Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-e67e98f1-17e8-452f-bfd2-f45de40d7210-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-e67e98f1-17e8-452f-bfd2-f45de40d7210-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరోయిన్ సొట్ట బుగ్గల సుందరి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే బ్యూటీ తాప్సీ పన్ను. మొదట ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది తాప్సి. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సి తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మొదటి సినిమా మంచి హిట్ అవడంతో ఈమెకు తెలుగులో వరుసగా అవకాశాలు లభించినప్పటికీ ఈమెకు హీరోయిన్ గా తగిన గుర్తింపు దక్కలేదు. ఈమె తెలుగులో ఝుమ్మంది నాదం, వస్తాడు నా రాజు, వీర, మిస్టర్ పర్ఫెక్ట్, సాహసం, మొగుడు, దరువు,గుండెల్లో గోదారిSocialstars lifestyle {#}Jhummandi Nadham;Tapsee Pannu;Naam Shabana;Varsham;Heroine;Thriller;BEAUTY;Instagram;Mister;Tollywood;Telugu;bollywood;Cinemaఆ సినిమా కోసం సిక్స్ ప్యాక్ బాడీతో రెడీ ఐనా తాప్సీ....!!ఆ సినిమా కోసం సిక్స్ ప్యాక్ బాడీతో రెడీ ఐనా తాప్సీ....!!Socialstars lifestyle {#}Jhummandi Nadham;Tapsee Pannu;Naam Shabana;Varsham;Heroine;Thriller;BEAUTY;Instagram;Mister;Tollywood;Telugu;bollywood;CinemaSat, 08 Apr 2023 07:46:46 GMTటాలీవుడ్ హీరోయిన్ సొట్ట బుగ్గల సుందరి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే బ్యూటీ తాప్సీ పన్ను. మొదట ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది తాప్సి.

మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సి తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మొదటి సినిమా మంచి హిట్ అవడంతో ఈమెకు తెలుగులో వరుసగా అవకాశాలు లభించినప్పటికీ ఈమెకు హీరోయిన్ గా తగిన గుర్తింపు దక్కలేదు.

ఈమె తెలుగులో ఝుమ్మంది నాదం, వస్తాడు నా రాజు, వీర, మిస్టర్ పర్ఫెక్ట్, సాహసం, మొగుడు, దరువు,గుండెల్లో గోదారి, షాడో, ఆనందోబ్రహ్మ లాంటి మంచి మంచి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈమె తెలుగులో పలు సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు తగిన గుర్తింపు దక్కకపోవడంతో బాలీవుడ్ కి చెక్కేసింది. ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్ వైపు చూడకుండా బాలీవుడ్ లో వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది తాప్సి. తెలుగు సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా హీరోయిన్ తాప్సి సిక్స్ ప్యాక్ బాడీ తో కనిపించి ఒకేసారిగా షాక్ ఇచ్చింది. అదేంటి హీరోయిన్ సిక్స్ ప్యాక్ ఏంటి అనుకుంటున్నారా? తాజాగా అందుకు సంబంధించిన ఫోటో కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న డుంకీ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే నామ్ షబానా సినిమా సీక్వెల్ లో కూడా నటిస్తోంది. అయితే ఈ స్ప్రే యాక్షన్ థ్రిల్లర్ సినిమా కోసం రెడీ అయ్యిందా లేదంటే క్యాజువల్ గాని ఇలా రెడీ అయిందా అన్నది అర్థం కావడం లేదు. అందుకు సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ ఖాతా లో షేర్ చేసింది. ఆ ఫోటోలో తాప్సీ తో పాటు ఆమె జిమ్ ట్రైనర్ కూడా ఉన్నారు. చాలామంది ఆ ఫోటోని చూసి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సిక్స్ ప్యాక్ బాడీ సూపర్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

అందుకే బాలీవుడ్ సినిమాలు హిట్ అవ్వట్లేదు : సల్మాన్ ఖాన్

పవన్‌ ఢిల్లీ టూర్‌లో ఏం జరిగింది?

కర్ణాటకలో ఈసారి గెలుపు కాంగ్రెస్‌దేనా?

ఆ 15 మందికి జగన్ మళ్లీ టికెట్‌ ఇవ్వరా?

పవన్ టీమ్‌.. బీజేపీలో ఆయన్ను టార్గెట్‌ చేస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>