EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan49835172-7479-474b-9216-7f35c50c3a2c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan49835172-7479-474b-9216-7f35c50c3a2c-415x250-IndiaHerald.jpgఅధికారం కోసం పాదయాత్రలు చేసి ప్రజల్లోకి వెళతారు. అదే అధికారం చేతికి వచ్చిన తర్వాత ఆ ప్రజలకు దూరం అవుతారు. ప్రతి రాజకీయ పార్టీల్లోని నేతల పరిస్థితి ఇలాంటిదే. ప్రజలకే కాదు సొంత పార్టీ కార్యకర్తలకు కూడా టైం ఇవ్వరు. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న నేతలు కాకుండా అధికారం వచ్చిన తర్వాత ఒక గుంపు ఆ నాయకుడి చుట్టూ చేరి ఎవరిని ఆ దరి దాపుల్లోకి రానీయకుండా చేస్తుంది. ఏపీ సీఎం జగన్ చుట్టూ ఇలాంటి పరిస్థితి ఉందని ప్రతిపక్షాలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పది అంశాల్లో జగన్ పై వ్యతిరేకత కనిపిస్తోందని విశ్JAGAN{#}CM;YCP;Shakti;Jagan;TDP;School;CBN;Party;Andhra Pradesh;mediaజగన్‌ కొంప ముంచుతున్న పది అంశాలు ఇవే?జగన్‌ కొంప ముంచుతున్న పది అంశాలు ఇవే?JAGAN{#}CM;YCP;Shakti;Jagan;TDP;School;CBN;Party;Andhra Pradesh;mediaSat, 08 Apr 2023 10:00:00 GMTఅధికారం కోసం పాదయాత్రలు చేసి ప్రజల్లోకి వెళతారు. అదే అధికారం చేతికి వచ్చిన తర్వాత ఆ ప్రజలకు దూరం అవుతారు. ప్రతి రాజకీయ పార్టీల్లోని నేతల పరిస్థితి ఇలాంటిదే. ప్రజలకే కాదు సొంత పార్టీ కార్యకర్తలకు కూడా టైం ఇవ్వరు. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న నేతలు కాకుండా అధికారం వచ్చిన తర్వాత ఒక గుంపు ఆ నాయకుడి చుట్టూ చేరి ఎవరిని ఆ దరి దాపుల్లోకి రానీయకుండా చేస్తుంది. ఏపీ సీఎం జగన్ చుట్టూ ఇలాంటి పరిస్థితి ఉందని ప్రతిపక్షాలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


పది అంశాల్లో జగన్ పై వ్యతిరేకత కనిపిస్తోందని విశ్లేషణలు బయటకు వస్తున్నాయి. సీఎం జగన్ కు కార్యకర్తల  మధ్య అనుబంధం తెగిందనే ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది నాయకులు ఫండ్స్ రాక ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. మూడో అంశం ఎమ్మెల్యేల అసంతృప్తి.. స్కూల్ మాస్టర్ లాగా సీఎం జగన్ అందరినీ ఒకే చోట కూర్చొబెట్టి క్లాసులు పీకడం ఏంటని చర్చించుకుంటున్నట్లు టాక్.


చంద్రబాబు పై కూడా ఇలాంటి ఆరోపణలు గతంలోనే వచ్చాయి. ప్రజల్లోకి ఎమ్మెల్యేలు వెళ్లినపుడు రోడ్లు, డ్రైనేజీలు బాగోలేవు. వాటిని నిర్మించమని అడిగినపుడు వాటిని చేయలేకపోవడం, ప్రభుత్వానికి ఫండింగ్ లేకపోవడం, ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తి  ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయని చెబుతున్నారు.  


మీడియా అంశం కూడా వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మీడియా 80 శాతం వ్యతిరేకంగా ఉన్నట్లు జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తూ ఏళ్ల తరబడి పార్టీలో ఉన్న వారికి పదవులు ఇవ్వడం లేదనే ప్రధాన ఆరోపణ జగన్ పై ఉంది. కులాలకు సంబంధించి చిన్న చితకా అవకాశాలు ఇస్తున్నారు. కానీ వారికి గ్రౌండ్ లెవల్లో ఓట్లు వేయించేంత శక్తి లేకపోవడం,  మీడియా అడిగే ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పకపోవడమనేది ప్రజల్లో వ్యతిరేకత తీసుకొస్తుందని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.





RRR Telugu Movie Review Rating

విశాల్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు..!!

పవన్‌ ఢిల్లీ టూర్‌లో ఏం జరిగింది?

కర్ణాటకలో ఈసారి గెలుపు కాంగ్రెస్‌దేనా?

ఆ 15 మందికి జగన్ మళ్లీ టికెట్‌ ఇవ్వరా?

పవన్ టీమ్‌.. బీజేపీలో ఆయన్ను టార్గెట్‌ చేస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>