MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani2324f630-3a0c-4342-ad73-c8231f70e482-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani2324f630-3a0c-4342-ad73-c8231f70e482-415x250-IndiaHerald.jpgఎట్టకేలకు నాని 100 కోట్ల కలక్షన్స్ కలను ‘దసరా’ నెరవేర్చడంతో ప్రస్తుతం నాని మంచి జోష్ లో ఉన్నాడు. ఈసినిమా పై ఉన్న నమ్మకంతో అతడు నెల రోజులుగా దేశం అంతా తిరిగి ఈసినిమాను పాన్ ఇండియా మూవీగా ప్రమోట్ చేసాడు. ఈ ప్రమోషన్ కు మూవీ నిర్మాతలకు 7 కోట్ల వరకు ఖర్చు అయింది అన్నవార్తలు కూడ ఉన్నాయి. ఈమూవీ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాలలో ఘన విజయం సాధించినప్పటికీ ఉత్తరాది రాష్ట్రాలలో ఈమూవీకి ఇప్పటి వరకు వచ్చిన కలక్షన్స్ కేవలం 2 కోట్ల లోపు మాత్రమే అన్నప్రచారం జరుగుతోంది.ఈమూవీలో కీర్తి సురేష్ కీలకమNANI{#}vennela;Godavari River;Kannada;Tom Banton;Tom Hooper;Athadu;keerthi suresh;Nani;Tamil;Telangana;Audience;Josh;India;Telugu;Cinemaఆ విషయంలో నాని కలలు నెరవేర్చలేకపోయిన దసరా !ఆ విషయంలో నాని కలలు నెరవేర్చలేకపోయిన దసరా !NANI{#}vennela;Godavari River;Kannada;Tom Banton;Tom Hooper;Athadu;keerthi suresh;Nani;Tamil;Telangana;Audience;Josh;India;Telugu;CinemaSat, 08 Apr 2023 09:00:00 GMTఎట్టకేలకు నాని 100 కోట్ల కలక్షన్స్ కలను ‘దసరా’ నెరవేర్చడంతో ప్రస్తుతం నాని మంచి జోష్ లో ఉన్నాడు. ఈసినిమా పై ఉన్న నమ్మకంతో అతడు నెల రోజులుగా దేశం అంతా తిరిగి ఈసినిమాను పాన్ ఇండియా మూవీగా ప్రమోట్ చేసాడు. ఈ ప్రమోషన్ కు మూవీ నిర్మాతలకు 7 కోట్ల వరకు ఖర్చు అయింది అన్నవార్తలు కూడ ఉన్నాయి. ఈమూవీ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాలలో ఘన విజయం సాధించినప్పటికీ ఉత్తరాది రాష్ట్రాలలో ఈమూవీకి ఇప్పటి వరకు వచ్చిన కలక్షన్స్ కేవలం 2 కోట్ల లోపు మాత్రమే అన్నప్రచారం జరుగుతోంది.


ఈమూవీలో కీర్తి సురేష్ కీలకమైన వెన్నెల పాత్రలో నటించి మెప్పించినప్పటికీ ఈమూవీ పట్ల తమిళ ప్రేక్షకులు కానీ అదేవిధంగా తమిళ మీడియా కానీ పెద్దగా పట్టించుకోకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ‘దసరా’ మూవీలోని చంకీల అంగీలు వేసి పాటకు తెలుగు ప్రేక్షకులు విపరీతంగా కనెక్ట్ అయితే ఈపాటను కనీసం ఉత్తరాది ప్రేక్షకులు కానీ అదేవిధంగా తమిళ కన్నడ ప్రేక్షకులు కానీ పట్టించుకోలేదు అన్నకామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి.


ఈమూవీలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో నటించినప్పటికీ కన్నడ ప్రేక్షకులు కూడ ఈమూవీ పై పెద్దగా స్పందించలేదు అని అంటున్నారు. ఇక మళయాళ నటుడు టామ్ చాకో ఈమూవీలో ఉన్నప్పటికీ మళయాళ ప్రేక్షకులు కూడ ఈమూవీ పట్ల పెద్దగా ఆశక్తి కనపరచలేదు అన్నకామెంట్స్ వస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈమూవీకి నైజాం ఏరియాలో వచ్చినంత స్పందన గోదావరి జిల్లాలలో రాకపోవడంతో ఇంకా అక్కడ ఈమూవీ లాభాల బాట పట్టలేదు అని కూడ అంటున్నారు.


అంతేకాదు ‘పుష్ప’ మూవీ పై విపరీతంగా మ్యానియా ప్రదర్శించిన ఉత్తరాది ప్రేక్షకులు ఆ స్థాయిలో ‘దసరా’ గురించి ఆశక్తి కనపరచలేదు అన్న అభిప్రాయాలు కూడ ఉన్నాయి. ఏది ఎలా చూసుకున్నా నాని పాన్ ఇండియా కలలను ‘దసరా’ పూర్తిగా తీర్చలేక పోయింది అని అంటున్నారు. దీనితో నాని మార్కెట్ పాన్ ఇండియా స్థాయిలో పెద్దగా పెరగకపోవచ్చు అన్నకామెంట్స్ కుడా వస్తున్నాయి..






RRR Telugu Movie Review Rating

అందుకే బాలీవుడ్ సినిమాలు హిట్ అవ్వట్లేదు : సల్మాన్ ఖాన్

పవన్‌ ఢిల్లీ టూర్‌లో ఏం జరిగింది?

కర్ణాటకలో ఈసారి గెలుపు కాంగ్రెస్‌దేనా?

ఆ 15 మందికి జగన్ మళ్లీ టికెట్‌ ఇవ్వరా?

పవన్ టీమ్‌.. బీజేపీలో ఆయన్ను టార్గెట్‌ చేస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>