిశీలించి.. ఇక తుది నిర్ణయం ఏంటి అన్నది వెల్లడించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాలి. అయితే క్రికెట్ లో ఉండే డిఆర్ఎస్ అనే రూల్ గురించి వినిపించగానే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ధోని రివ్యూ సిస్టం అనే ఫుల్ ఫామ్ గుర్తుకు వస్తూ ఉంటుంది.



 ఇక ఇప్పటికీ కూడా ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులకు డిఆర్ఎస్ ఫుల్ ఫామ్ అంటే ఏంటో మాత్రం తెలియదు. అందరూ నిజంగానే ధోని రివ్యూ సిస్టం ఏమో అని అనుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఎందుకంటే అంతలా తన రివ్యూ లతో ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు ధోని. ధోని ఒకసారి రివ్యూ తీసుకున్నాడు అంటే అది 99.9% ఇక ధోనికి అనుకూలంగానే రిజల్ట్ వస్తుందని అభిమానులు నమ్ముతూ ఉంటారు. ఇక ధోని రివ్యూ తీసుకుంటే ప్రత్యర్థి బ్యాట్స్మెన్లు సైతం అవుట్ అని భావిస్తూ చివరికి మైదానాన్ని వీడుతూ ఉంటారు అని చెప్పాలి.


 డిఆర్ఎస్ ను ధోని రివ్యూ సిస్టం అని ఎందుకు అంటారు అన్న విషయం మరోసారి నిరూపించాడు ధోని. ఇటీవలే ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో ఇషాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత క్రీజు లోకి వచ్చాడు సూర్య కుమార్ యాదవ్. అయితే ముంబై ఇన్నింగ్స్ సమయంలో  శాంట్నర్ ఎనిమిదో ఓవర్ వేశాడు. ఆ సమయంలో సూర్యకుమార్ స్వీప్ షాట్ ఆడెందుకు ప్రయత్నించగా.. ధోని చేతుల్లోకి క్యాచ్ వెళ్ళింది. అయితే సూర్యకుమార్ బ్యాట్ కి తగిలినట్లు మాత్రం ఎక్కడ కనిపించలేదు. కానీ ధోని మాత్రం అప్పీల్ చేశాడు. కానీ ఫీల్డ్ ఎంపైర్ వైడ్ గా ప్రకటించాడు. దీంతో ధోని రివ్యూ కు వెళ్లగా.. అతని గ్లౌస్ కి బంతి తగిలినట్లు తేలింది. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని సూర్యకుమార్ను ఔట్ గా ప్రకటించాడు.



RRR Telugu Movie Review Rating

అయ్య బాబోయ్.. బతికుండగానే.. అంతిమయాత్ర చేసుకున్నాడు?

మళ్లీ మళ్లీ.. వరల్డ్ నెంబర్ 1.. మోదీనే?

మోదీతోనే చంద్రబాబు గేమ్స్ ఆడుతున్నారా?

కొట్టుకుంటున్న నాయకులు.. జగన్‌ పట్టించుకోవట్లేదా?

సీఎం అయితే ఎలా.. ఇప్పటి నుంచే బాబు ప్లానింగ్‌?

ఆ మూడు అంశాలే మళ్లీ జగన్‌ను గెలిపిస్తాయా?

పవన్‌ సీఎం కావాలంటే.. అదొక్కటే దారి?

జగన్‌.. క్యాడర్‌ను కాపాడుకోవట్లేదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>